Rinku Singh: భారత క్రికెట్ జట్టు యువ సంచలనం రింకూ సింగ్ {Rinku Singh} ఒకప్పుడు భారత క్రికెట్ జట్టుకు గ్రేట్ ఫినిషర్ అంటూ ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. 2023 ఐపీఎల్ లో కలకత్తా నైట్ రైడర్స్ తరఫున 574 పరుగులతో సత్తా చాటి.. ఆ తర్వాత ఫామ్ కోల్పోయిన ఈ ఉత్తరప్రదేశ్ ఆటగాడు.. చాలాకాలం తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతాడని అనుకున్న రింకూ సింగ్.. అనూహ్యంగా ఫామ్ కోల్పోయి కిందికి పడిపోవడంతో అతడికి ఆసియా కప్ 2025 లో చోటు దక్కదని అంతా భావించారు.
Also Read: Brock Lesnar’s daughter: అర్థ న**గ్నంగా WWE కూతురు.. ఫోటోలు వైరల్
కానీ అనూహ్యంగా ఆసియా కప్ 2025లో రింకుకి అవకాశం దక్కింది. అయినప్పటికీ రింకూ రాణిస్తాడా..? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్ వంటి ఆటగాళ్లను కాదని రింకూ సింగ్ కి చోటు కల్పించడం ఏంటనే విమర్శలు కూడా ఎదురయ్యాయి. ఇన్నింగ్స్ చివరలో జట్టును గెలిపించే బాధ్యతను తీసుకునే సమర్థత రింకూ కి ఉందా..? అంటూ పలు రకాలుగా విశ్లేషణలు కూడా జరిగాయి. రింకూ ఆడిన చివరి ఏడు మ్యాచ్ లలో కేవలం 67 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడు ఆసియా కప్ లో రాణించడం కష్టమేనని అంతా భావించారు.
కానీ ప్రస్తుతం రింకూ భీకర ఫామ్ లోకి వచ్చేసాడు. తాజాగా ఉత్తరప్రదేశ్ టీ-20 లీగ్ లో రింకూ సింగ్ సిక్సులు, ఫోర్లతో మైదానంలో విధ్వంసం సృష్టించాడు. కేవలం 45 బంతుల్లోనే రింకు తుఫాన్ ఇన్నింగ్స్ తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే సమయంలో మరో 7 బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చాడు. మైదానం నలుమూలలా అద్భుతమైన షాట్లు ఆడుతూ.. ఆసియా కప్ టోర్నీలో ప్రత్యర్థి జట్ల బౌలర్లకు, ముఖ్యంగా పాకిస్తాన్ కి హెచ్చరిక జారీ చేశాడు.
ఉత్తరప్రదేశ్ టీ-20 లీగ్ లో భాగంగా గురువారం రాత్రి లక్నోలోని ఎకానా స్టేడియంలో ఘోరఖ్ పూర్ లయన్స్ – మీరట్ మావెరిక్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో రింకు సింగ్ కెప్టెన్సీలో మీరట్ జట్టు బరిలోకి దిగింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఘోరక్ పూర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేదనకు దిగిన మీరట్ జట్టు కెప్టెన్ రింకూ సింగ్ తుఫాన్ ఇన్నింగ్స్ తో లక్ష్యాన్ని చేదించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. మీరట్ జట్టు 38 పరుగుల వద్ద నాలుగు వికెట్లను కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో మైదానంలోకి వచ్చిన రింకూ సింగ్.. సిక్సులు, ఫోర్ లతో విధ్వంసం సృష్టించాడు.
Also Read: Vinod Kambli: టీమిండియా మాజీ క్రికెటర్ ఆరోగ్య పరిస్థితి విషమం.. మాట కూడా పడిపోయింది !
కేవలం 48 బంతుల్లోనే 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 108 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో మీరట్ జట్టు 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది. ఇక ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్ లలో మీరట్ జట్టుకు ఇది రెండో విజయం. మరోవైపు ఘోరక్ పూర్ ఇప్పటివరకు మూడు మ్యాచ్ లలో ఒక మ్యాచ్ లో మాత్రమే గెలుపొందింది. మొత్తానికి ఆసియా కప్ 2025 టోర్నీకి ముందు రింకూ సింగ్ అద్భుత ఫామ్ లోకి రావడం భారత జట్టుకు శుభవార్త అని చెప్పాలి.
https://twitter.com/CricCrazyJohns/status/1958595526016082112