Face Mask: పండగలు, ఫంక్షన్ల సమయంలో అందరికంటే తాము అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అందుకోసం కొందరు పార్లర్లకు వెళుతుంటారు. మరికొందరేమో స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. ఇలా చేయడం వల్ల ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. కానీ కొన్ని రకాల హోం రెమెడీస్ వాడటం వల్ల నేచురల్ గానే అందంగా కనిపించవచ్చు. వీటికి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా ఉండదు.
ముఖ్యంగా ఇంట్లో ఉండే కొన్ని రకాల పదార్థాలను వాడటం వల్ల ముఖం మెరిసేలా చేసుకోవచ్చు. కాఫీ పౌడర్ చర్మాన్ని అందంగా మారుస్తుంది. మరి ఈ కాఫీ పౌడర్ ను ముఖ సౌందర్యం కోసం ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తక్షణ గ్లో కోసం కాఫీతో ఫేస్ మాస్క్:
కాఫీ పౌడర్ ఎక్స్‌ఫోలియేటింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. అంతే కాకుండా కలబందలోని హైడ్రేటింగ్ లక్షణాలు మీ చర్మానికి పోషణనిస్తాయి. ఈ రెండింటి సహాయంతో.. మీ చర్మం తక్షణ మెరుపును పొందుతుంది. కాఫీ చర్మంలోని మృతకణాలను కూడా తొలగిస్తుంది కాబట్టి, ఇది మీ ముఖాన్ని తక్షణమే మెరిసేలా చేస్తుంది. అలోవెరా జెల్ , కాఫీ పౌడర్ తో తయారు చేసిన ఫేస్ ప్యాక్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇదే కాకుండా, మీరు మీ చర్మ రకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇందులో మరి కొన్ని ఇతర పదార్థాలను కూడా కలపుకోవచ్చు.
1. కాఫీ, అలోవెరా జెల్, తేనెతో ఫేస్:
కావలసిన పదార్థాలు:
కాఫీ పొడి- 1 టేబుల్ స్పూన్
అలోవెరా జెల్- 2 టేబుల్ స్పూన్
తేనె- 1 స్పూన్
తయారీ విధానం: మీ చర్మం పొడిగా ఉంటే.. మీరు 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ లో.. 2 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్, 1 టీ స్పూన్ తేనె కలిపి పేస్ట్ లాగా చేయాలి. దీనిని మీ ముఖానికి ఫేస్ మాస్క్ లాగా అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత మీ ముఖాన్ని వాష్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా మీ ముఖం తెల్లగా మెరిసిపోతుంది.
తేనె సహజంగా చర్మానికి తేమను అందిస్తుంది. ఈ మూడింటి కలయిక వల్ల చర్మానికి గ్లో రావడమే కాకుండా.. చర్మాన్ని మరింత హైడ్రేట్ గా మారుతుంది..
2. కాఫీ, కలబంద ,పెరుగుతో ఫేస్ మాస్క్:
కావలసిన పదార్థాలు:
కాఫీ పొడి- 1 టేబుల్ స్పూన్
అలోవెరా జెల్- 1 టేబుల్ స్పూన్
పెరుగు- 1 టేబుల్ స్పూన్
Also Read: కొబ్బరి నూనెతో.. అమ్మాయిలే అసూయపడే అందం మీ సొంతం
తయారీ విధానం: తాజా అలోవెరా జెల్‌ని తీసి అందులో పైన చెప్పిన మోతాదుల్లో కాఫీ,పెరుగు కలపి మీక్స్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఫేస్ మాస్క్ లాగా వేయండి. తర్వాత మరియు 15-20 నిమిషాలు దీనిని వదిలివేయండి. అనంతరం ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
చర్మం సున్నితంగా ఉండే వారికి ఈ మాస్క్ చాలా మంచిది. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ మీ చర్మాన్ని సున్నితంగా మర్చుతుంది. అంతేకాకుండా స్కిన్ ను ఎక్స్‌ఫోలియేట్ చేయడంలో సహాయపడుతుంది. చర్మానికి హైడ్రేటింగ్ చేస్తుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.