RCB Jersey : సాధారణంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏది వైరల్ అవుతుందో చెప్పడం చాలా కష్టం. అది వైరల్ అవుతుందా..? అనుకుంటుండగానే కొన్ని వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వైరల్ కావాలని ఎంత ప్రయత్నించినప్పటికీ వైరల్ కావు. క్రీడా రంగంలో కూడా అలాగే జరుగుతుంది. అయితే ఆగస్టు 27న వినాయక చవితి సందర్భంగా సోషల్ మీడియాలో వినాయక చవితి కి సంబంధించి క్రికెట్ చెందిన కొన్ని ఇమేజ్ స్ పెట్టి వైరల్ చేశారు. ముఖ్యంగా గణేష్ డికి RCB ట్రోఫీ జోడించారు. ఇది మరిచిపోక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. ఓ కుక్క కి RCB జెర్సీ ధరించి సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్నారు.
Also Read : Rizwan : పాక్ క్రికెటర్ ను పొట్టు పొట్టుగా కొట్టిన వెస్టిండీస్ క్రికెటర్ రహ్కీమ్ కార్న్‌వాల్
కోహ్లీ పరువు తీస్తున్నారంటూ.. ఆగ్రహం
మరికొందరూ టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ పరువు తీస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి నిత్యం ఆర్సీబీని ట్రోలింగ్ చేస్తున్నారు. కొందరూ ఆకతాయిలు ఏమి పని పాట లేకుండా ఆర్సీబీ నే ట్రోలింగ్ చేయడమే పని పెట్టుకున్నారు. రోజుకొక వింతతో ఆర్సీబీని ట్రోలింగ్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇలాంటి వారిని జైలుకు పంపించాలని ఆర్సీబీ అభిమానులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఆర్సీబీ టైటిల్ సాధించినప్పటి నుంచి కొంత మంది కుల్లుకొని ఏదో ఒక విధంగా ఆర్సీబీ ని నెగిటివ్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మళ్లీ తొక్కిసలాట జరగడం గ్యారెంటీ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. వాస్తవానికి ఏదైనా పండుగ ఉన్నప్పుడు ఆ పండుగ కి సంబంధించిన ఇమేజేస్ సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం. ఐపీఎల్ 2025 టైటిల్ ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆర్సీబీ విజయం సాధించిన తరువాత బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించింది ఆర్సీబీ. అయితే చిన్న స్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఆ ఇద్దరూ ఆర్సీబీ కి దూరం..
మరో 30 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఆర్సీబీ తొలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ విజయాన్ని జరుపుకోవడానికి లక్షలాది మంది చిన్నస్వామి స్టేడియంలో గుమిగూడారు. దీంతో తొక్కిసలాట జరిగి విషాద సంఘటన చోటు చేసుకుంది. వాస్తవానికి ఆర్సీబీ విజయోత్సవ సభ నిర్వహించినప్పుడు లక్షలాది మంది తరలిరావడంతో గ్రౌండ్ లో ఇరుక్కు ఏర్పడి తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన పై అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. వచ్చే ఐపీఎల్ సీజన్ కి ఆర్సీబీ ఇద్దరూ తాత్కాలిక ప్రత్యామ్నాయాలను తీసుకొచ్చింది. భారత్-పాక్ మధ్య యుద్ధ ముప్పుకారణంగా ఐపీఎల్ 2025 కొద్ది వారాల పాటు వాయిదా పడింది. ఫలితంగా జాకబ్ బెథెల్, లుంగి ఎంగిడి ఫైనల్ మ్యాచ్ లకు అందుబాటులో లేరు. ఇంతలో ఆర్సీబీ ఇద్దరూ తాత్కాలిక ప్రత్యామ్నాయాలను ఎంపిక చేసింది. జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజ్జరబానీ, న్యూజిలాండ్ వికెట్ కీపర్ టిమ్ సీఫెర్డ్ ను ఆర్సీబీ ఎంపిక చేసింది. వచ్చే సీజన్ కి వారిని నిలుపుకోలేకపోతుంది ఆర్సీబీ.
?igsh=MXh6c3phZm1jZ3BjdA==