BigTV English

AP Govt: ఏపీ తీరానికి మహర్దశ.. రూ. 9,000 కోట్ల పెట్టుబడి, ప్రపంచస్థాయి టెర్మినళ్ల నిర్మాణం

AP Govt: ఏపీ తీరానికి మహర్దశ.. రూ. 9,000 కోట్ల పెట్టుబడి, ప్రపంచస్థాయి టెర్మినళ్ల నిర్మాణం

AP Govt: ఏపీని అన్నివిధాలుగా అభివృద్ధి చేసేందుకు దృష్టి సారించారు సీఎం చంద్రబాబు. అభివృద్ధిలో కీలకమైన రోడ్లు, రైల్వే, విమానాశ్రయాలను ఫోకస్ చేశారు. తీరప్రాంతం అధికంగా ఉండడంతో అదే సమయంలో పోర్టులను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఏపీఎం టెర్మినల్స్ విభాగం భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. రూ.9,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనుంది. దీంతో ఏపీ తీర ప్రాంతం రూపురేఖలు మారడం ఖాయమని అంటున్నారు.


తూర్పు తీరానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖద్వారం. దీన్ని లాజిస్టిక్స్ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత ఏపీ మోలర్-మాయర్స్క్ గ్రూప్‌లో భాగమైన ఏపీఎం టెర్మినల్స్ సంస్థతో ఏపీ మారిటైమ్ బోర్డు ఒప్పందం కుదుర్చుకుంది.

దీని ద్వారా ఏపీలో పోర్టులు, టెర్మినళ్ల అభివృద్ధికి దోహదపడుతుంది. ఓడ రేవుల్లో ఆధునిక టెర్మినల్స్, కార్గో హ్యాండ్లింగ్ వ్యవస్థలను ఏపీఎం టెర్మినల్స్ సంస్థ ఏర్పాటు చేయనుంది. రూ.9 వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఏపీఎం టెర్మినల్స్ ద్వారా దాదాపు 10 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.


గురువారం సచివాలయంలో ఏపీఎం టెర్మినల్‌ సంస్థ-ఏపీ మారిటైమ్‌ బోర్డు మధ్య అవగాహన ఒప్పందం కుదురింది. ఒప్పందం ప్రకారం రూ.9,000 కోట్ల పెట్టుబడితో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల అభివృద్ధి, మౌలిక సదుపాయాలను ఆ సంస్థ కల్పించనుంది.

ALSO READ: ఉపరాష్ట్రపతి ఎన్నిక..రెండువైపులా జగన్‌ మేనేజ్ చేస్తున్నారా? మేడా భేటీ వెనుక

పోర్టులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునికీకరించడం, ప్రపంచస్థాయి టెర్మినళ్లను నిర్మించనుంది ఆ సంస్థ. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు వివరించారు. ఏపీలో పారిశ్రామిక ప్రగతి-సామాజిక ఆర్థిక అభివృద్ధికి మధ్య సమతుల్యత సాధించడం ఈ భాగస్వామ్యం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు.

ఏపీ సముద్ర వాణిజ్య రంగంలో ఇదొక మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు సీఎం చంద్రబాబు. ఏపీ తూర్పు తీరప్రాంతాన్ని వాణిజ్య కేంద్రంగా మారుస్తామన్నారు. సరుకు రవాణా ద్వారా ఆదాయ వనరులు పెంచేలా చర్యలు చేపడతామన్నారు. రాష్ట్రంలో సుమారు 1,053 కిలోమీటర్లు తీరప్రాంతం ఉంది. ప్రతి 50 నుంచి 100 కిలోమీటర్లకు పోర్టు లేదా హార్బర్‌ నిర్మాణం జరగాలన్నది సీఎం చంద్రబాబు బలమైన కోరిక.

 

Related News

AP Politics: ఉపరాష్ట్రపతి ఎన్నిక..రెండువైపులా జగన్‌ మేనేజ్ చేస్తున్నారా? ఖర్గేతో మేడా భేటీ వెనుక

Nellore Ysrcp: కాకాణి రాకతో మారిన నెల్లూరు రాజకీయం.. జిల్లాపై పెత్తనం ఎవరిదంటే?

Nidigunta Aruna: ఇంతకీ అరుణ ఏ పార్టీ? తేలు కుట్టిన దొంగల్లా నేతలు

Vijayawada Loan Scam: బెజవాడలో కిలాడీ లేడీ.. లోన్లు ఇప్పిస్తానని రెండువేల మందికి టోకరా

Bhavani Rapido Success: భర్త అనారోగ్యం.. రాపిడో బైక్‌తో అండగా భవానీ.. ట్వీట్ చేసిన టిడిపి!

Big Stories

×