BigTV English

OTT Movie : యవ్వనం కోసం శరీరాలను మార్చే మనుషులు… ఒళ్లు గగుర్పొడిచే థ్రిల్లర్ మూవీ

OTT Movie : యవ్వనం కోసం శరీరాలను మార్చే మనుషులు… ఒళ్లు గగుర్పొడిచే థ్రిల్లర్ మూవీ

OTT Movie : హర్రర్  చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ మారాయి. థియేటర్లలో రిలీజ్ అయిన మూవీస్ ఓటీటీ లో కొద్ది రోజుల తేడాతోనే స్ట్రీమింగ్ అవుతూ ఉన్నాయి. థియేటర్లలో చూడలేనివారు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో సమయం దొరికినప్పుడల్లా చూడగలుగుతున్నారు. అందులోనూ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలను ఓటీటీ లో మూవీ లవర్స్ అందరూ చూస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో థ్రిల్లర్ సన్నివేశాలతో పాటు హర్రర్ సన్నివేశాలు కూడా జోడించారు. ఈ మూవీ పేరేమిటి ? స్టోరీ ఏమిటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.


స్టోరీలోకి వెళితే

ఈ మూవీలో హీరోయిన్ నర్సుగా జాబ్ చేస్తూ ప్రెగ్నెంట్ గా ఉంటుంది. హీరో హీరోయిన్ వెకేషన్ కి ఎక్కడికైనా వెళ్దామని అనుకుంటారు. విదేశాలకు వెళితే ఖర్చులు ఎక్కువగా ఉండటం వలన ఆలోచనలో పడతారు. వీళ్ళు ఒక ఉపాయం ఆలోచిస్తారు. విదేశాలలో ఉన్న వాళ్లు ఎవరైనా మా కంట్రీకి వస్తే మా ఇంట్లో ఉండొచ్చు. అలాగే మేము మీ కంట్రీ కి వస్తే మీ ఇంట్లో ఉంటాం అనే సందేశాన్ని ఆన్ లైన్ లో పెడతారు. ఈ మెసేజ్ కు ఒక రిప్లై వస్తుంది. మాకు ఈ డీల్ ఓకే అని ఒక ముసలి జంట చెప్తారు. విదేశాలలో ఉన్న వృద్ధ దంపతులు ఓకే అనుకున్న తరుణంలో హీరో హీరోయిన్ విదేశాలకు వెళ్తారు. అక్కడ ఒకచోట ఈ వృద్ధ దంపతులను కలసి ఒకరికొకరు కొన్ని కండిషన్లు పెట్టుకొంటారు. ఇంటిలోని వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలని ఒకరికి ఒకరు చెప్పుకుంటారు. వృద్ధ దంపతులు కూడా హీరో వాళ్ళ ఇంటికి వెళ్లి పోతారు. ఇది ఇలా సాగుతూ ఉంటే, హీరో ఆ ఇంట్లోకి వెళ్లిన తర్వాత రాత్రి అద్దంలో చూసుకుంటూ ఉండగా, ఆ అద్దంలో ముసలివాని రూపం కనబడుతుంది.


హీరో బయటికి వెళ్లి ఎంతసేపటికి తిరిగి రాడు. కంగారుపడిన హీరోయిన్ భర్తకి ఫోన్ చేయగా చాలా సేపటి తరువాత వచ్చిన తన భర్త విచిత్రం గా ప్రవర్తిస్తాడు. అలాగే వీళ్ళున్న ఇంటికి ఆ వృద్ద దంపతుల కూతురు వీళ్లను కలిసేందుకు వస్తుంది. వెంటనే హీరో ఆమెను దగ్గరికి తీసుకొని హత్తుకుంటాడు. పరిచయం లేని ఈ అమ్మాయి పై తన భర్త ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నాడు అని అనుమాన పడుతుంది అతని భార్య. నిజానికి హీరో శరీరంలోకి వేరే రూపం వస్తుంది. ఆ రూపం చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇంతకీ హీరో లో దాగి ఉన్న ఆ రూపం ఎవరిది? ఆ ముసలి దంపతులతో వీళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి?అనే విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే “ది కకూస్ కర్స్“( the cuckoos curse) అనే ఈ సినిమాను చూడండి. ఈ చిత్రం డిజిటల్ ఓటిటి ప్లాట్ ఫామ్ ఆపిల్ టీవీ (apple tv)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఒక క్రేజీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ డోంట్ మిస్.

 

Related News

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

OTT Movie : మనిషి మాంసాన్ని ఎగబడి తినే గ్రామం… ఈ భార్యాభర్తల యాపారం తెలిస్తే గుండె గుభేల్

Big Stories

×