Violent OTT Movies:ఈ మధ్యకాలంలో ప్రేక్షకుల అభిరుచులు పూర్తిగా మారిపోయాయి. అందులో భాగంగానే ప్రాంతీయ భాష చిత్రాలను పక్కనపెట్టి ఇతర భాషా చిత్రాలపై మక్కువ చూపుతున్నారు. ఇకపోతే ఒకప్పుడు ప్రాంతీయ చిత్రాలు ఆ ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యేవి. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. తద్వారా ఒక సినిమాలో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రాలు.. ఇతర భాషల్లో కూడా డబ్బింగ్ అయి విడుదలవుతున్నాయి. ఇక థియేటర్ కి వెళ్లలేని వారికోసం మాత్రం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. దీనికి తోడు కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా జపాన్, కొరియన్, స్పానిష్, ఇటాలియన్ లాంటి భాషా చిత్రాలను కూడా చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇకపోతే ఇప్పుడు మోస్ట్ వైలెంట్ చిత్రాలను కూడా చూడడానికి ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ప్రత్యేకించి కొన్ని వైలెంట్ మూవీలు ఓటీటీలోకి వచ్చేసాయి. ఈ సినిమాలను చూస్తే మాత్రం ఖచ్చితంగా కడుపులో తిప్పడం ఖాయమని చెప్పవచ్చు. మరి ప్రేక్షకులు కూడా ఆసక్తి కనబరుస్తున్న ఆ మోస్ట్ వైలెంట్ మూవీస్ ఏంటి ? ఏ ఫ్లాట్ ఫామ్ లో చూడవచ్చు? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
1. ది సాడ్ నెస్ -(2021):
2021లో విడుదలైన తైవానీస్ జోంబీ భయానిక చిత్రం ఇది. కెనడియన్ ఫిలిం మేకర్ రాబ్ జబ్బాజ్ మొదటిసారి ఈ సినిమా ద్వారానే దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇందులో బెరాంట్ ఝూ, రెజీనా లీ జంటగా నటించారు. వైరల్ మహమ్మారి పూర్తిగా వ్యాపించి.. ప్రజలను నరహత్య చేసే శాడిస్ట్ లుగా మారుస్తుంది. ఇక ఈ భయానక సన్నివేశాలు ప్రేక్షకులను పూర్తి భయానికి గురిచేస్తాయి. గార్త్ ఎన్నిస్ కి సంబంధించిన కామిక్ పుస్తకం ద్వారా ఈ కథ ప్రేరణ పొందింది. 2021 74వ లోకర్నో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో అంతర్జాతీయంగా ప్రీమియర్ కూడా చేయబడింది.
ఓటీటీ ఫ్లాట్ ఫామ్: అమెజాన్ ప్రైమ్ లో కేవలం కొన్ని భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది.
2. ఏ సెర్బియన్ ఫిలిం (2010):
సెర్బియా భాషలో 2010 జూన్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఏ సెర్బియన్ ఫిలిం. స్రజన్ స్పాసోజెవిక్ మొదటిసారి ఇండస్ట్రీకి దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా పరిచయమవుతూ.. తెరకెక్కించిన చిత్రం ఇది. ఇదొక భయానకమైన దోపిడీ చిత్రం. అత్యంత క్రూరమైన హింస ఇతివృత్తం నేపథ్యంలో అత్యంత వివాదాస్పద చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా సున్నితమైన వీక్షకులకు ఈ సినిమా సిఫార్సు చేయబడలేదు.
ఓటీటీ ఫ్లాట్ ఫామ్: ఎడిటెడ్ వర్షన్ మాత్రమే అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.
3. ఇచి ది కిల్లర్ (2010):
2001లో వచ్చిన జపనీస్ హర్రర్ చిత్రం. తకాషి మియికే దర్శకత్వంలో సకిచి ఆటో ఈ చిత్రాన్ని రచించారు. ఈ చిత్రం కూడా విపరీతమైన హింస , క్రైమ్ థ్రిల్లర్ చిత్రంగా విడుదలైంది. ముఖ్యంగా సెన్సిటివ్ పర్సన్స్ ఈ సినిమాను చూడడానికి అనుమతించడలేదు. ఎక్కువగా క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ సినిమా బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.
ఓటీటీ ఫ్లాట్ ఫామ్: అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.
