Court Movie Collections : న్యాచురల్ స్టార్ నాని హీరోగానే కాదు. ప్రొడ్యూసర్ గా కూడా పలు సినిమాలను నిర్మించారు. తాజాగా ఈయన నిర్మించిన మూవీ కోర్ట్.. విలక్షణ నటుడిగా రాణిస్తున్న ప్రియదర్శి లీడ్ రోల్‌లో కొత్త డైరెక్టర్ రామ్ జగదీష్ కాంబినేషన్‌లో నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో వచ్చిన సినిమా ఇది.. హోలి సందర్బంగా మార్చి 14 న రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.. అదే విధంగా భారీగా కలెక్షన్స్ ను కూడా వసూల్ చేసింది. మరి ఆలస్యం ఎందుకు మూడు రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
కోర్ట్ మూవీని నాని నిర్మించడంతో ఈ మూవీ భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది. మొదటి రెండు రోజుల్లో 9 కోట్లు కలెక్ట్ చెయ్యడం మామూలు విషయం కాదు. హర్ష్ రోషన్, సాయికుమార్, శివాజీ, హర్షవర్థన్, రోహిణి, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి, విషికా కీర్తి, శ్రీదేవి అపాళ్ల తదితరులు కీలకపాత్రలు పోషించారు. విజయ్ బుల్గానియన్ సంగీత దర్శకత్వం వహించారు. ఈ మూవీని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నేనేని దాదాపుగా 10 కోట్లకు పైగా నిర్మించారు. నాని సమర్పకుడిగా వ్యవహారించారు.. అన్నీ ఏరియాల్లో భారీగా బిజినెస్ ను అందుకున్న ఈ మూవీ కలెక్షన్స్ ను కూడా అందుకుంటుంది. మరి ఈ మూవీ మూడు రోజులకు ఎంత కలెక్షన్స్ ను రాబట్టిందో చూసేద్దాం..
Also Read : గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజయశాంతి యాక్షన్.. అర్జున్ పవర్ ఫుల్ డైలాగులు..
కోర్ట్ మూవీ కలెక్షన్స్ విషయానికొస్తే… హీరో ప్రియదర్శి గత సినిమాలు బలగం, మల్లేశం, జాతిరత్నాలతో మంచి మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక నాని ప్రొడ్యూసర్ కావడంతో ఆయన బ్యానర్‌పై ఉన్న ఇంపాక్ట్ దృష్ట్యా కోర్ట్ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది. ఆంధ్రా, నైజాం, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి మొత్తంగా రూ.10 కోట్ల మేర బిజినెస్ జరిగిందని ట్రేడ్ పండితులు తెలిపారు. అయితే 11 కోట్ల టార్గెట్ తో మూవీ రిలీజ్ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 650 థియేటర్‌లలో విడుదలైన కోర్ట్ చిత్రం పాజిటివ్ రివ్యూలతో దూసుకెళ్తుంది. తొలి రోజు 8 కోట్లు వసూల్ చేసింది. అలాగే రెండో రోజు 7 కోట్లు వసూల్ చేసింది. మొత్తంగా మూడో రోజు కోర్ట్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.5 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో రూ.2 కోట్లు చొప్పున ప్రపంచవ్యాప్తంగా రూ.7 కోట్ల వరకు వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మూడు రోజులకు 24 కోట్లకు పైగా వసూల్ చేసిన ఈ మూవీ కలెక్షన్స్ ఇంకాస్త పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.. ఈ మూవీ స్పీడును చూస్తుంటే త్వరలోనే 50 కోట్లు రాబట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు.. ఇక నాని సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం నాని రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. హిట్ 3 మూవీ ఈ ఏడాది రిలీజ్ అవ్వబోతుంది.