RC17 Music: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం #RC17. ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే, ఈ ప్రాజెక్టుకు సంబంధించి గత కొన్ని రోజులుగా ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా మొదట అనుకున్న దేవి శ్రీ ప్రసాద్ తప్పుకునే అవకాశం ఉందని, ఆయన స్థానంలో కొత్త మ్యూజికల్ ఫోర్స్ రాబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ కు దేవీ శ్రీ అందించిన బాణీలు అంతగా ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోవడంతో ఫ్యాన్స్ కొంత అసంతృప్తి వ్యక్తం అవుతుంది.
Read also-‘దేవి ప్రియ’పై టాలీవుడ్ డైరెక్టర్ల వార్..మూర్తికి ‘ఎండ్ కార్డ్’ పడినట్లేనా?
సుదీర్ఘ కాలంగా సుకుమార్ సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ ఆస్థాన సంగీత దర్శకుడిగా ఉంటూ వస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఆల్బమ్స్ అన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే. అయితే, తాజా సమాచారం ప్రకారం నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దేవి శ్రీ ప్రసాద్ మధ్య కొన్ని సాంకేతిక కారణాల వల్ల మరియు డేట్స్ సర్దుబాటు విషయంలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ‘పుష్ప 2’ పనుల సమయంలో జరిగిన కొన్ని పరిణామాలు ఈ గ్యాప్‌ను మరింత పెంచాయని, అందుకే RC17 కోసం మైత్రీ టీమ్ కొత్త ఆప్షన్స్ వెతుకుతోందని టాక్.
ఈ క్రమంలో బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన సంగీత దర్శకుడు శాశ్వత్ సచ్‌దేవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇటీవల విడుదలైన ‘ధురంధర్’ సినిమాతో శాశ్వత్ సచ్‌దేవ్ సృష్టించిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. ఆ సినిమాలోని పాటలు, ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విన్న తర్వాత సుకుమార్ ఆయన్ను ఈ ప్రాజెక్టులోకి తీసుకోవాలని తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. శాశ్వత్ సచ్‌దేవ్ గతంలో ‘ఉరి: ద సర్జికల్ స్ట్రైక్’ చిత్రానికి గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన తరుణంలో, ఆయన సినిమాలకు అంతర్జాతీయ స్థాయి సౌండింగ్ అవసరమని మేకర్స్ భావిస్తున్నారు. శాశ్వత్ అందించే మోడ్రన్ ఎలక్ట్రానిక్ బీట్స్ చరణ్ బాడీ లాంగ్వేజ్‌కు బాగా సెట్ అవుతాయని అంచనా.
Read also-కార్తీక దీపం 2’ మార్చి 30: నిజం తెలుసుకున్న పారిజాతం
శాశ్వత్ సచ్‌దేవ్ పేరు దాదాపు ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ, మేకర్స్ మరికొంతమంది టాప్ మ్యూజిక్ డైరెక్టర్లతో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ‘ధురంధర్’ బ్లాస్ట్ తర్వాత శాశ్వత్‌కే ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. సుకుమార్ తన సినిమాల్లో మ్యూజిక్ విషయంలో చాలా పట్టుదలగా ఉంటారు, కాబట్టి ఆయన ఎంపిక కచ్చితంగా సర్ప్రైజింగ్‌గా ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఒకవేళ శాశ్వత్ సచ్‌దేవ్ ఈ ప్రాజెక్టులోకి వస్తే, రామ్ చరణ్ సినిమాతో ఆయన టాలీవుడ్ ఎంట్రీ అత్యంత భారీగా ఉండబోతుంది. దేవి శ్రీ ప్రసాద్ లేకపోవడం డీఎస్పీ అభిమానులకు కొంత నిరాశ కలిగించినా, కొత్త మ్యూజిక్ కాంబినేషన్ సరికొత్త మేజిక్ క్రియేట్ చేస్తుందని ఆశించవచ్చు. త్వరలోనే దీనిపై మైత్రీ మూవీ మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.