NANI : చాగంటి కోటేశ్వరరావు ఈ పేరు గురించి తెలుగు ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పే ప్రవచనాలు ఏ స్థాయిలో ఉంటాయో అందరికీ తెలిసిన విషయమే. కేవలం తన మాటలతో కట్టిపడేయటం అనేది ఆయనకు కొట్టినపిండి. చాగంటి ప్రవచనాలను చాలా సినిమాల్లో కూడా మనం చూసాం. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ప్రకాష్ రాజు కూడా చాగంటి ప్రవచనాలు చూస్తూ ఉంటాడు. అలానే కొన్ని క్రికెట్ వీడియోస్ ఎలివేషన్ కి కూడా చాగంటి ప్రవచనాలను వాడుతారు. అంతేకాకుండా కొంతమంది ఫ్యాన్స్ ఎడిట్ కూడా చాగంటి ప్రవచనాలు వాడుతూ ఉంటారు. ఏ అంశానికైనా చాగంటి ప్రవచనాల్లోని విషయం అయితే మాత్రం వాడుకోవడానికి సులువుగా దొరుకుతుంది. ఇక ఇప్పుడు ఈ టాపిక్ రావడానికి కారణం ఏమిటంటే దర్శకత్వంలో నాని నటిస్తున్న హిట్ 3 సినిమాలు చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వినిపించడం.
నాని క్లారిటీ
ఈరోజు వైజాగ్ లో హిట్ 3 సినిమా రిలీజ్ ట్రైలర్ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఖచ్చితంగా ఈ సినిమా మంచి సక్సెస్ సాధిస్తుంది అని అందరికీ ఒక స్థాయి నమ్మకం కూడా వచ్చేసింది. నానిని ఇంతకుముందు ఎన్నడూ చూడని విధంగా యాక్షన్ లో మనం చూడవచ్చు. ఇకపోతే ఈ ట్రైలర్ మధ్యలో ఒక చోట చాగంటి ప్రవచనాలు వినిపిస్తూ ఉంటాయి. అసలు ఈ క్రైమ్ లోకి సాఫ్ట్ గా ఉండే చాగంటి గారిని ఎందుకు ఇరికించారు అని ఒక జర్నలిస్ట్ ప్రశ్నించగా దానికి తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు నాని. ఇవి చాగంటి గారి ఆల్రెడీ ఉన్న ప్రవచనాలు కాదు, ఈ సినిమా కోసం ప్రత్యేకించి ఆయనకు ముందుగా ఈ కథను చెప్పాము. కథ నచ్చడంతో ఆ సిచువేషన్ లో అలా మాట్లాడితే బాగుంటుంది అని మేము కన్వే చేయడంతో ఈ సినిమా కోసం ఆయన మాట్లాడారు. ఇది కేవలం ఆయన సినిమా కోసం చేసింది అంటూ చెప్పుకొచ్చారు.
మనోభావాలు దెబ్బ తింటాయా
రీసెంట్ టైమ్స్ లో ఈ మనోభావాలు అనేవి చాలామందికి ఈజీగా దెబ్బతింటున్నాయి. ఈ తరుణంలో ఈ సినిమా గురించి కూడా చాగంటి అభిమానులు మనోభావాలు దెబ్బతింటాయేమో అని అనుకునే తరుణంలోనే నాని క్లారిటీ ఇవ్వడం అనేది శుభ సూచకం. మే 1వ తారీఖున ఈ సినిమా విడుదల కానుంది. ఇదివరకే వచ్చిన హిట్ 1, హిట్ 2 సినిమాల కంటే కూడా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది అని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. చాగంటి గారు చెప్పిన మాటలకు లోతైన అర్థం సినిమా చూసిన తర్వాత మీకు ఇంకొంచెం అర్థమవుతుంది అంటూ నాని మాటల్లో చాలా క్లారిటీ ఇచ్చాడు.
Also Read : Jr NTR – Neel Movie : తారక్ – నీల్ మూవీ టైటిల్ ఇదే… ఏకంగా జక్కన్ననే లీక్ చేశాడు సామి