BigTV English
Advertisement

AP Free Cylinders Scheme: ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ప్రకటించిన ప్రభుత్వం.. కానీ ఆ ఒక్కటి మిస్ అయితే..?

AP Free Cylinders Scheme

దీపావళికి ఏపీ ప్రభుత్వం కానుక ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. అదేనండీ ఉచితంగా ఏడాదికి మూడు సిలిండర్లు అందిస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అయితే ఈ విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం దీపావళి కానుకకు సంబంధించిన విషయాలను వెల్లడించారు.

AP Free Cylinders Scheme

పేద కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అండదండగా నిలిచేందుకు, ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను అందజేయనున్నట్లు, ఈ సిలిండర్లను బుకింగ్ చేసుకునే అవకాశాన్ని ఈనెల 24వ తేదీ నుండే ప్రారంభించాలని సీఎం, అధికారులకు ఆదేశించారు.

AP Free Cylinders Scheme

అలాగే ఈనెల 31వ తేదీ దీపావళి నుండి గ్యాస్ సిలిండర్ ల పంపిణీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్యాస్ సిలిండర్ తీసుకొని లబ్ధిదారులు మాత్రం తప్పనిసరిగా బ్యాంకు ఖాతాను కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలో గ్యాస్ సిలిండర్ తీసుకున్న రెండు రోజుల్లోనే గ్యాస్ సబ్సిడీని జమ చేయాలని, ఆలస్యం చేయవద్దని సీఎం సూచించారు.

AP Free Cylinders Scheme

దీనితో లబ్ధిదారులు తప్పనిసరిగా బ్యాంకు ఖాతాను కలిగి ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఖాతాను కలిగి ఉండని పరిస్థితుల్లో గ్యాస్ సిలిండర్ సబ్సిడీ జమకావడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. అర్హత గల ప్రతి లబ్ధిదారునికి మూడు గ్యాస్ సిలిండర్లు అందించాలన్న లక్ష్యంతో దీపం పథకం ద్వారా పండుగ రోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినట్లు సీఎం తెలిపారు.

AP Free Cylinders Scheme

కాగా దీపం పథకం ద్వారా ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ ల పంపిణీతో.. ప్రభుత్వానికి రూ.2684 కోట్ల రూపాయల భారం పడుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శి వీర పాండ్యన్ తెలిపారు.

AP Free Cylinders Scheme

దీపం పథకం అమలుతో, కూటమి ప్రభుత్వం ఎన్నికలలో మహిళలకు ఇచ్చిన హామీ నెరవేరినట్లేనని చెప్పవచ్చు. అయితే మహిళలకు ఫ్రీ బస్ హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పటివరకు ఈ పథకం గురించి ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోవడం విశేషం.

Related News

Rukmini Vasanth: ముద్దొచ్చేస్తున్న కనకావతి.. కష్టం బేబీ తట్టుకోవడం!

Rakul Preet Singh: ట్రెండీ వేర్‌లో రకుల్‌ హాట్‌ ఫోజులు.. మతిపోతుందంటున్న కుర్రకారు

Sapthami Gowda : యెల్లో డ్రెస్ లో క్యూట్ లుక్ తో కట్టిపడేస్తున్న కాంతారా బ్యూటీ..

Anupama ParameswRan : కిల్లింగ్ లుక్ లో లిల్లీ.. అబ్బా ఆ చూపులకే కుర్రాళ్ళు ఫిదా..!

Nidhhi Agerwal : గ్లామర్ డోస్ పెంచేసిన వీరమల్లు బ్యూటీ!

Avantika Mishra: బ్యాక్ లెస్ అందాలతో నిద్రలేకుండా చేస్తున్న మాయా బ్యూటీ!

Nisha Agarwal: వెకేషన్‌లో చిల్‌ అవుతున్న అక్కా చెల్లెల్లు.. కాజల్‌, నిషా అగర్వాల్‌ ఫోటోలు వైరల్‌

Rakul Preeth Singh : చూపులతో మత్తెక్కిస్తున్న రకుల్.. స్టిల్స్ మాములుగా లేవు..

×