E-Paper
Advertisement

ఒంటరి అమ్మాయి చేతిలో విలన్ల గ్యాంగ్ చిత్తు.. ఓటీటీలోకి వచ్చేసిన మోస్ట్ వయలెంట్ యాక్షన్ థ్రిల్లర్

ఒంటరి అమ్మాయి చేతిలో విలన్ల గ్యాంగ్ చిత్తు.. ఓటీటీలోకి వచ్చేసిన మోస్ట్ వయలెంట్ యాక్షన్ థ్రిల్లర్
Advertisement

The Last Temptation of Becky on OTT: రొటీన్ ప్రేమకథలు, ఫ్యామిలీ డ్రామాల కంటే ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్, ఊపిరి బిగబట్టి చూసే థ్రిల్లర్ సినిమాలను వీకెండ్ లో చూడాలని చాలామంది కోరుకుంటారు. అలాంటి యాక్షన్ ప్రియులకు ఒక సూపర్ హిట్ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన మోస్ట్ వయలెంట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది లాస్ట్ టెంప్టేషన్ ఆఫ్ బెక్కీ’ (The Last Temptation of Becky) ఇప్పుడు డిజిటల్ తెరపై రక్తపాతం సృష్టించేందుకు వచ్చేసింది. గతంలో వచ్చిన ‘బెక్కీ’ (2020), ‘ది వ్రాత్ ఆఫ్ బెక్కీ’ (2023) సినిమాలకు కొనసాగింపుగా, ఈ ట్రయాలజీలో చివరి భాగంగా వచ్చిన ఈ మూవీలో యంగ్ సెన్సేషన్ లులు విల్సన్ (Lulu Wilson) మరోసారి తన ఉగ్రరూపాన్ని చూపించింది. కేవలం 89 నిమిషాల నిడివితో, ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టకుండా సాగే ఈ సినిమాలో ఒక ఒంటరి అమ్మాయి చేతిలో విలన్ల గ్యాంగ్ ఎలా చిత్తు అయ్యిందో, ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఈ వయలెంట్ యాక్షన్ థ్రిల్లర్ స్టోరీ ఏమిటంటే?

ఈ సినిమా కథంతా రెండో భాగం ముగిసిన రెండేళ్ల తర్వాత, ఇప్పుడు 18 ఏళ్ల వయసున్న బెక్కీ (లులు విల్సన్) సీఐఏ (CIA) ఫీల్డ్ ఏజెంట్‌గా మారిన నేపథ్యంలో ఆసక్తికరంగా మొదలవుతుంది. అయితే తనకున్న విపరీతమైన కోపం, రూల్స్ పట్టించుకోకుండా శత్రువులను అత్యంత దారుణంగా అంతమొందించే తీరు వల్ల ఆమె సస్పెన్షన్‌కు కూడా గురవుతుంది. ఈ క్రమంలో తనకు అప్పగించిన ఒక సీక్రెట్ అండర్‌కవర్ మిషన్ కోసం బెక్కీ పోలాండ్ దేశానికి వెళ్తుంది. అక్కడ రెండవ ప్రపంచ యుద్ధం నాటి హిట్లర్ బంకర్ వద్ద ఒక హోటల్ నడుపుతున్న కుటుంబాన్ని ఆమె రహస్యంగా గమనిస్తుంటుంది.

Advertisement

అయితే ఆ కుటుంబ పెద్ద అయిన జనరల్ విల్హెల్మ్ రస్ (నీల్ పాట్రిక్ హారిస్) మళ్లీ నాజీ సామ్రాజ్యాన్ని స్థాపించి, ప్రపంచాన్ని అల్లకల్లోలం చేయడానికి భారీ కుట్ర పన్నుతున్నాడనే భయంకరమైన నిజం బెక్కీకి తెలుస్తుంది. పైఅధికారుల ఆదేశాల కోసం వేచి చూడకుండా, బెక్కీ స్వయంగా రంగంలోకి దిగి ఆ విలన్ల గ్యాంగ్‌పై ఒంటరిగా విరుచుకుపడుతుంది. అత్యంత క్రూరమైన ఫైట్లు, ఊహించని రీతిలో సాగే యాక్షన్ సీక్వెన్స్‌లతో ఆ ప్రమాదకరమైన ముఠాను బెక్కీ ఎలా మట్టుబెట్టింది అనేది వెన్నులో వణుకు పుట్టించేలా తెరకెక్కించారు.

ఏ ఓటీటీలో చూడవచ్చు అంటే ?

‘ది లాస్ట్ టెంప్టేషన్ ఆఫ్ బెక్కీ’ (The Last Temptation of Becky)లో లులు విల్సన్ (Lulu Wilson)తో పాటు హాలీవుడ్ స్టార్ నీల్ పాట్రిక్ హారిస్ (Neil Patrick Harris), కేట్ సీగెల్, బ్రాండన్ ఫ్లిన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు జెన్ వెక్స్‌లర్ (Jenn Wexler) దర్శకత్వం వహించారు.ఈ మోస్ట్ వయలెంట్ యాక్షన్ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో అందుబాటులోకి వచ్చింది. నవంబర్ 4న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, తాజాగా ప్రైమ్ వీడియో స్టోర్‌లో రెంటల్ (Rent) విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఇంగ్లీష్ (English) ఆడియోతో పాటు సబ్‌టైటిల్స్ సదుపాయంతో అందుబాటులో ఉన్న ఈ చిత్రం, రా అండ్ రస్టిక్ యాక్షన్, రివెంజ్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి వీకెండ్‌లో మంచి కిక్ ఇస్తుంది.

Advertisement

Read Also: అవయవాలు విరిచేసి దారుణ హత్యలు.. రక్తంతో రాసిన రహస్య సందేశాలు… వెన్నులో వణుకు పుట్టించే క్రైమ్ థ్రిల్లర్ నేటి నుంచే ఓటీటీలో

Related News

కొడుకు శవానికి అంత్యక్రియలు చేయలేని తల్లి… ఓటీటీలోకి వచ్చేసిన హార్ట్ టచింగ్ డ్రామా

పెళ్లికి ఒక్కరోజు ముందు వరుడు మోసగాడని తెలిస్తే… మాజీ బాయ్‌ఫ్రెండ్స్‌తో స్వయంవరం.. ఓటీటీలో నవ్వులు పూయిస్తున్న సినిమా

ఆ అడవిలోకి రాత్రిపూట అడుగుపెడితే మృత్యువే… ఓటీటీ షేక్ చేస్తున్న తమన్నా మిస్టరీ థ్రిల్లర్.. ఇప్పుడు స్ట్రీమింగ్ ఉచితమే

అడవిలోకి వెళ్లి అదృశ్యం… ఓటీటీలోకి వచ్చేసిన హార్ట్ టచింగ్ మలయాళం లవ్ స్టోరీ

ఓటీటీ లవర్స్ కు పండగే పండగ… ఏ జానర్ కావాలో ఛాయిస్ మీదే

ఈ వారం ఓటీటీలో సందడి చేయబోతున్న తమిళ సినిమాలు, సిరీస్ లు ఇవే

ఇద్దరు భార్యలూ మృతి… శాపం ఉన్న వ్యక్తిని మూడో పెళ్లి చేసుకున్న యువతి… అదిరిపోయే మిస్టరీ థ్రిల్లర్ తెలుగులోనే

Big Stories

Advertisement
×