Intinti Ramayanam Today Episode August 22nd: నిన్నటి ఎపిసోడ్ లో.. రాజేంద్రప్రసాద్ ఎక్కడికి వెళ్లారు అని అడుగుతారు.. అయినా వీడు రానని ఇంట్లోంచి వెళ్లిపోయాడు కదా మరి ఇప్పుడు ఎలా వచ్చాడు అని అడుగుతాడు.. ఆరాధ్యను ఏమి చెప్పద్దని అవని చెప్పడంతో ఏమి చెప్పకుండా లోపలికి వెళ్ళిపోతుంది. పిల్లల మనసుని మీరు అర్థం చేసుకోవాలి అని అవని అక్షయకి క్లాస్ పీకుతుంది.. రాజేంద్ర ప్రసాద్ కు జరిగిన విషయాన్ని అవని చెప్తుంది.. పార్వతి గుడికి వెళ్లి అక్కడ తన భర్త ఫ్రెండ్ ఉంటే ఆయనతో మాట్లాడుతుంది. నా కూతురు గొప్పగా ఉండాలని గొప్పింటి సంబంధం అంటూ నేనే బలవంతంగా ఒక సంబంధాన్ని తీసుకొచ్చి నా కూతురికి చేశాను. కట్నం ఇచ్చాను. అయితే వాడు నా కూతురు ఇంటికెళ్లిన రెండు రోజులకే కట్నం తీసుకొని బయటికి గెంటేశారు. వాడికి ఆల్రెడీ ఎన్నో పెళ్లిళ్లు కూడా అయినట్లు తెలిసింది. ఆ మాట వినగానే పార్వతి అవని నా కూతురును పడింది అని అనుకుంటుంది. పల్లవి మాత్రం అవని తన ప్లాన్ ని చెడగొట్టిందని తన తండ్రికి చెప్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. భరత్ తనకి జరుగుతున్న అవమానాలని తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. ప్రణతి వచ్చి ఇది నీళ్లు అందరు నీవాళ్లు.. మీవాళ్లు అంటే నువ్వు బాధపడకూడదు కదా అని అంటుంది. మనకు ఇంకా శోభనం గురించి ఏర్పాట్లు చేయలేదని నువ్వు ఆలోచిస్తున్నావా? మా అమ్మ ఇక్కడికి తీసుకొచ్చింది కదా ఖచ్చితంగా చేస్తుందిలే అని అంటుంది. ఆ విషయాన్ని పార్వతి వింటుంది. ఇక కమల్ పల్లవికి షాక్ ఇవ్వాలని కరెంట్ షాక్ పెట్టబోతాడు..
పల్లవి నేను చీర మార్చుకోవాలి పక్కకెళ్ళి బావ అని ఎంతగా బ్రతిమిలాడినా కూడా కమల్ నేను వెళ్ళను గాక వెళ్ళను అని అంటాడు. ఏంటి కొత్తగా ఇలా మాట్లాడుతున్నావు అని కమల్ ను పల్లవి అడుగుతుంది.. నేను పక్కకు వెళ్లాలంటే నువ్వు నా వీపును గోకాలి అని కమలంటాడు. ఇక చేతులు ఉన్నాయి కదా నీకు గోర్లు ఉన్నాయి కదా గోక్కొ అని పల్లవి అంటుంది.. నువ్వు గోకితేనే బాగుంటుంది అని కమల్ పల్లవి తో సరసాలు ఆడుతాడు. ఇక పల్లవి చేసేదేమీ లేక ఈ తింగరోడుతో వచ్చిన బాధ ఎందుకు అని గోకడానికి వెళ్తుంది..
కమల్ చేతిలో ఉన్న కరెంటు వైర్ పల్లవికి కావాలని తగిలేలా చేస్తాడు. దాంతో షాక్ కొడుతుంది. ఏంటి బావ ఇలా చేసావు అని పల్లవి అంటుంది. ఇంట్లో ఏదైనా సమస్య వస్తే దాన్ని పరిష్కరించాలి అంతేగాని నువ్విలా ఇంకా కొంచెం దాంట్లో నిప్పులు పోసినట్లు చేస్తే మామూలుగా ఉండదు అని అంటాడు. ప్రణతి మాటలు విన్న పార్వతి వీళ్ళిద్దరికీ శోభనం ఏర్పాట్లు చేయాలని అంతకన్నా ముందు వ్రతం చేయించాలని అనుకుంటుంది. అయితే దాని గురించి ఆలోచించే లోపల అవని వ్రతానికి కావలసిన అన్నీ సామాన్లను తీసుకొని ఇంటికి వస్తుంది.
ఏంటివి అని పార్వతి అడుగుతుంది. కొత్తగా పెళ్లయిన దంపతులు కదా అత్తయ్య వాళ్ళు ఎలా పెళ్లి చేసుకున్నా వాళ్లకి పెళ్లి జరిగింది.. మనము సాంప్రదాయం ప్రకారం వ్రతం చేయించాలి కదా అని అవని అంటుంది.. దాని గురించి పార్వతి ఆలోచిస్తుంది కానీ పల్లవి మాత్రం ఈ వంకతో ఇంట్లోనే తిష్ట వేసేలా ఉంది అని ఆలోచిస్తుంది. ఏదైనా చేసి అవని ఈ ఇంటికి రానివ్వకుండా చేయాలని మనసులో అనుకుంటుంది. ఈ విషయాన్ని చక్రధర్ తో చెప్పాలని బయటకు వెళ్తుంది. పల్లవి మాటలు విన్న చక్రధర్ ఏదో ఒకటి చేద్దాం అని అంటాడు.
Also Read: అడ్డంగా దొరికిపోయిన శ్రీవల్లి.. నర్మదకు అనుమానం.. భాగ్యం నెక్స్ట్ ప్లాన్..?
పార్వతి వ్రతానికి అన్ని సిద్ధం చేయించి పూజారితో మాట్లాడుతుంది. పార్వతి మనసులో అవని పై కోపం పోయినట్లు కనిపిస్తుంది. అవని తన సొంత ఇంట్లో ఎలాగైతే చేస్తుందో అలాగే మళ్ళీ అన్ని పనులు చేసి వాళ్ళకి దగ్గర అవ్వబోతుంది. ఇక మరో రెండు మూడు ఎపిసోడ్ లో పల్లవి ఎటువంటి ఫిటింగ్ లు పెట్టకుండా అంటే అవని పార్వతి కలిసిపోయేటట్లు కనిపిస్తున్నారు. ఈ వ్రతం చేయించేటప్పుడు పల్లవి ఏదైనా అడ్డుకట్ట వేస్తుందేమో అని భానుమతి ఆలోచిస్తూ ఉంటుంది. అటు అవని కూడా పల్లవి ఏది చేయకుండా వతాన్ని పూర్తి చేయాలని అనుకుంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..