BigTV English

OTT Movie : బావిలో బంగారం ఇచ్చే రాక్షసి… దాని ఆకలి తీర్చడానికి మనుషుల్ని బలిచ్చే ఫ్యామిలీ

OTT Movie : బావిలో బంగారం ఇచ్చే రాక్షసి… దాని ఆకలి తీర్చడానికి మనుషుల్ని బలిచ్చే ఫ్యామిలీ

OTT Movie : హర్రర్ థ్రిల్లర్ సినిమాలు చూడాలని ఉత్సాహం చాలామందికి ఉంటుంది. వీటిని చూస్తున్నంత సేపు మూవీ లవర్స్ చాలా థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ఒకప్పుడు హర్రర్ సినిమాలు అంటే హాలీవుడ్ అని చెప్పుకునేవారు. అయితే ఇప్పుడు సౌత్ ఇండియన్ నుంచి ఒక రేంజ్ లో హర్రర్ సినిమాలు వస్తున్నాయి. వీటిలో చాలా సినిమాలు మూవీ లవర్స్ కి వెన్నులో వణుకు పుట్టించాయి. ఇటువంటి ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


నెట్ ఫ్లిక్స్…

ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు “కట్టేరి” (Katteri) ఈ మూవీలో నిధి కోసం హీరో అతని ఫ్రెండ్స్ తో ఒక ఊరికి వెళ్తాడు. అక్కడ వీళ్ళు ఎదుర్కొనే సన్నివేశాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే…

గజ, కాళీ, శంకర్ అనే ముగ్గురు వ్యక్తులు కామిని అనే డాక్టర్‌ని కిడ్నాప్ చేస్తారు. ఆమెను వీళ్ళ బాస్ నైనా దగ్గరికి తీసుకువెళ్తారు. ఇదివరకే కామినిని కిడ్నాప్ చేయడానికి నైనా ఒక వ్యక్తిని పంపించి ఉంటాడు. ఆ వ్యక్తి కనపడకపోవడంతో ఏమయ్యాడో  కనుక్కోవడానికి కామినేనిని కిడ్నాప్ చేసి ఉంటారు. అయితే ఆమె తనకేం తెలియదని చెప్తుంది. మరోవైపు నైనా దగ్గర పనిచేసే కిరణ్, నైనా సరుకుని దొంగలించి అతనికకే అమ్మి ఉంటాడు. ఇది తెలుసుకున్న నైనా తన డబ్బులు ఇవ్వకపోతే అంతు చూస్తానని బెదిరిస్తాడు. అయితే మనీ అనే వ్యక్తి నిధి కోసం తమిళనాడు వెళ్లి ఉంటాడని తెలుసుకుంటాడు కిరణ్. ఈ క్రమంలోనే కిరణ్, కామిని మిగతా ముగ్గురు స్నేహితులు మనీ వెళ్లిన ఊరికి వెళ్తారు.

ఆ ఊరిలో ఒక పెద్ద మనిషి ఇంటి దగ్గరికి వెళ్లి మనీ ఏమయ్యాడు అని అడుగుతారు. ఈ క్రమంలోనే చీకటివ్వడంతో అక్కడ ఉన్న వారంతా దయ్యాలవుతారు. అక్కడ నుంచి పారిపోయి మరొక ఇంటికి వెళితే అక్కడ కూడా దెయ్యాలే, ఎటు తిరిగినా దయ్యాలే కనపడటంతో, ఎటుపోవాలో తెలియక భయపడుతూ ఉంటారు. అయితే మత్తమ్మ అనే దయ్యం వేసే ప్రశ్నకి సమాధానం చెప్తే, ఇక్కడి నుంచి బయటపడే దారి తెలుస్తుందని తెలుసుకుంటారు. దారిలో మత్తమ్మ అనే దయ్యం వీళ్ళకు ఎదురు పడుతుంది. ఆమె వీళ్ళకు ఒక స్టోరీ చెప్తుంది.

ఈ ఊరిలో ఒకప్పుడు మత్తమ్మ బాయి తవ్విస్తూ ఉండగా ఒక మనిషి అందులో పడిపోతాడు. దానికి బదులుగా బంగారం బయటికి వస్తుంది. ఇది తెలుసుకున్న మత్తమ్మ తాగుబోతు అయిన తన భర్తని కూడా ఆ బావిలో పడేస్తుంది. దానికి బదులుగా మళ్లీ బంగారం వస్తుంది. ఆ బావిలో ఒక దయ్యానికి మాంసం ఆహారంగా కావాల్సి ఉండటంతో, పోలీస్ ఆఫీసర్ తో ఒక ఒప్పందం చేసుకుంటుంది. శవాలని ఇస్తే దానికి బదులుగా నీకు బంగారం ఇస్తానని చెప్తుంది. ఇంత బంగారం ఈమెకు ఎక్కడి నుంచి వస్తుందో అని అసలు విషయం కనుక్కుంటాడు. అయితే ఈ ఊరిలో అందరినీ చంపి బంగారాన్ని ఒకేసారి తీసుకుందామని ప్లాన్ వేస్తాడు. ఆ ఊర్లో జాతర చేసుకున్నప్పుడు, కరెంట్ స్తంభాన్ని కట్ చేసి వాళ్ల మీద పడేవిధంగా చేస్తాడు. ఆ ఊరిలో అంతా చనిపోతారు. ఇదంతా చెప్పిన మత్తమ్మ ఇందులో నిజం ఎంత, అబద్ధం ఎంత అని అడుగుతుంది. వాళ్లు సమాధానం చెప్పలేక పోతారు. చివరికి మత్తమ్మ వీళ్ళందర్నీ చంపుతుందా? వీరందరూ ఆ ఊరి నుంచి బయటపడతారా? నైనా వీళ్ళందర్నీ ఏమైనా చేస్తాడా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ‘నెట్ఫ్లిక్స్’ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీని తప్పకుండా చూడండి.

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×