Surekha Konidela: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఆదర్శ దంపతులుగా చలామణి అవుతున్న మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), సురేఖ (Surekha) దంపతుల గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా ఈ జంట మెగా కుటుంబాన్ని ఉన్నత శిఖరానికి చేర్చడంలో పడ్డ కష్టం వర్ణనాతీతం. మెగా కుటుంబం నుంచి నేడు అంతమంది హీరోలు ఇండస్ట్రీలో చలామణి అవుతున్నారు అంటే దానికి ఈ జంటే మూల కారణమని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా ఈరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు.. ఈ నేపథ్యంలోనే వారి వైవాహిక జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
కలెక్టర్ కి భార్య కావాల్సిన సురేఖ..
స్వర్గీయ అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah) గారి గారాల పట్టి అల్లు సురేఖను మెగాస్టార్ చిరంజీవి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. నిజానికి ఈమె కలెక్టర్ కి భార్య కావాల్సినవారు.. కానీ మెగాస్టార్ కి భార్య అవ్వడంతో.. కలెక్టర్ భార్య కావాల్సిన సురేఖ ఇప్పుడు మెగా మహారాణి ఎలా అయ్యారు అని.. వీరి పెళ్లి వెనుక ఏదైనా మ్యాజిక్ జరిగిందా? ఇలా పలు కోణాలలో అభిమానులు సైతం ఆరాతీస్తున్నారు. మరి అల్లు సురేఖ.. సురేఖ కొణిదెల ఎలా మారారు అనే విషయం ఇప్పుడు చూద్దాం..
మొదటి చూపులోనే చిరంజీవి గురించి ఆరా తీసిన సురేఖ..
చిరంజీవి అప్పుడప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్న సమయంలో.. ఒకసారి ఆయన స్నేహితుడు బి.సత్యనారాయణ (B.Satyanarayana) ను ఆయన పెదనాన్న ఇంట్లో దింపడానికి వెళ్లారట. బి.సత్యనారాయణ పెదనాన్న ఎవరో కాదు అల్లు రామలింగయ్య. అప్పటికే చిరు ఆయనతో కలిసి మూడు సినిమాలలో నటించడంతో ఇంట్లోకి వెళ్లారు. కానీ అల్లురామలింగయ్య గారు అక్కడ లేరు. ఆయన స్నేహితుడు కాఫీ తాగుదువు అని అనడంతో లోపల సురేఖ కాఫీ పెట్టింది. ఇద్దరూ ఒకరికొకరు చూసుకోలేదు. కానీ చిరంజీవి వెళ్ళాక ఆ అబ్బాయి ఎవరు అని సురేఖ ఆరా తీయగా..’మన ఊరి పాండవులు’ సినిమాలో నటించాడని బి.సత్యనారాయణ ఆమెతో చెప్పారట. ఆ తర్వాత సురేఖ సోదరుడు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravindh) చిరంజీవి గురించి డిస్కషన్ మొదలుపెట్టారట.
చిరంజీవి గురించి ఇండస్ట్రీలో ఎంక్వయిరీ చేసిన అల్లు రామలింగయ్య..
అల్లు రామలింగయ్యకేమో తన కూతుర్ని కలెక్టర్ కి ఇచ్చి వివాహం చేయాలని కోరిక ఉండేదట. కానీ ఇటు అల్లు అరవింద్ కి చిరంజీవికి వివాహం చేయాలని కోరిక ఉండేదట. దాంతో కలెక్టర్ కి ఇవ్వాలా? చిరంజీవికి ఇచ్చే పెళ్లి జరిపించాలా? అనే ఆలోచనలో పడిందట అల్లు ఫ్యామిలీ. ఇక తర్వాత సురేఖ ఎవరిని ఓకే చెప్తే వారితోనే వివాహం జరిపిద్దామని నిర్ణయించుకున్నారట. కానీ చిరంజీవి ఆంజనేయ భక్తుడు.. చెడు అలవాట్లు లేవు.. బాగా చదువుకున్నారు.. కష్టపడే వ్యక్తి.. అలా అందరూ ఆయనకు మంచి సర్టిఫికెట్ ఇచ్చారు. దీనికి తోడు మేకప్ మెన్ జయకృష్ణ కూడా అల్లు రామలింగయ్యను దగ్గరుండి కన్విన్స్ చేయడంతో వీరి పెళ్లికి మొదటి అడుగు పడింది. అల్లు రామలింగయ్య ఇండస్ట్రీలో దాదాపు చాలామందిని విచారించిన తర్వాతనే చిరంజీవికి సురేఖని ఇచ్చి వివాహం చేయడానికి ఒప్పుకున్నారట.
ఎట్టకేలకు మెగా మహారాణిలా మారిన సురేఖ.
ఆ సమయంలో చిరంజీవి అప్పుడే పెళ్లేంటి అని కాస్త వెనకడుగు వేసినా.. చిరంజీవి తండ్రి చిరంజీవిని బలవంతంగా ఒప్పించి పెళ్లి చూపులకు తీసుకెళ్లారట. అటు సురేఖ కూడా మన ఊరి పాండవులు సినిమా చూసి ఈ అబ్బాయి ఎవరో చాలా బాగున్నాడు.. మా అమ్మ యాక్టర్ ని చేసుకుంది..నేను కూడా యాక్టర్ నే చేసుకుంటానని నిర్ణయించుకుని చిరంజీవి వివాహం చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట..అలా 1980 ఫిబ్రవరి 20న అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. ఇక నాటి నుండి నేటి వరకు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న ఈ ఆదర్శ దంపతులకు సుస్మిత (Susmitha), రామ్ చరణ్ (Ram Charan), శ్రీజ (Sreeja) అనే ముగ్గురు పిల్లలు జన్మించారు. అలా కలెక్టర్ కి భార్య కావాల్సిన సురేఖ మన ఊరి పాండవులు సినిమా చూసి చిరంజీవిని వివాహం చేసుకొని ఇప్పుడు మెగా కుటుంబానికి మహారాణిగా చలామణి అవుతున్నారు.
ALSO READ: Prabhas: మహాభారతంలోని పాత్రతో ప్రభాస్ మూవీ… డార్లింగ్‌కు సరిగ్గా సెట్!