EPAPER

OTT Movie : బైబిల్ లోని ఆ 7 అంశాల ఆధారంగా వరుస హత్యలు… మైండ్ బ్లాక్ అయ్యే సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : బైబిల్ లోని ఆ 7 అంశాల ఆధారంగా వరుస హత్యలు… మైండ్ బ్లాక్ అయ్యే సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : ఖురాన్, భగవద్గీత, బైబిల్ ఇలా మంచి మార్గాన్ని సూచించే ఏ గ్రంధాన్ని అయినా మంచి కోసమే ఉపయోగించుకుంటాము. కానీ కొంచెం క్రాక్ గాళ్లయితే అందులో చెడుని వెతుకుతారు. ఇక మరి కొంతమంది సైకోలుగా, అదే చెడు ఆధారంగా జనాల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో కూడా టైటిల్ లో ఉన్నట్టుగానే బైబిల్ ఆధారంగా వరుస హత్యలు చేస్తాడు ఒక సైకో. మరి ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? కథ ఏంటి? అని విషయాలను చూసేద్దాం పదండి.


నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో…

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సినిమా రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చింది మాత్రం కాదు. 1995లో రిలీజ్ అయిన సినిమా. కానీ అప్పట్లో ఈ సినిమాకు సూపర్ డూపర్ హిట్ అనే టాక్ వచ్చింది. అంతేకాదు ఇప్పటికి థ్రిల్లర్ సినిమాల లిస్టు ఈ మూవీ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. కాగా ఈ మూవీ స్టోరీ కరెక్ట్ గా వారం రోజుల పాటే నడుస్తుంది. అంటే సినిమా కరెక్ట్ గా సోమవారం స్టార్ట్ అయ్యి, ఆదివారంతో కంప్లీట్ అవుతుంది. ఈ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెళ్తే…

ఇందులో ఒక సీనియర్ డిటెక్టివ్ ఉంటాడు. అతని పేరు సోమర్. ఇతను హత్య కేసును ఇన్వెస్ట్గేట్ చేస్తుండగా మిల్స్ అనే మరో డిటెక్టివ్ కూడా ఇదే కేసులో జాయిన్ అవుతాడు. కానీ సోమర్ త్వరలోనే రిటైర్ అయిపోతుండడంతో ఈ లాస్ట్ కేసుని ఎలాగైనా సాల్వ్ చేయాలని ఫిక్స్ అవుతాడు. అంతలోనే మరో మర్డర్ కేస్ తగులుతుంది. తీరా అక్కడికెళ్తే కాళ్లు చేతులు కట్టేసి దారుణంగా చనిపోయి కనిపిస్తాడు ఒక వ్యక్తి. ఇక ఈ కేసును కూడా ఇద్దరు తలపై వేసుకుంటారు. కానీ ఒకరు సీనియర్, మరొకరు జూనియర్ కావడంతో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. దీంతో సీనియర్ అయిన సోమర్ కేస్ ని పట్టించుకోవడం మానేస్తాడు. మిల్స్ కే ఇచ్చి ఇన్వెస్టిగేట్ చేసుకోమంటాడు. వారం రోజుల్లో సోమర్ రిటైర్ అవుతాడు అనగా, మరో దారుణమైన కేసు అతని దగ్గరకు వస్తుంది. కానీ సోమర్ దాన్ని కూడా పట్టించుకోడు. ఆ తర్వాత పై అధికారులు ఆదేశాల మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో ఇద్దరూ కలిసి మళ్ళీ ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడతారు. అందులో భాగంగానే బైబిల్ లోని ఆ ఏడు అంశాల ఆధారంగా ఆ సైకో ఇలా వరుస హత్యలు చేస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకుంటారు. అంతేకాదు అదే బైబిల్ ఆధారంగా మరో ఐదు హత్యలు చేయడానికి రెడీ అవుతున్నాడు అని తెలుసుకొని షాక్ అవుతారు. అసలు ఆ సైకో ప్రాబ్లం ఏంటి? ఎందుకు బైబిల్ లోని అంశాలను ఆధారంగా చేసుకుని మనుషుల్ని చంపుతున్నాడు? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ‘సెవెన్’ అనే ఈ మూవీపై ఒక లుక్కెయ్యండి.

Tags

Related News

Vettaiyan : ఓటిటిలోకి రజినీకాంత్ ‘వేట్టయాన్’…. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?

OTT Movie : ఇక్కడికి ట్రిప్ కి వెళ్తే తిరిగిరాని లోకాలకు వెళ్ళినట్టే… వెన్నులో వణుకు పుట్టించే సస్పెన్స్ థ్రిల్లర్ 

OTT Movie : అమ్మాయిలను ఆ పని కోసమే టార్గెట్ చేసే దెయ్యం… ఈ బో*ల్డ్ హర్రర్ మూవీ బీభత్సం భయ్యా

OTT Movie : భర్తకు ఆ పాడు అలవాటు… పెళ్లి తర్వాత ప్రియమణి చేసిన బో*ల్డ్ మూవీ ఎక్కడ చూడొచ్చంటే?

OTT Movie : స్వర్గం, నరకాన్ని నమ్ముతారా? ఈ మూవీని డోంట్ మిస్… వణుకు పుట్టించే హర్రర్ మూవీ

Mathuvadalara 2: ఓటీటీ డేట్ ఫిక్స్.. రేటింగ్ గ్యారంటీ..!

Thangalaan OTT : డిజాస్టర్ మూవీ మాకొద్దు… విక్రమ్ మూవీపై బాంబ్ పేల్చిన నెట్‌ఫ్లిక్స్..

Big Stories

×