BigTV English

Tamannaah: తమన్నాపై పవన్‌కు యూట్యూబర్ అన్వేష్ ఫిర్యాదు.. ప్రాణాలు తీసేస్తున్నారంటూ..

Tamannaah: తమన్నాపై పవన్‌కు యూట్యూబర్ అన్వేష్ ఫిర్యాదు.. ప్రాణాలు తీసేస్తున్నారంటూ..

Tamannaah: బెట్టింగ్ యాప్స్ గురించి గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ బెట్టింగ్ యాప్స్‌ను సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ చాలా ఆకర్షణీయంగా ప్రమోట్ చేయడం వల్లే చాలామంది దీనికి అడిక్ట్ అయ్యి ప్రాణాలు కోల్పోతున్నారని కొందరు ఓపెన్‌గా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ బెట్టింగ్ యాప్స్‌కు వ్యతిరేకంగా కూడా కొందరు పోరాటం మొదలుపెట్టారు. అందులో మొదటి వ్యక్తి యూట్యూబర్ అన్వేష్. నా అన్వేషణ పేరుతో ట్రావెలింగ్ వీడియోలు చేస్తూ ఫేమస్ అయిన అన్వేష్.. ఇప్పుడు బెట్టింగ్ మాఫియాపై తన ప్రతాపం చూపిస్తున్నాడు. తాజాగా తమన్నాపైనే యాక్షన్ తీసుకోమంటూ పవన్ కళ్యాణ్‌ను కోరుతూ ఒక వీడియో చేశాడు అన్వేష్.


కోట్లలో హవాలా

ఇప్పటికే ఎంతమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్, ఎంతమంది సెలబ్రిటీలు ఈ బెట్టింగ్ మాఫియాలో పాలుపంచుకున్నారో చెప్తూ అన్వేష్ చాలానే వీడియోలు రిలీజ్ చేశాడు. పైగా ఇన్‌ఫ్లుయెన్సర్స్ విషయంలో వారి ఆస్తుల చిట్టాలు సైతం బయటపెట్టాడు. ఇవన్నీ పక్కన పెడితే తాజాగా తమన్నా లాంటి స్టార్ హీరోయిన్‌పై, పలువురు రాజకీయ నాయకులపై సీరియస్ ఆరోపణలు చేస్తూ వీడియో విడుదల చేశాడు అన్వేష్. ‘‘గోవిందా బెట్టింగ్ యాప్ అనేది ఉంది. దీని వెనుక చాలామంది ఎమ్మెల్యేలు, వేల కోట్ల మాఫియా ఉంది. ఇప్పటికీ ఇది రన్ అవుతోంది. దీనిని మీకంటే పెద్దవాళ్లు ప్రమోట్ చేస్తున్నారు. హవాలాలో ఎన్ని కోట్లు అయినా పంపిస్తామంటూ తెలుగులోనే మాట్లాడుకుంటున్నారు’’ అని చెప్పుకొచ్చాడు అన్వేష్.


ఎక్కడైనా చట్టవిరుద్ధమే

‘‘గోవిందా బెట్టింగ్ యాప్‌కు తమన్నా (Tamannaah)నే బ్రాండ్ అంబాసిడర్. ఇన్‌స్టాగ్రామ్‌లో తనను 3 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. ఈ బెట్టింగ్ యాప్‌లో డబ్బులు పెట్టి ఆడితే ట్యాక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటున్నారు. ఇది ఎంత అన్యాయం.. స్వామి మాలలో ఉండి ఇలాంటివి చేస్తున్నారు. విజయవాడలో కనకదుర్గమ్మ గుడి ఎదురుగానే రెండు బెట్టింగ్ యాప్స్ కనిపిస్తాయి. సనాతన ధర్మం పేరుతో ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్.? ఇవి పాకిస్థాన్, అఫ్ఘానిస్తాన్‌లో చట్టవిరుద్ధం. కానీ విజయవాడలో ఎన్ని డబ్బులిచ్చి వీటిని పెట్టుంటారు. రైతులు, యువతలో పోలిస్తే యువతే ఎక్కువగా ఆత్మహత్య చేసుకుంటున్నారు. దానికి కారణం బెట్టింగ్ యాప్సే’’ అంటూ పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)కు సందేశమిచ్చాడు అన్వేష్.

Also Read: సింప్లిసిటీ అంటూ ఫ్యాన్స్, యాక్టింగ్ అంటూ ట్రోల్స్

స్పందించని ఏపీ ప్రభుత్వం

‘‘స్మోకింగ్, డ్రింకింగ్ లాగా బెట్టింగ్ కూడా వ్యసనమే. అయిదేళ్ల నుండి దీనిపై పోరాటం చేస్తున్నాను. నాపై చాలా రకాల దాడులు జరిగాయి. వీటి వల్ల చాలామంది ప్రాణాలు పోతున్నాయని ఆధారాలు కూడా ఉన్నాయి. గోవిందా అనే పేరుతో సెలబ్రిటీలే ఇలా చేస్తున్నారు. ఎవరి అండదండలతో ఇలా చేస్తున్నారు. వ్యవస్థలు, నాయకులు ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు. సనాతన ధర్మం పేరు అడ్డుపెట్టుకొని ఎంతో అన్యాయం జరుగుతోంది. తెలంగాణలో యాక్షన్ తీసుకున్నారు. మెట్రోలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఆగిపోయాయి. ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు’’ అంటూ దీనిపై చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్‌ను కోరాడు అన్వేష్.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×