OTT Web Series:సాధారణంగా బుల్లితెర సీరియల్స్ రోజు అరగంట పాటు ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అలా సీరియల్స్ తరహాలోనే ఇప్పుడు కొన్ని సినిమాలు కూడా వెబ్ సిరీస్ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇది సీజన్ 1, సీజన్ 2 అంటూ ఒకే కథను ఎపిసోడ్ వైస్ రిలీజ్ చేస్తూ ఆడియన్స్ ను అలరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్ లు సీజన్ల ప్రకారం ఒక్కో సీజన్లో 8 నుంచి 9 ఎపిసోడ్లు లేదా అంతకుమించి ఎపిసోడ్ల రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్లో కొన్ని క్రైమ్ నేపథ్యంలో వస్తే, మరికొన్ని కామెడీ నేపథ్యంలో వస్తాయి. కానీ ఇప్పుడు చెప్పబోయే వెబ్ సిరీస్ లు మాత్రం ప్రపంచంలోనే అత్యంత హింసాత్మక వెబ్ సిరీస్ లుగా పేరు తెచ్చుకున్నాయి. వీటిని చూసే ముందు పలు జాగ్రత్తలు తీసుకొని సినిమా చూడాలని సినీ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. మరి అంత హింసాత్మకంగా నిలిచిన వెబ్ సిరీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
1. ది బాయ్స్ (2019 – ప్రస్తుతం)
డార్క్ సూపర్ హీరో సిరీస్ గా వచ్చిన ఈ వెబ్ సిరీస్ లో మితిమీరిన ఘోరం, క్రూరమైన మరణాలు, కలతపెట్టే హింసకు పేరుగాంచింది. ఇది సూపర్ హీరోలపై వాస్తవిక అలాగే భయానక సన్నివేశాలను ప్రదర్శిస్తుంది. 2019లో మొదలైన ఈ వెబ్ సిరీస్ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తోంది.
ఓటీటీ ప్లాట్ఫారం: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వెబ్ సిరీస్ అందుబాటులో ఉంది.
2.గేమ్ ఆఫ్ త్రోన్స్:
గేమ్ ఆఫ్ త్రోన్స్.. డేవిడ్ బెనియాఫ్ డి బి వైస్ దర్శకత్వంలో అమెరికన్ ఫాంటసీ డ్రామా టీవీ సీరియల్స్ గా రూపొందించబడింది. దాదాపు 8 సీజన్లు కలిగిన ఈ వెబ్ సిరీస్ ఐఎండిబిలో ఏకంగా 9.2 రేటింగ్ దక్కించుకోవడం గమనార్హం. వెల్ ఫాస్ట్ లోని టైటానిక్ స్టూడియోలో యునైటెడ్ కింగ్డం, స్పెయిన్, క్రేసియా, కెనడా, యునైటెడ్ స్టేట్స్, ఐస్లాండ్ వంటి పలు దేశాలలోని లొకేషన్లో ఈ వెబ్ సిరీస్ ని చిత్రీకరించారు. 2011లో ప్రారంభమైన తొలి సీజన్ 2018 సంవత్సరంలో 8వ సీజన్ తో సిరీస్ కి ముగింపు పలికింది. సింహాసనం కోసం ఏడు రాజ్యాల వారసులు పోరాటం చేయడం, మధ్యలో భయంకరమైన వింత వ్యాధి సోకడం, ప్రచండమైన ప్రమాదం మనుషులకు ముంచుకు రావడం వంటి అంశాలతో సాగుతుంది. ముఖ్యంగా లైంగిక హింసతో పాటు హింస ఎక్కువగా ఉందని గతంలో విమర్శల పాలయ్యింది. అయినా సరే ఈ వెబ్ సిరీస్ కి గోల్డెన్ గ్లోబ్ పురస్కారంతో పాటు 38వ ప్రైమ్ టైం ఎమ్మా పురస్కారం కూడా లభించింది. అంతేకాదు ఈ వెబ్ సిరీస్ కి పలు పురస్కారాలు కూడా లభించాయి.
ఓటీటీ ఫ్లాట్ ఫామ్: HBO మాక్స్, జియో సినిమా (ఇండియా) ఓటిటి ప్లాట్ఫామ్స్ లో అందుబాటులోకి వచ్చింది.
3. హన్నిబాల్ (2013-2015)
అమెరికన్ సైకలాజికల్ హార్రర్ థ్రిల్లర్ సిరీస్ గా వచ్చిన ఈ వెబ్ సిరీస్ మొత్తం మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్ లో అత్యంత క్రూరమైన హత్యలు, నరమాంసభక్షకం,కలవరపరిచే మానసిక భయాందోళనలు ప్రేక్షకుడికి గూస్ బంప్స్ తెప్పిస్తాయి. అయినా సరే 95% మంది ప్రేక్షకులను ఈ ఈ వెబ్ సిరీస్ బాగా ఆకర్షించింది.
ఓటిటి ఫ్లాట్ ఫారం: నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
4. బ్లాక్ మిర్రర్ : ఎపిసోడ్ “మెటల్ హెడ్” & “వైట్ బేర్”
చార్లీ బ్రోకర్ రూపొందించిన బ్రిటిష్ ఆంథాలజీ టెలివిజన్ సిరీస్ ఇది. ముఖ్యంగా సైన్స్ ఫిక్షన్ టెక్నాలజీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో కూడా అత్యంత హింసాత్మకమైన సన్నివేశాలు ఆడియన్స్ కు చెమటలు పట్టిస్తాయి. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగే ఈ వెబ్ సిరీస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
5. మైండ్‌హంటర్ (2017-2019)
నిజజీవిత సంఘటన ఆధారంగా రూపొందిన ఈ వెబ్ సిరీస్ లో సీరియల్ కిల్లర్ నేపథ్యంలో సైకాలజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా రూపొందించబడింది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగే సన్నివేశాలు ఆడియన్స్ లో ఆందోళన కలిగిస్తాయి. ముఖ్యంగా అసభ్యకరమైన సంభాషణలతో పాటు క్రైమ్ సన్నివేశాలు భయాన్ని కలిగిస్తాయి.
ఓటీటీ ప్లాట్‌ఫారమ్: నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
6. చెర్నోబిల్ (2019)
చెర్నోబిల్ విపత్తు గురించిన మిని సిరీస్ ఇది. అత్యంత భయానకమైన రేడియేషన్ కారణంగా మనుషులు తీవ్ర అనారోగ్యానికి గురికావడం.. ఈ రేడియేషన్ ప్రభావం మనుషులపై ఎంత భయంకరంగా ఏర్పడింది అనే విషయాల…