Raising Raju : జబర్దస్త్ కార్యక్రమంలో కమెడీయన్స్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రైసింగ్ రాజు(Raising Raju), దొరబాబు(Dora Babu) ప్రయాణిస్తున్న కారు విద్యుత్ స్తంభానికి ఢీకొట్టడంతో కారు ముందు భాగం మొత్తం నుజ్జు నుజ్జు అయింది . అయితే ఈ ప్రమాదంలో భాగంగా కారులో ప్రయాణిస్తున్న వీరిద్దరికి ఏ విధమైనటువంటి ప్రమాదం జరగలేదు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న దొరబాబు, రేసింగ్ రాజు ఆరోగ్యంగా ఉన్నారు. ఇక ఈ ప్రమాద ఘటన గురించి రైజింగ్ రాజు మాట్లాడుతూ అసలేం జరిగింది అనే విషయం పట్ల స్పష్టత ఇచ్చారు..
కాకినాడ మేయర్ ఊరేగింపు జరగడంతో ఈ కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ గారు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఇతర జనసేన నాయకులు పాల్గొన్నారు. తాము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నామని తెలిపారు. భీమవరంలో జనసేన పార్టీకి చెందిన నాగేంద్ర నాయకుడి అమ్మగారు ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్న నేపథ్యంలో ప్రచారం చేయాలని భావించాము అలాగే కాకినాడ ఎమ్మెల్యే తరపున రెండు రోజులు ప్రచారం చేయాలని భావించాము. అందుకే రాత్రి కాకినాడ నుంచి పదిన్నరకు బయలుదేరాము. భోజనం చేసుకొని తాము బయలుదేరామని అయితే ఎవరు ఎలాంటి ఆల్కహాల్ వంటివి తీసుకోలేదని కూడా క్లారిటీ ఇచ్చారు.
ఇలా బయలుదేరిన తాము రైల్వే గేట్ దాటగానే ప్రమాదం జరిగిందని తెలిపారు. మరి డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్నారా? ఏంటి అనేది తెలియదు కానీ పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి వెళ్లి ఢీ కొట్టినట్లు రైసింగ్ రాజు తెలిపారు. తాను డ్రైవర్ పక్కన కూర్చుని ఉన్నాను సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ప్రమాదం జరగలేదు. ఇక దొరబాబు వెనక వైపు సీట్లో కూర్చొని నిద్రపోతున్నట్లు రైసింగ్ రాజు తెలిపారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ కి కూడా ఏమీ కాలేదని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ప్రజలు జనసేన కార్యకర్తలు వెంటనే స్పందించి హాస్పిటల్ కి తీసుకురావడం జరిగిందని తెలిపారు.
ఇలా ప్రచారానికి వెళ్లిన మాకు రోడ్డు ప్రమాదం జరగడంతో వెంటనే జనసేన ఎమ్మెల్సీ నాగబాబు గారు స్పందించారని రాజు తెలిపారు. నాగబాబు గారు ఇక్కడ హాస్పిటల్ యాజమాన్యంతో ఫోన్లో మాట్లాడుతూ వాళ్ళిద్దరూ మా పిల్లలే వారికి కావాల్సిన చికిత్స మొత్తం జరిపించండి అంటూ నాగబాబు గారు వెంటనే స్పందించారని ఆయన మాపట్ల దేవుడితో సమానం అంటూ రైసింగ్ రాజు ఈ సందర్భంగా తమకు జరిగిన రోడ్డు ప్రమాదం గురించి క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ ప్రమాదంలో కారు ముందు భాగం చాలా డామేజ్ అయినప్పటికీ కారులో ప్రయాణిస్తున్న వారికి ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రచార కార్యక్రమాలలో భాగంగా కాకినాడకు వచ్చిన సమయంలో ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది.
?avpt=OW80OTFrYjJqMXNm
Also Read: జీవితాంతం ప్రేమ.. సంతోషాలు.. రామలక్ష్మికి చిట్టిబాబు కంగ్రాట్స్ !