E-Paper
Advertisement

సూట్ విషయంలో భార్యతో గొడవ.. రూ.500 నోట్లకు నిప్పు పెట్టిన భర్త, వీడియో వైరల్!

సూట్ విషయంలో భార్యతో గొడవ.. రూ.500 నోట్లకు నిప్పు పెట్టిన భర్త, వీడియో వైరల్!
Advertisement

Jaipur Viral Video: భార్యాభర్తల మధ్య చిన్నచిన్న గొడవలు జరగడం చాలా కామన్. కానీ, కొన్నిసార్లు ఆ కోపం హద్దులు దాటితే ఎలాంటి విచిత్రమైన పనులు చేస్తారో చెప్పడానికి రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన ఈ ఘటనే ఒక పెద్ద ఉదాహరణ. భార్యపై కోపంతో ఒక భర్త ఏకంగా కరెన్సీ నోట్లకే నిప్పు పెట్టాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

రూ.22 వేల సూట్ తెచ్చిన తంటా

Advertisement

జైపూర్‌కు చెందిన మంజీత్ ధాకడ్ అనే వ్యక్తికి ఇటీవల తన భార్య ఎంతో ప్రేమతో ఒక సూట్ కొని తెచ్చింది. దాని ధర అక్షరాలా రూ.22 వేలు. అయితే, భార్య ప్రేమగా కొన్న ఆ సూట్ చూసి సంతోషపడాల్సిన మంజీత్, దాని ధర వినగానే ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయాడు. ‘ఒక సూట్ కోసం రూ.22 వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది?’ అంటూ భార్యను నిలదీశాడు. ‘మనం సొంత ఇల్లు కొనుక్కోవాలని నేను రూపాయి రూపాయి కూడబెడుతుంటే, నువ్వు ఇలా డబ్బును వృథా చేస్తావా?’ అని గట్టిగా మందలించాడు.

పుట్టింటికి భార్య.. భర్త విచిత్ర నిరసన

Advertisement

భర్త అలా అందరి ముందు తిట్టడంతో భార్య తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో అలిగి తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మంజీత్‌లో కోపం మరింత పెరిగింది. ‘అసలు ఈ డబ్బుల వల్లే కదా మా ఇద్దరి మధ్య ఇంత పెద్ద గొడవ జరిగింది.. ఆ డబ్బులే లేకపోతే గొడవే ఉండదు కదా’ అని విచిత్రంగా ఆలోచించాడు.

నోట్ల కట్టలకు నిప్పు!

అనుకున్నదే తడవుగా నేరుగా బ్యాంకుకు వెళ్లి తన ఖాతాలో ఉన్న డబ్బును విత్‌డ్రా చేశాడు. ఇంటికి వచ్చి ఆ రూ.500 నోట్ల కట్టలకు నిప్పు పెట్టాడు. నోట్లు కాలి బూడిదవుతుంటే దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.

Also Read: జబర్దస్త్ ఆర్టిస్టుల కారుకు యాక్సిడెంట్.. ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన ఎమ్మెల్యే!

Tags

Related News

గుజరాత్‌లో ఘోర విషాదం.. క్షణాల్లోనే కాలిబూడిదైన కారు.. ముగ్గురు సజీవ దహనం!

ఫుట్‌పాత్‌పై బైకర్ల ఓవరాక్షన్.. చుక్కలు చూపించిన ముగ్గురు మహిళలు.. నెట్టింట ప్రశంసల జల్లు!

పోలీస్ వరుడి కట్నం కక్కుర్తి.. బ్రెజ్జా కారు లేదని పెళ్లి క్యాన్సిల్.. మండపం నుంచి యూటర్న్!

కాంగ్రెస్‌లో సిరాజ్ చిచ్చు.. సొంత పార్టీ నేతకే.. ఎంపీ ముంతాజ్ పటేల్ చురకలు!

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్మీ కుటుంబాలకు చెందిన ఏడుగురి దుర్మరణం

కెనడాలో దారుణం.. భారత సంతతి జంటపై కాల్పులు.. టార్గెట్ చేసి మరీ లేపేశారు!

అర్ధరాత్రి వేళ ఘోర ప్రమాదం.. ఒకే ఫ్యామిలీకి చెందిన 9 మంది దుర్మరణం!

Big Stories

Advertisement
×