OTT Movie : సూపర్‌నాచురల్ హారర్, సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ లో ఒక బాలీవుడ్ సినిమా ప్రేక్షకులను అలరించింది. భారతీయ జానపద కథలలోని మంత్రగత్తెల గురించిన నమ్మకాలతో ఈ స్టోరీ నడుస్తుంది. ఆకట్టుకునే కథ, నటన, సంగీతం కారణంగా ఈ సినిమాకు ప్రశంసలు వచ్చాయి. ఈ స్టోరీ చివరివరకు సస్పెన్స్ తో చిల్లింగ్ థ్రిల్ ని ఇస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ?ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …
అమెజాన్ ప్రైమ్ వీడియోలో
‘ఏక్ థి డాయన్’ (Ek Thi Daayan) కన్నన్ అయ్యర్ దర్శకత్వంలో విడుదలైన హిందీ సూపర్‌నాచురల్ థ్రిల్లర్ చిత్రం. విశాల్ భరద్వాజ్, ముఖేష్ భట్ దీనిని నిర్మించారు. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మి, కొంకణా సేన్ శర్మ, కల్కి కొచ్లిన్, హుమా ఖురేషీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ముఖేష్ భట్, విశాల్ భరద్వాజ్ రాసిన కథ ఆధారంగా రూపొందింది. చిత్రం 2013 ఏప్రిల్ 19న థియేటర్లలో విడుదలైంది. ఇది ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళ్తే
బోబో భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ మెజీషియన్. కానీ అతని గతం అతన్ని వెంటాడుతుంటుంది. బోబోకు చిన్నప్పటి నుండి తన తల్లి ఒక మంత్రగత్తె అనే భయంకరమైన జ్ఞాపకాలు ఉంటాయి. ఆమె తన తండ్రిని చంపి, అతన్ని కూడా హతమార్చడానికి ప్రయత్నించిందని నమ్ముతుంటాడు. ఈ గాయాలు అతని ప్రదర్శనల సమయంలో కూడా గుర్తుకు వస్తుంటాయి. దీనివల్ల అతని మానసిక స్థితి దారుణంగా మారుతుంది. బోబో తన భయాలను ఎదుర్కోవడానికి డాక్టర్ పాలిట్ అనే ఒక సైకియాట్రిస్ట్ సహాయం తీసుకుంటాడు. అతని హిప్నోసిస్ సెషన్‌ల సమయంలో, బోబో తన బాల్యంలోని ఒక అపార్ట్‌మెంట్ భవనాన్ని, అక్కడ నివసించే ఒక మంత్రగత్తె గురించి జ్ఞాపకాలను తిరిగి గుర్తుకు తెచ్చుకుంటాడు. ఆమె తన తల్లి అని అతను నమ్ముతాడు. ఈ జ్ఞాపకాలు అతని తల్లి తన తండ్రిని హత్య చేసిన సంఘటనలను గుర్తు చేస్తాయి.
అయితే ఈ జ్ఞాపకాలు నిజమైనవా లేక బోబో ఊహలా అనేది స్పష్టంగా కన్ఫ్యూజన్ లో పడేస్తాయి. ప్రస్తుత కాలంలో, బోబో తన స్నేహితురాలు తమరాతో సంతోషంగా జీవిస్తుంటాడు. ఒక అనాథ బాలుడిని దత్తత తీసుకోవాలని అనుకుంటాడు. అయితే అతని జీవితంలో లిసా డట్ అనే స్త్రీ ఎదురుపడుతుంది. బోబో ఆమె ఒక మంత్రగత్తె అని అనుమానిస్తాడు. లిసా ప్రవర్తన, బోబో గత జ్ఞాపకాలు అతన్ని తమరా, జోయా జీవితాలు కూడా ప్రమాదంలో ఉన్నాయని నమ్మేలా చేస్తాయి. మంత్రగత్తెలు చంద్ర గ్రహణం సమయంలో పిల్లలను బలి ఇచ్చి, తమ శక్తులను పెంచుకుంటాయని బోబో నమ్ముతాడు. ఒక రాత్రి చంద్ర గ్రహణం సమయంలో, బోబో తన కుటుంబాన్ని రక్షించడానికి లిసాతో ఫైట్ చేస్తాడు. కానీ సినిమా ఒక షాకింగ్ ట్విస్ట్‌తో ముగుస్తుంది. బోబో భయాలు నిజమైనవా ? అతని మానసిక స్థితి సరిగ్గా లేక వచ్చినవా ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : పేరుకే గ్యాంగ్ స్టర్ క్రైమ్ డ్రామా… మొత్తం అవే సీన్లు… ఇంత ఓపెన్ గా ఎలా చూపించారు భయ్యా ?