OTT Movie : రొమాంటిక్ సినిమాలు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ కలిగి ఉంటాయి. కొంచెం కామెడీ , కొంచెం రొమాన్స్ తో హృదయాన్ని తాకే కథలను మీరు గనుక ఇష్టపడితే, ఈ సినిమా మీ కోసమే. ఈ అమెరికన్ టీన్ రొమాంటిక్ కామెడీ సినిమాలో, ఒక కాలేజీ విద్యార్థి ప్రేమను సరదా రీతిలో చూపిస్తుంది. ఇందులో వందమంది అమ్మాయిలు ఉండే హాస్టల్ లో ఓ అబ్బాయి అలజడి సృష్టిస్తాడు. ఈ స్టోరీ రొమాంటిక్ సీన్స్ తో ఆసక్తికరంగా నడుస్తుంది. ఈ సినిమా ఎక్కడ చూడొచ్చు? దీని పేరు ఏమిటి ? అనే వివరాల్లోకి వెళితే …
స్టోరీలోకి వెళితే
ఈ కథ మాథ్యూ అనే కాలేజీ స్టూడెంట్ చుట్టూ తిరుగుతుంది. అతను ఒక రాత్రి ఒక గర్ల్స్ డార్మిటరీలో జరిగిన పార్టీ నుండి బయటకు వస్తూ, ఒక ఎలివేటర్‌లో అమ్మాయితో చిక్కుకుంటాడు. అకస్మాత్తుగా అక్కడ కరెంట్ పోతుంది. ఆ చీకటిలో వారు సరదాగా మాట్లాడుకుంటూ, ఒక రొమాంటిక్ క్షణాన్ని పంచుకుంటారు. అక్కడే ఉదయం అవుతుంది. కానీ మాథ్యూ ఒంటరిగా ఎలివేటర్‌లో మేల్కొంటాడు. అక్కడి నుంచి అమ్మాయి అదృశ్యమవుతుంది. ఆమె ప్యాంటీస్ మాత్రమే మిగిలిపోతాయి. మాథ్యూ, “అరె, ఈ అమ్మాయి ఎవరు? ఆమె నా డ్రీమ్ గర్ల్!” అని సరదాగా అనుకుంటూ, ఆమెను కనిపెట్టే ప్రయత్నం చేస్తాడు. సమస్య ఏంటంటే, ఆమె ఒక ఆల్-గర్ల్స్ డార్మ్‌లో నివసిస్తుంటుంది. అక్కడ 100 మంది అమ్మాయిలు ఉంటారు. అతను ఆమె మొహాన్ని కూడా చూడలేదు. మాథ్యూ, ఈ “వర్జిన్ వాల్ట్” డార్మ్‌లో మెయింటెనెన్స్ మ్యాన్‌గా జాయిన్ అవుతాడు. ఆ ప్యాంటీస్‌కు సరిపోయే బ్రాను వెతుకుతూ, ఆ అమ్మాయిని కనుగొనే ప్రయత్నంలో పడతాడు.
Read Also : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్
అతని రూమ్‌మేట్ రాడ్ ఒక గందరగోళ వ్యక్తి. రాడ్‌కు హైపోస్పాడియాస్ అనే సమస్య ఉంటుంది. దీనివల్ల అతను స్త్రీలను తక్కువ చేస్తూ ఉంటాడు. ఈ అమ్మాయి నీకు సెట్ కాదని వాదిస్తుంటాడు. మాథ్యూ, అమ్మాయిలతో మాట్లాడటానికి సిగ్గుపడే ఒక సాధారణ కుర్రాడు. ఆమెను కనిపెట్టే ప్రయత్నంలో చాలా మంది అమ్మాయిలను కలుస్తాడు. ఇప్పుడు కథలో ఒక కీలకమైన ట్విస్ట్ వస్తుంది. మాథ్యూ తాను వెతుకుతున్నది “ఫ్రాన్సెస్కా” అనే అమ్మాయిగా గుర్తిస్తాడు. ఇక స్టోరీ రసవత్తరంగా సాగుతుంది. ఫ్రాన్సెస్కాతో మాథ్యూ లవ్ లో పడతాడా ? తాను ఎలివేటర్‌లో ఫ్రాన్సెస్కాతో నే గడిపాడా ? వందమంది అమ్మాయిలలో తనని ఎలా కనిపెడతాడు ? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలనుకుంటే, ఈ రొమాంటిక్ సినిమాను మిస్ కాకుండా చుడండి.
మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్
ఈ రొమాంటిక్ మూవీ పేరు ‘100 Girls’ మైఖేల్ డేవిస్ దీనికి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా Tubi TV, Amazon Prime, Apple TV లలో అందుబాటులో ఉంది. 1 గంట 34 నిమిషాల నిడివి ఉన్న ఏఈ సినిమాకి IMDbలో 5.8/ 10 రేటింగ్ ఉంది. ఇందులో జోనాథన్ టకర్ (మాథ్యూ), ఎమ్మాన్యూల్ క్రిక్వీ (ప్యాటీ), జేమ్స్ డిబెల్లో (రాడ్), కేథరీన్ హెయిగల్ (ఆర్లీన్), లారిసా ఒలీనిక్ (వెండీ), జైమీ ప్రెస్లీ (సింథియా), మారిస్సా రిబిసి (డోరా) ప్రధాన పాత్రల్లో నటించారు.