Cine Workers Strike :టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గత 18 రోజులుగా జరుగుతున్న సినీ కార్మికుల సమ్మెకు నేటితో ముగింపు పలికారు. ఇక ఈరోజు నుంచి యధావిధిగా షూటింగులు ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. అయితే అంతా సర్దుమణిగింది.. ఇక కార్మికులు తమ తమ పనులలోకి వెళ్ళబోతున్నారు అనుకునే లోపే.. అనూహ్యంగా సమ్మె ఉపసంహరణపై బిగ్ ట్విస్ట్ ఏర్పడింది. సినీ కార్మికులు రెండు వర్గాలుగా చీలిపోయి.. ఫెడరేషన్ కమిటీ పైనే అసంతృప్తి వ్యక్తం చేస్తూ తిరుగుబాటు చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఫిలిం ఫెడరేషన్ పైనే సినీ కార్మికుల తిరుగుబాటు..
అసలు విషయంలోకి వెళ్తే.. తమతో చర్చలు జరపకుండా ఫెడరేషన్ సొంత నిర్ణయంతో సంతకాలు పెట్టారు అని.. సినీకార్మిక సంఘాలు ఫిలిం ఫెడరేషన్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అందులో భాగంగానే.. ఈరోజు సినిమా షూటింగ్లకు వెళ్లడానికి సంఘాలు నిరాకరిస్తూ.. ఈరోజు మళ్లీ మీటింగ్ పెట్టుకొని మాట్లాడాలి అని నిర్ణయించుకున్నారు. పైగా ఫెడరేషన్ కి అనిల్, అమ్మి రాజు రాజీనామా చేసి తీరాల్సిందే అని కూడా కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి. ఈరోజు అన్ని సంఘాల కార్మికులు వారి వారి యూనియన్ ఆఫీసులలో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఈరోజు ఫెడరేషన్ ముట్టడికి కార్మిక సంఘాలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
వారి వారి యూనియన్ ఆఫీసులో మీటింగ్ కి సిద్ధం..
పైగా షూటింగ్ కి వెళ్లిన కార్మికులను తిరిగి రమ్మని సంఘాలు పిలుపునిచ్చాయి. ముఖ్యంగా అన్ని సంఘాలు ఈరోజు 9 గంటల తర్వాత వారి వారి యూనియన్ ఆఫీసులో మీటింగ్ కి ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ లో మరింత చర్చనీయాంశంగా మారింది. ఒక సమస్య సద్దుమణిగింది అనుకునేలోపే మరో కొత్త సమస్య కార్మికుల మధ్యలోనే ఏర్పడడం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోందని చెప్పవచ్చు.
తెలంగాణ సీఎం చొరవతో చర్చలు విజయవంతం..
ఇకపోతే 18 రోజులుగా జరుగుతున్న సినీ కార్మికుల సమ్మె నిన్నటితో విజయవంతంగా పూర్తి అవ్వడానికి కారణం తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చొరవ అనే చెప్పాలి.. ఆయన స్వయంగా రంగంలోకి దిగి ఈ సమస్యను సాల్వ్ చేశారు. ఇకపోతే దీని గురించి దిల్ రాజు మాట్లాడుతూ..” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరగా ఈ సమస్యకు పరిష్కారం తీసుకురమ్మని కోరారు. ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఆయనకు ధన్యవాదాలు. హైదరాబాదులో ఫిలిం హబ్ గా చేయాలని సీఎం ప్లాన్ చేస్తున్నారు. ఆ దిశగా ఇప్పుడు చిత్ర పరిశ్రమ ముందుకు వెళ్తోంది” అంటూ తెలిపారు
వేతనాల పెంపు ఫుల్ డీటెయిల్స్..
30% హైక్ అనేది జరుగుతుంది.. దీనికి పలు కండిషన్లు కూడా ఉన్నాయి. 22.5% మొత్తంగా వేతనాల పెంపు జరుగుతుంది. ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా వేస్తున్నాము. చిన్న చిన్న సమస్యల కోసం ఈ కమిటీ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. మొదటి ఏడాది 15% ఇంక్రిమెంట్.. రెండో ఏడాది 2.5%.. మూడో ఏడాది ఐదు శాతం పెంపునకు ఒప్పుకున్నారు. కొన్ని కండిషన్స్ మీద కమిటీ వేస్తున్నారు. యూనియన్ లో బాధ కలిగితే అంతా సర్ది చెబుతాము అని హామీ ఇచ్చారు అంటూ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని తెలిపారు. ఇక అంతా సర్దుమనిగింది షూటింగు స్టార్ట్ అవుతాయనుకునే లోపే ఇప్పుడు మళ్ళీ కార్మికుల సంఘాలు తిరుగుబాటు చేయడం ఆశ్చర్యంగా మారింది.
ALSO READ:Surekha Konidela: కలెక్టర్ భార్య కావాల్సిన సురేఖ మెగా మహారాణి ఎలా అయ్యిందంటే?