4. 4. మార్టిర్స్:(2008)
ఫ్రెంచ్ భాష సైకాలజికల్ భయానక చిత్రంగా 2008లో ఈ సినిమా విడుదలైంది. పాస్కల్ లౌజియర్ రచించి , దర్శకత్వం వహించిన ఈ సినిమా అత్యంత భయానకంగా ఉంటుంది. ఒక యువతి చిన్నతనంలోనే తనను అపహరించి హింసించిన వ్యక్తులపై ప్రతీకారం తీర్చుకోవాలనే తపనతో వారిని ఏం చేసింది అనే సైకలాజికల్ థ్రిల్లర్ మూవీగా విడుదలైంది. హారర్ ఫిలిం గా వచ్చిన ఈ సినిమాలో అత్యంత భయానక సన్నివేశాలు ప్రేక్షకుడికి గూస్బంస్ తెప్పిస్తాయి. ఇక 2017లో ఐజిఎన్ ఎప్పటికప్పుడు అత్యుత్తమ భయానక చిత్రాలను విడుదల చేయగా.. అందులో ఒకటిగా ఈ సినిమా నిలిచింది .అంతే కాదు 100 జాబితాలో 32వ ర్యాంకును అందుకుంది. ఇక ఈ స్టోరీ లైన్ ని దాదాపు 70 శాతం మంది ప్రజలు ఇష్టపడ్డారు.
ఓటీటీ ఫ్లాట్ ఫామ్: AMC+, వుడు లో అందుబాటులో ఉంది.
5. ఇర్రెవర్సిబుల్: (2002)
2022లో విడుదలైన ఫ్రెంచ్ భాషా చిత్రం ఇది.గ్యాస్పర్ నోయే వ్రాసి దర్శకత్వం వహించారు. మోనికా బెల్లూచి, విన్సెంట్ కాసెల్ నటించిన ఈ చిత్రంలో విషాదకరమైన రాత్రి సంఘటనలను చూపించారు. ఇద్దరు పురుషులు వారు ప్రేమించిన అమ్మాయిని అత్యంత క్రూరంగా అత్యాచారం చేస్తారు. ఇక వారి చేతిలో అత్యాచారానికి గురైన ఆ మహిళ ప్రతీకారం తీర్చుకోవడాన్ని ఈ సినిమాలో చూపించారు. రివర్స్ ఆర్డర్లో కథను చూపించడం జరిగింది. ముఖ్యంగా చాలా హింసాత్మకమైన , క్రూరమైన చిత్రంగా ఈ సినిమాను విడుదల చేశారు. ముఖ్యంగా ఇంత హింసాత్మకమైన సినిమాని చాలామంది చూడలేనిదిగా కూడా పరిగణించారు.
ఓటీటీ ఫ్లాట్ ఫామ్: అమెజాన్ ప్రైమ్ ఆపిల్ టీవీ ప్లాట్ఫార్మ్స్ లో అందుబాటులోకి ఉంది.
6. కన్నిబాల్ హోలోకాస్ట్:(1980)
ఇటాలియన్ మూవీగా వచ్చిన ఈ సినిమాలో ఒక తెగ నరమాంస భక్షకులుగా మారి అత్యంత క్రూరంగా మనుషులను హింసిస్తూ ఉంటారు. ఇక ఈ సినిమా గనక చూస్తే మాత్రం కడుపులో పేగులు దేవేసినట్టు ఉంటుంది. అత్యంత భయానకంగా, హింసాత్మకంగా, చూడగానే ఒళ్ళు గగుర్పొడిచేలా ఈ సినిమాని తెరకెక్కించారు. స్థానిక నర మాంసభక్షక తెగలపై ఒక డాక్యుమెంటరీ చిత్రీకరిస్తున్నప్పుడు తప్పిపోయిన చిత్ర నిర్మాతల బృందాన్ని కనుగొనడానికి అమెజాన్ వర్షారణ్యంలోకి ఒక రిస్క్యూ బృందాన్ని నడిపించే మానవ శాస్త్రవేత్త హెరాల్డ్ మన్రోగా రాబర్ట్ కర్మన్ ఇందులో నటించారు. ఇకపోతే అత్యంత భయానకంగా నిలిచిన ఈ చిత్రం ఒకసారి చూస్తే ఇంకోసారి ఇలాంటి చిత్రాల జోలికి పోరు అని ఆడియన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే అత్యంత క్రూరంగా, భయానకంగా చిత్రీకరించడంతో ప్రస్తుతం ఓటీటీ నుండి ఈ సినిమాను తొలగించినట్లు సమాచారం.