OTT Movie : పరువుహత్యలు, రివేంజ్ థ్రిల్లర్ తో ఒక అదిరిపోయే మలయాళం సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.ఈ స్టోరీ జీవా అనే నర్సు జీవితంలో జరిగే సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఒక అమ్మాయిని ప్రేమించడమే అతను చేసిన పాపం అవుతుంది. ఆతరువాత స్టోరీనే మారిపోతుంది. హత్యలు, రివేంజ్ తో ఈ స్టోరీ ఒక థ్రిల్లింగ్ వైబ్ ను తెస్తుంది. ఈ సినిమా దాని బలమైన కథాంశానికి ప్రశంసలను అందుకుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …
కథలోకి వెళ్తే
ఈ కథ ఒక యువకుడి జీవితంలో మూడు ముఖ్యమైన దశల చుట్టూ తిరుగుతుంది. అతని పేరు జీవా. అతను నర్సుగా పనిచేస్తూ జీవితాన్ని గడుపుతుంటాడు. అయితే అతని గతంలో జరిగిన ఒక దారుణమైన సంఘటన అతని జీవితాన్ని తలకిందులు చేస్తుంది. గ్రామంలోని కుల నాయకులు, తమ కుల ఆధిపత్యం కోసం అతని ప్రేమను, అతని కుటుంబాన్ని నాశనం చేస్తారు. ఈ క్రూరమైన చర్యల్లో పరువు హత్యలు, ప్రేమను నిషేధించడం వంటివి ఉంటాయి. సంవత్సరాలు గడిచిన తర్వాత, జీవా ఈ అన్యాయాలకు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు.
అతను తన గతంలో జరిగిన బాధాకరమైన సంఘటనలను గుర్తు చేసుకుంటూ, కుల నాయకులను ఎదిరించేందుకు ఒక పథకం వేస్తాడు. కథలో ఫ్లాష్‌బ్యాక్‌ల ద్వారా అతని ప్రేమ కథ, కుల హింస, పరువు హత్యలు వంటి అంశాలు బయటికి వస్తాయి. ఈ సినిమా కోర్ట్‌రూమ్ డ్రామాతో ముగుస్తుంది. ఇక్కడ జీవా తన చర్యలను సమర్థించుకుంటాడు. కుల వ్యవస్థ దుర్మార్గాలను బయట పెడతాడు. వాళ్లకు శిక్ష పడేలా చేస్తాడు. జీవా వేసే పథకం ఏమిటి ? అతని గతం ఏమిటి ? హత్యలు ఎందుకు జరిగాయి ? ఎవరు చేశారు ? జీవా ప్రియురాలు ఏమవుతుంది ? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనిఉంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చుడండి.
ఆహాలో స్ట్రీమింగ్
‘పేరంబు పెరుంగోబముం’ (Peranbum Perungobamum) అనేది శివప్రకాశ్ దర్శకత్వంలో విడుదలైన తమిళ థ్రిల్లర్ సినిమా. రియోటా మీడియా ప్రొడక్షన్స్, డి. వీరశక్తి దీనిని నిర్మించారు. ఈ చిత్రంలో విజిత్ బచ్చన్, శాలి నివేకాస్, మైమ్ గోపి, అరుల్దాస్, దీపా శంకర్, సుబత్రా రాబర్ట్, ఎన్.పి.కె.ఎస్. లోగు, సాయి వినోద్ నటించారు. ఇళయరాజా సంగీతం సమకూర్చగా, భోజన్ కె. దినేష్ సినిమాటోగ్రఫీ, జె.బి. దినేష్ కుమార్ ఎడిటింగ్ నిర్వహించారు. ఈ సినిమా 2025 జూన్ 5న థియేటర్లలో విడుదలైంది. 2025 ఆగస్టు 22 నుండి Aha లో స్ట్రీమింగ్ అవుతోంది. ఐఎండీబీలో 8.3 రేటింగ్ ని పొందింది.
Read Also : చచ్చిన 7 రోజుల తరువాత రీఎంట్రీ… అఘాయిత్యం చేసిన గ్యాంగ్ ను చచ్చినా వదలకుండా… బతికుండగానే నరకం