Jayam Ravi:కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు రవి మోహన్ అలియాస్ జయం రవి (Jayam Ravi). తమిళ ‘జయం’ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న ఈయన.. ప్రముఖ హీరోయిన్ ఆర్తి (Arti)ని ప్రేమించి మరీ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వివాహం జరిగిన పదకొండేళ్లకు ఇప్పుడు విడాకులు ప్రకటించి వార్తల్లో నిలిచారు ఈ జంట. ముఖ్యంగా తన భర్త నుండి విడిపోవడం తనకు ఇష్టం లేదని ఆర్తి ఎంతగా చెప్పినా.. జయం రవి మాత్రం విడాకులు కావాల్సిందే అంటూ నొక్కి చెబుతున్న విషయం తెలిసిందే.
భార్యకు విడాకులు ఇచ్చిన జయం రవి..
ఇకపోతే సింగర్ కెనీషా ఫ్రాన్సిస్ (Kenisha Francis) తో జయం రవి ప్రేమలో ఉన్నారని.. ఆమెతోనే ఏడడుగులు వేయబోతున్నారు అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీనికి తోడు ఇద్దరు చట్టాపట్టాలేసుకొని తిరుగుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. అటు ఆర్తి కూడా సింగర్ కెనీషా వల్లే తన భర్త తనకు దూరమయ్యారు అని ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా జయం రవి చేసిన పని చూస్తుంటే యవ్వారం ముదురుతోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. నిన్నటికి నిన్న ఒక గుడిలో ఈ జంట కనిపించారు. ఇప్పుడు ఏకంగా సింగర్ కెనీషాపై బహిరంగంగా ప్రశంసలు కురిపిస్తూ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
ప్రేయసి పై బహిరంగంగా ప్రశంసలు..
అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా రవి తన సొంత బ్యానర్ “రవి మోహన్ స్టూడియోస్” ప్రారంభోత్సవ కార్యక్రమానికి సింగర్ కెనీషాతో కలిసి వచ్చారు. అంతేకాదు తన బ్యానర్లో ఆమెను పార్ట్నర్ గా కూడా ప్రకటించారు. ఈ సందర్భంగా జయం రవి మాట్లాడుతూ..” ఈ కార్యక్రమం ఈరోజు ఇలా ఘనంగా జరగడానికి కారకురాలు కెనీషా. ఆమె లాగా ఇంతవరకు ఎవరూ నా జీవితంలో నాకు సహాయం చేయలేదు. జీవితంలో దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు భగవంతుడు మనకు ఏదో ఒక రకంగా సహాయం చేస్తారు కదా.. అలా నాకు ఆ దేవుడు పంపిన బహుమతి ఈ కెనీషా. నేనెవరు? అనే విషయం నాకు తెలిసేలా చేసింది. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి వ్యక్తి ఉండాలి అని మనసారా కోరుకుంటున్నాను” అంటూ తెలిపాడు రవి మోహన్.
జయం రవి మాటలకు కేనీషా ఎమోషనల్..
కేనీషాకు రవి మోహన్ స్పీచ్ వింటున్నప్పుడు ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇది చూసిన జనాలు మీరు ప్రేమలో ఉన్నారని చెప్పడానికి ఇంతకంటే ఇంకేం ప్రూఫ్ కావాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే ఈ జంట ఇప్పుడు బహిరంగంగానే తమ ప్రేమను అంగీకరించారు అని పలువురు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు కోలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్స్ విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముఖ్యంగా జెనీలియా , కార్తీ లాంటి సెలబ్రిటీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇకపోతే తనకు జీవితాంతం తోడుగా ఉన్న అమ్మ, కెనీషా అలాగే తాను ఇష్టపడే జెన్నీ అంటే తనకు చాలా ఇష్టమని.. వారే తమ జీవితాన్ని నిలబెట్టారు అంటూ ఇంస్టాగ్రామ్ లో క్యాప్షన్ గా జోడించారు జయం రవి.