E-Paper
Advertisement

ఆఫీసులో బాస్‌తో సీక్రెట్ లవ్… ఓటీటీని ఉపేస్తున్న రొమాంటిక్ సిరీస్

ఆఫీసులో బాస్‌తో సీక్రెట్ లవ్… ఓటీటీని ఉపేస్తున్న రొమాంటిక్ సిరీస్
Advertisement

Chinese Romantic Series on OTT: ఈ మధ్య మంచి కథ ఉంటే చాలు భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా కె-డ్రామాలతో పాటు చైనీస్ రొమాంటిక్ డ్రామాలకు యూత్‌లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. అలా తాజాగా ఓటీటీని ఊపేస్తూ, గ్లోబల్ ట్రెండింగ్ జాబితాలో రికార్డులు సృష్టిస్తున్న హార్ట్ టచింగ్ ఆఫీస్ రొమాంటిక్ వెబ్ సిరీస్ ‘ది ఎర్లీ స్ప్రింగ్’ (The Early Spring). పాపులర్ చైనీస్ స్టార్స్ జింగ్ బోరాన్ (Jing Boran), సన్ కియాన్ (Sun Qian) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌కు జియాంగ్ జి జెంగ్ (Jiang Ji Zheng) దర్శకత్వం వహించారు. ప్రముఖ వెబ్ నవల ‘జావో చున్ కింగ్ లాంగ్’ ఆధారంగా రూపొందిన ఈ 24 ఎపిసోడ్ల సిరీస్, రొటీన్ ప్రేమకథలా కాకుండా యువత కెరీర్, సెల్ఫ్ రెస్పెక్ట్, ప్రేమ మధ్య నలిగే సున్నితమైన ఎమోషన్స్ తో అద్భుతంగా చూపిస్తుంది. ఆఫీసులో బాస్‌తో మొదలైన ఆ సీక్రెట్ లవ్ స్టోరీతో ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ కథ ఏమిటి ? ఈ సిరీస్‌ను ఎక్కడ చూడవచ్చో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే..

ఈ సిరీస్ కథంతా బీజింగ్‌లోని టాప్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ నేపథ్యంలో ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది. కొత్తగా ఉద్యోగంలో చేరిన ఉత్సాహవంతురాలైన యువతి షాంగ్ జిటావో (సన్ కియాన్)కు, ఆ కంపెనీలో ప్రతిభావంతుడైన, ఎంతో కఠినంగా ఉండే తన బాస్ లువాన్ నియాన్ (జింగ్ బోరాన్) ఎదురవుతాడు. మొదట్లో పని విషయంలో ఇద్దరి మధ్య తరచూ విభేదాలు, ఘర్షణలు జరుగుతున్నా, జిటావో తన కష్టంతో, నిజాయితీతో బాస్ మనసు గెలుచుకుంటుంది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య మొదలైన పరిచయం గాఢమైన ప్రేమగా మారుతుంది.

Advertisement

అయితే ఆఫీసు నిబంధనలు, కెరీర్‌పై ప్రభావం పడుతుందనే భయంతో వీరిద్దరూ తమ ప్రేమను ఎవరికీ తెలియకుండా సీక్రెట్ రిలేషన్‌షిప్లా కొనసాగిస్తారు. కానీ ఒకే ఆఫీసులో పనిచేస్తూ ప్రేమను దాచడం వారికి పెద్ద సవాలుగా మారుతుంది. ఒకవైపు ఆఫీసు రాజకీయాలు, అపార్థాలు.. మరోవైపు తన కెరీర్‌లో గుర్తింపు తెచ్చుకోవాలనే జిటావో ఆశయం వారి బంధాన్ని పరీక్షిస్తాయి. ప్రేమ, కెరీర్ రెండింటిలో ఒకదానిని ఎంచుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటనేది హృదయాన్ని హత్తుకునేలా తెరకెక్కించారు.

ఏ ఓటీటీలో చూడచ్చు ?

ఈ బ్లాక్‌బస్టర్ రొమాంటిక్ డ్రామా సిరీస్ ‘ది ఎర్లీ స్ప్రింగ్’ (The Early Spring) నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం 24 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ ఇటీవలే అన్ని భాగాలతో అందుబాటులోకి వచ్చి, నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ నాన్-ఇంగ్లీష్ టీవీ జాబితాలో టాప్-2 స్థానాన్ని కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఒరిజినల్ మాండరిన్ (చైనీస్) ఆడియోతో పాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ సదుపాయంతో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్, స్లో-బర్న్ రొమాన్స్, ఎమోషనల్ డ్రామాలను ఇష్టపడే వారికి వీకెండ్‌లో ఒక పర్ఫెక్ట్ ఛాయిస్.

Advertisement

Read Also: వందల మంది అమ్మాయిల మధ్య ఒక్కడే అబ్బాయి… ఓటీటీలోకి వచ్చేసిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ

Tags

Related News

గాల్లో మాయమైన విమానం 35 ఏళ్ల తర్వాత క్రాష్… ఇండియన్ స్క్రీన్‌పై అరుదైన టైమ్ ట్రావెల్ థ్రిల్లర్… ఒక్కసారి మొదలుపెడితే క్లైమాక్స్ వరకు కదలలేరు

‘పంచాయత్’ ఫ్యాన్స్‌కు క్రేజీ అప్‌డేట్.. సీజన్ 5 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫులేరాలో మళ్లీ నవ్వుల జాతర ఎప్పుడంటే?

ఒంటరి అమ్మాయి చేతిలో విలన్ల గ్యాంగ్ చిత్తు.. ఓటీటీలోకి వచ్చేసిన మోస్ట్ వయలెంట్ యాక్షన్ థ్రిల్లర్

కొడుకు శవానికి అంత్యక్రియలు చేయలేని తల్లి… ఓటీటీలోకి వచ్చేసిన హార్ట్ టచింగ్ డ్రామా

పెళ్లికి ఒక్కరోజు ముందు వరుడు మోసగాడని తెలిస్తే… మాజీ బాయ్‌ఫ్రెండ్స్‌తో స్వయంవరం.. ఓటీటీలో నవ్వులు పూయిస్తున్న సినిమా

ఆ అడవిలోకి రాత్రిపూట అడుగుపెడితే మృత్యువే… ఓటీటీ షేక్ చేస్తున్న తమన్నా మిస్టరీ థ్రిల్లర్.. ఇప్పుడు స్ట్రీమింగ్ ఉచితమే

అడవిలోకి వెళ్లి అదృశ్యం… ఓటీటీలోకి వచ్చేసిన హార్ట్ టచింగ్ మలయాళం లవ్ స్టోరీ

Big Stories

Advertisement
×