Megastar Chiranjeevi: నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు.. ఆయన పుట్టినరోజు సందర్భంగా అటు అభిమానులు.. ఇటు కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇలాంటి శుభ సమయంలో ట్విట్టర్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి ఒక సర్ప్రైజ్ ట్వీట్ పోస్ట్ చేశారు.. నా పుట్టినరోజు సందర్భంగా మెగా అభిమానులు మరిచిపోలేని గిఫ్ట్అందించారు. తన కెరీర్ ఆరంభంలో జరిగిన తన పట్టిన రోజు వేడుకలో చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ తో ఉన్న ఫోటోలను షేర్ చేశారు.. అంతేకాదు తన తమ్ముడు కోసం ఎమోషనల్ పోస్ట్ చేశారు.. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
పవన్ కోసం చిరు ఎమోషనల్ పోస్ట్..
నేడు మెగా అభిమానులకు మర్చిపోలేని రోజు.. స్వయం కృషితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎదుగుతూ.. నేడు స్టార్ హీరోగా అందరికీ ఆదర్శంగా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి.. ఈయన పుట్టినరోజు సందర్భంగా మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో చిరంజీవి ఒక ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేశారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం షేర్ చేసినట్లు ఉంది.
అందులో ఏం రాసి ఉందంటే.. ప్రేమతో పంపిన పుట్టిన రోజు శుభాకాంక్షలు అందాయి. ప్రతీ మాట.. ప్రతీ అక్షరం నా హృదయాన్ని తాకింది. అన్నయ్యగా నన్ను చూసి నువ్వెంత గర్విస్తున్నావో.. ఓ తమ్ముడిగా నీ విజయాల్ని, నీ పోరాటాన్ని నేను అంతగా ఆస్వాదిస్తున్నాను. నీ కార్యదీక్షత, పట్టుదల చూసి ప్రతీ క్షణం గర్వపడుతూనే ఉన్నా. నిన్ను నమ్మినవాళ్లకు ఏదో చేయాలన్న తపనే నీకు ఎప్పటికప్పుడు కొత్త శక్తిని ఇస్తుంది.. ఈ రోజు నీ వెనుక కోట్లాదిమంది జనసైనికులు ఉన్నారు. ఆ సైన్యాన్ని ఓ రాజువై నడిపించు. వాళ్ల ఆశలకు, కలలకు కొత్త శక్తినివ్వు. అభిమానుల ఆశీర్వాదం, ప్రేమ నీకు మెండుగా లభిస్తూనే ఉండాలి. ఓ అన్నయ్యగా నా ఆశీర్వచనాలు ఎప్పుడూ నీతోనే ఉంటాయి. నీ ప్రతీ అడుగులోనూ విజయం నిన్ను వరించాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటున్నాను. అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతుంది.
Also Read :పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన రైతు బిడ్డ.. అసలు మ్యాటర్ ఇదే..?
చిరు సినిమాల విషయానికొస్తే..
మెగాస్టార్ చిరంజీవికి వయసు పెరుగుతున్న సినిమాల మాత్రం జోరు తగ్గలేదు.. ఒక్కో సినిమాతో ఇండస్ట్రీలో హిట్ ట్రాక్ ని మైంటైన్ చేస్తూ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఈమధ్య రెండేళ్లుగా సరైన హిట్ సినిమా పడలేదు. ప్రస్తుతం రెండు చిత్రాలతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు.. అలాగే సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమా చేస్తున్నారు. ఇప్పటివరకు చిరంజీవి 155 సినిమాలు చేశారు. ఈ రెండు సినిమాలు హిట్ అవుతాయని మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
https://Twitter.com/KChiruTweets/status/1958727350360973586?t=7CBPpSY8IyqhcKSywIViCQ&s=08