E-Paper
Advertisement

ఎరక్కపోయి ఇరుక్కుపోవడమంటే ఇదే.. గంటలపాటు నరకయాతన

ఎరక్కపోయి ఇరుక్కుపోవడమంటే ఇదే.. గంటలపాటు నరకయాతన
Advertisement

Failed Robbery in Ghaziabad: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకున్న ఒక వింత దొంగతనం యత్నం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దొంగతనం చేయడానికి వెళ్లిన ఒక యువకుడు.. అనూహ్య రీతిలో ఇరుక్కుపోయి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎరక్కపోయి ఇరుక్కుపోవడమంటే ఇదేనంటూ ఈ ఘటనపై నెటిజన్లు రకరకాల సెటైర్లు వేస్తున్నారు.

ఘజియాబాద్‌లోని ఒక క్లినిక్‌ను లక్ష్యంగా చేసుకున్న యువకుడు.. రాత్రి సమయంలో లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. క్లినిక్ ప్రధాన షట్టర్‌ను పగులగొట్టడం కష్టమని భావించి.. షట్టర్‌కు గోడకు మధ్య ఉన్న సన్నని సందు ద్వారా లోపలికి దూరేందుకు ప్లాన్ వేశాడు. అయితే అతడి అంచనా తప్పింది. లోపలికి వెళ్లే క్రమంలో తల భాగం షట్టర్ కింద ఇరుక్కుపోయింది. శరీరం వెనుక వైపు.. తల ముందు వైపు ఉండిపోవడంతో ముందుకు వెళ్లలేక.. వెనక్కి రాలేక ఆ యువకుడు కొన్ని గంటలపాటు నరకయాతన అనుభవించాడు.

Advertisement

మరుసటి రోజు ఉదయం క్లినిక్ సిబ్బంది యథావిధిగా విధుల కోసం వచ్చి షట్టర్ తెరవడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో లోపలి నుంచి దీనంగా వినిపిస్తున్న అరుపులు.. మూలుగులు విని వారు హడలిపోయారు. లోపల ఏదో జరుగుతోందని గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. షట్టర్ కింద ఒక వ్యక్తి తల ఇరుక్కుని ఉండటం చూసి విస్తుపోయారు. అతడిని బయటకు తీయడం పోలీసులకు కూడా పెద్ద సవాలుగా మారింది. షట్టర్‌ను జాగ్రత్తగా కట్ చేసి.. అతి కష్టం మీద ఆ యువకుడిని సురక్షితంగా బయటకు తీశారు.

పోలీసుల విచారణలో ఆ యువకుడు దొంగతనం కోసమే క్లినిక్‌లోకి వచ్చేందుకు ప్రయత్నించినట్లు అంగీకరించాడు. సుమారు 4-5 గంటల పాటు అలాగే తల ఇరుక్కుపోయి ఉండటంతో ఆ యువకుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. పోలీసులు అతడికి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి, అనంతరం కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తున్నాయి. “దొంగతనం చేయబోయి.. ఇలా అడ్డంగా దొరికిపోవడమా?” అంటూ నెటిజన్లు ఈ వింత దొంగపై జోకులు పేలుస్తున్నారు.

Advertisement

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×