BigTV English
Advertisement

OTT Movie : అబ్బాయిపై మనసు పడే ఆడ నక్క… రాక్షస లోకంలో ప్రేమ పోరాటం … దిమ్మతిరిగిపోయే ఫ్యాంటసీ థ్రిల్లర్

OTT Movie : అబ్బాయిపై మనసు పడే ఆడ నక్క… రాక్షస లోకంలో ప్రేమ పోరాటం … దిమ్మతిరిగిపోయే ఫ్యాంటసీ థ్రిల్లర్

OTT Movie : ఫాంటసీ సినిమాలను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళవరకూ అందరూ ఇష్టంగా చూస్తారు. ఈ సినిమాలు చూస్తున్నప్పుడు మరో ప్రపంచంలోకి వెళ్ళినట్లు అనిపిస్తుంది. థియేటర్, ఓటీటీ లలో కూడా వీటికి ఎక్కువ డిమాండ్ ఉంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే చైనీస్ ఫాంటసీ మూవీలో ఒక అమ్మాయి ప్రేమ కోసం, రాక్షసులతో యుద్ధం చేస్తాడు హీరో. ఇందులో గ్రాఫిక్స్ చూపుతిప్పుకోకుండా చేస్తాయి. ఈ మూవీ కామిడీ, యాక్షన్ సన్నివేశాలతో చివరివరకూ అలరిస్తుంది. ఈ చైనీస్ ఫాంటసీ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే …


నెట్ ఫ్లిక్స్ (Netflix) లో

ఈ చైనీస్ ఫాంటసీ కామెడీ మూవీ పేరు ‘హాన్సన్ అండ్ ది బీస్ట్’ (Hanson and the Beast). ఇందులో ఫెంగ్ షాఫెంగ్, లియు యిఫీ ప్రధాన పాత్రలు పోషించారు. 2017 లో వచ్చిన ఈ మూవీకి యాంగ్ క్షియవో దర్శకత్వం వహించారు. ఈ ఫాంటసీ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ప్రేమ కోసం రక్షసులతో పోరాడే వ్యక్తి చుట్టూ స్టోరీ తిరుగుతుంది.


స్టోరీలోకి వెళితే 

యువాన్ షువై అనే ఒక జంతు సంరక్షకుడు అప్పుల్లో కూరుకుపోతాడు. తన ఆర్థిక సమస్యల నుండి బయటపడేందుకు, ధనవంతురాలైన తన స్నేహితురాలిని వెతుక్కుంటూ మ్యాచ్‌మేకింగ్ డేట్స్‌కు వెళ్తాడు. అనుకోకుండా అతను బై జియాన్‌చు అనే నక్క రాక్షసిని కలుస్తాడు. ఆమె అతను చిన్నప్పుడు రక్షించిన వ్యక్తి కావడంతో, అతనిపట్ల కృతజ్ఞత చూపించేందుకు మానవ రూపంలోకి వస్తుంది. ఆమె అందానికి అతడు మైమరచిపోతాడు. ఇక ఇప్పుడు వీరిద్దరూ ప్రేమలో పడతారు. కానీ రాక్షస నాయకుడు యున్ జాంగ్‌హీ, మానవులు, రాక్షసుల మధ్య ప్రేమ సంబంధాలను నిషేధిస్తాడు. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్న విషయం తెలిసి, అతను బై జియాన్‌చును తన లోకానికి తీసుకెళ్లిపోతాడు. తన ప్రేమను తిరిగి పొందేందుకు, యువాన్ షువై ధైర్యంగా రాక్షస లోకంలోకి ప్రవేశిస్తాడు.

రాక్షస లోకం ఈ యున్ జాంగ్‌హీ నియంత్రణలో ఉంటుంది. అతనే ఆ లోకానికి సుప్రీం గా ఉంటాడు.  అక్కడ అతను కఠినమైన నియమాలను అమలు చేస్తుంటాడు. ముఖ్యంగా మానవులు, రాక్షసుల మధ్య సంబంధాలను నిషేధిస్తాడు. వాళ్ళ వల్ల సమస్యలు రాకుండా, తమలోకం రహస్యంగా ఉండాలని అలా చేస్తాడు. యువాన్ షువై రాక్షస లోకంలోకి ప్రవేశించినప్పుడు. ఈ లోకం అతనికి పూర్తిగా కొత్తగా, ప్రమాదకరమైనదిగా అనిపిస్తుంది. మొదట్లో కంగారూపడినా, ఆ తరువాత తేరుకుని, అతను విచిత్రమైన జీవులు, మాయా శక్తులతోపాటు, యున్ జాంగ్‌హీ ఆధిపత్యాన్ని కూడా ఎదుర్కొంటాడు. చివరికి యువాన్ షువై తన ప్రియురాలిని దక్కించుకుంటాడా ? యున్ జాంగ్‌హీ ని ఒడిస్తాడా ? తన అప్పులను తీర్చుకుంటాడా ? ఈ విషయాలను తెలుసుకోవాలి అంటే, ఈ చైనీస్ ఫాంటసీ కామెడీ మూవీని మిస్ కాకుండా చూడండి.

Read Also : దెయ్యాల దేవతకు నరబలి ఇచ్చే మంత్రగత్తె … ఆచారం పేరుతో అమ్మాయిలని ఘోరంగా … వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్‌

Related News

OTT Movie : 240 కోట్ల కలెక్షన్స్, 10 అవార్డులు… ఈ బ్లాక్ బస్టర్ మూవీ హీరోని జైలుకు పంపిందన్న విషయం తెలుసా ?

Kiss movie OTT : కిస్ పెట్టుకుంటే ఫ్యూచర్లోకి… మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి సూపర్ హిట్ తమిళ్ మూవీ

Feminichi Fathima OTT : కేరళ స్టేట్ అవార్డ్స్ లో దుమ్మురేపిన ‘ఫెమినిచి ఫాతిమా’… ఓటీటీలో రిలీజ్ ఎప్పుడో తెలుసా?

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ 4 వెరీ స్పెషల్..

OTT Movie : ఎక్స్ కంటే డేంజర్ గా ఉండే 5 థ్రిల్లర్ సిరీస్ లు… యాక్షన్ మాత్రమే కాదు మజా ఇచ్చే అడ్వెంచర్ కూడా

Today Movies in TV : శుక్రవారం టీవీల్లోకి స్టార్ హీరోల సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

OTT Movie : ‘గేమ్ ఆఫ్ థ్రోన్’కు మించిన కంటెంట్ ఉన్న సిరీస్ మావా… అస్సలు వదలొద్దు

Phaphey Kuttniyan OTT : అందంగా దోచుకునే అమ్మాయిలు… కామెడీ మూవీకి క్రైమ్ ట్విస్ట్… 3 నెలల తరువాత ఓటీటీలోకి

Big Stories

×