E-Paper
Advertisement

ఓటీటీలోకి వచ్చేస్తున్న ఆదర్శ కుటుంబం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఓటీటీలోకి వచ్చేస్తున్న ఆదర్శ కుటుంబం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Advertisement

Aadarsha kutumbham OTT : విక్టరీ వెంకటేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రం ఆదర్శ కుటుంబం. ఈ సినిమా వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో మొదటి సినిమా కావటం విశేషం. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇదివరకు వెంకటేష్ సినిమాల కోసం రచయితగా డైలాగ్ పనిచేశారు కానీ దర్శకుడుగా మాత్రం ఇది మొదటిసారి. ఇలా త్రివిక్రమ్ డైరెక్షన్లో వెంకటేష్ సినిమా అంటే ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇలా ఎన్నో అంచనాల నడుమ ఆదర్శ కుటుంబం అక్టోబర్ 30 వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

నవంబర్ 27న రాబోతున్న ఆదర్శ కుటుంబం..

ఇక ఈ సినిమా పట్ల భారీగా అంచనాలు ఉన్నప్పటికీ సినిమా మాత్రం ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయింది. ఈ సినిమా థియేటర్ రన్ క్లోజ్ అవడంతో డిజిటల్ మీడియాలో స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ (Ne Fliz) ఏకంగా 40 కోట్లకు కొనుగోలు చేశారని సమాచారం. ఇలా ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ విడుదలకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. ఈ సినిమా నవంబర్ 27వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ ఫ్లాట్ ఫామ్ లో ఏకంగా తెలుగు, తమిళ ,కన్నడ మలయాళ హిందీ భాషలలో అందుబాటులోకి రాబోతోంది.

నెట్ ఫ్లిక్స్ లో ఆదర్శ కుటుంబం..

Advertisement

ఇలా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశారు త్వరలోనే నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి సంబంధించి అధికారిక ప్రకటన వెల్లడించనుంది. మరి థియేటర్లలో అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ఆదర్శ కుటుంబం డిజిటల్ మీడియాలో అయినా ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో వెంకటేష్ జోడిగా శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. కుటుంబ కథ నేపథ్యంతో పాటు యాక్షన్ సన్నీ వేషాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఆదర్శ కుటుంబానికి నష్టాలేనా..

ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నష్టాలతో ముగిసిందన తెలుస్తోంది. ఈ సినిమా కోసం మేకర్స్ దాదాపు రూ. 110 కోట్ల వరకు ఖర్చు చేశారని తెలుస్తోంది. ఇక విడుదలకు ముందే ఓటీటీ, శాటిలైట్, డబ్బింగ్, ఆడియో హక్కుల రూపంలో నిర్మాతలకు రూ. 70 కోట్ల వరకు వెనక్కి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా రూ. 65 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరగడంతో, ట్రేడ్ వర్గాలు రూ. 130 కోట్ల గ్రాస్ వసూళ్లను బ్రేక్-ఈవెన్ లక్ష్యంగా నిలిచింది అయితే ఈ సినిమా థియేటర్ రన్ పూర్తి అయ్యేసరికి వరల్డ్ వైడ్‌గా సినిమాకు రూ. 76 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. త్రివిక్రమ్ కెరీర్‌లోనే అతిపెద్ద పరాజయంగా నిలిచిన ఈ సినిమా, డిస్ట్రిబ్యూటర్లకు కూడా సుమారు 30 కోట్ల వరకు నష్టాలు వచ్చినట్లు సమాచారం.

Advertisement

Also Read: జనసేన ప్రచారానికి వెళుతుండగా యాక్సిడెంట్.. కారు ప్రమాదం పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

Related News

ఆఫీసులో బాస్‌తో సీక్రెట్ లవ్… ఓటీటీని ఉపేస్తున్న రొమాంటిక్ సిరీస్

గాల్లో మాయమైన విమానం 35 ఏళ్ల తర్వాత క్రాష్… ఇండియన్ స్క్రీన్‌పై అరుదైన టైమ్ ట్రావెల్ థ్రిల్లర్… ఒక్కసారి మొదలుపెడితే క్లైమాక్స్ వరకు కదలలేరు

‘పంచాయత్’ ఫ్యాన్స్‌కు క్రేజీ అప్‌డేట్.. సీజన్ 5 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫులేరాలో మళ్లీ నవ్వుల జాతర ఎప్పుడంటే?

ఒంటరి అమ్మాయి చేతిలో విలన్ల గ్యాంగ్ చిత్తు.. ఓటీటీలోకి వచ్చేసిన మోస్ట్ వయలెంట్ యాక్షన్ థ్రిల్లర్

కొడుకు శవానికి అంత్యక్రియలు చేయలేని తల్లి… ఓటీటీలోకి వచ్చేసిన హార్ట్ టచింగ్ డ్రామా

పెళ్లికి ఒక్కరోజు ముందు వరుడు మోసగాడని తెలిస్తే… మాజీ బాయ్‌ఫ్రెండ్స్‌తో స్వయంవరం.. ఓటీటీలో నవ్వులు పూయిస్తున్న సినిమా

ఆ అడవిలోకి రాత్రిపూట అడుగుపెడితే మృత్యువే… ఓటీటీ షేక్ చేస్తున్న తమన్నా మిస్టరీ థ్రిల్లర్.. ఇప్పుడు స్ట్రీమింగ్ ఉచితమే

Big Stories

Advertisement
×