BigTV English

OTT Movie : దెయ్యాల దేవతకు నరబలి ఇచ్చే మంత్రగత్తె … ఆచారం పేరుతో అమ్మాయిలని ఘోరంగా … వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్‌

OTT Movie : దెయ్యాల దేవతకు నరబలి ఇచ్చే మంత్రగత్తె … ఆచారం పేరుతో అమ్మాయిలని ఘోరంగా … వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్‌

OTT Movie : ప్రేక్షకుల్ని భయపెట్టడానికి కొత్త కొత్త స్టోరీలతో వస్తున్నారు దర్శకులు. ఇప్పుడు వస్తున్న హారర్ సినిమాలు కొన్ని కామెడీ స్టోరీలతో వస్తే మరికొన్ని భయపెట్టడానికే వస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో, ఒక అమ్మాయిని నరబలి ఇవ్వడానికి కొంతమంది  ప్రయత్నిస్తారు. ఈ స్టోరీ వణుకు పుట్టించే విధంగానే ఉంటుంది. ఈ హారర్ థ్రిల్లర్‌ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

2025 లో వచ్చిన ఈ హారర్ థ్రిల్లర్‌ మూవీ పేరు’ఛోరీ 2′ (Chhorii). 2021 లో విడుదలైన ‘ఛోరీ’ సినిమాకి సీక్వెల్‌గా రూపొందింది. దీనికి విశాల్ ఫురియా దర్శకత్వం వహించారు. నుష్రత్ భరూచా, సోహా అలీ ఖాన్, గష్మీర్ మహాజని, హర్దిక శర్మ వంటి నటీనటులు ప్రధాన పాత్రల్లో నటించారు. క్రిషన్ కుమార్, విక్రమ్ మల్హోత్రా, జాక్ డేవిస్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఏప్రిల్ 11, 2025 నుంచి అందుబాటులోకి వచ్చింది.


స్టోరీలోకి వెళితే

ఈ సినిమా మొదటి భాగం జరిగిన ఏడు సంవత్సరాల తర్వాత స్టోరీ మొదలవుతుంది. సాక్షి తన ఏడేళ్ల కూతురు ఇషానీ తో పాటు ప్రశాంతమైన జీవితం గడుపుతూ ఉంటుంది. ఇషానీకి సూర్యకాంతి తగిలితే, చర్మం కాలిపోయే అరుదైన వ్యాధి ఉంటుంది. అందువల్ల సాక్షి ఆమెను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. సాక్షి ఇప్పుడు ఇన్‌స్పెక్టర్ సమర్ తో కలిసి జీవిస్తోంది. మొదటి భాగంలో సాక్షి తన భర్త రాజ్‌బీర్ ను, అతని కుటుంబాన్ని చంపేస్తుంది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి లొంగిపోతుంది. అయితే శవాలు దొరకనందున ఆమెపై కేసు నమోదు చేయరు. ఈ క్రమంలోనే సాక్షి, సమర్ తో రిలేషన్ లో ఉంటుంది.  అంతా సజావుగా సాగుతున్నట్లు అనిపించినప్పటికీ, ఒక రాత్రి ఇషానీ, రాణీ మా, వారితో కలిసి ఉంటున్న ఒక మహిళకు దెయ్యం ఆవహించినట్లు అవుతుంది. అనంతరం, రాజ్‌బీర్ గ్రామస్థులు వారిని కిడ్నాప్ చేస్తారు.

సాక్షి, సమర్‌తో కలిసి తన కూతురు, రాణీ మాను రక్షించేందుకు ఆ గ్రామానికి తిరిగి వెళ్తుంది. అక్కడ ఆమె దాసీ మా అనే మంత్రగత్తె, ఆమె నాయకత్వంలోని మతోన్మాద మనుషులను ఎదుర్కొంటుంది. ఈ మంత్రగత్తె, ఇషానీని వారి దెయ్యాల దేవతకు బలి ఇవ్వాలని ప్లాన్ చేస్తుంది. దీని వెనుక ఒక శతాబ్దాల నాటి ఆచారం ఉంటుంది. అక్కడ సాక్షి తన కూతురును కాపాడేందుకు ప్రాణాలకు తెగించి పోరాడుతుంది. చివరికి సాక్షి తన కూతుర్ని కాపాడుతుందా ? ఇషానీ కి నిజంగానే దెయ్యం పడుతుందా ? మంత్రగత్తె ఇషానీని ఎందుకు బలి ఇవ్వాలని అనుకుంటుంది ? ఆ పురాతన ఆచారం ఏమిటి ? ఈవిషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ హారర్ థ్రిల్లర్‌ మూవీని చూడండి.

Read Also : ఎడారిలో ఎముకల గుట్ట… ఇదేంట్రా మావా ఇక్కడ చచ్చిన మనుషులు కూడా బ్రతుకుతారట

Related News

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

Big Stories

×