
Shobha Shetty (Image credit: Instagram)
కార్తీకదీపం సీరియల్ లో మోనిత పాత్రతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న శోభశెట్టి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో విలనిజంతో మరింత ఇమేజ్ సొంతం చేసుకుంది.

Shobha Shetty (Image credit: Instagram)
ఈ సీరియల్ ద్వారా వచ్చిన గుర్తింపుతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ఈమె.. అక్కడ తన పెర్ఫార్మన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది. నిజాయితీతో అందరినీ మెప్పించింది. కానీ టాప్ ఫైవ్ కి చేరలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. అలా తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 హౌస్ నుంచి త్వరగానే బయటకు వచ్చేసింది.

Shobha Shetty (Image credit: Instagram)
మరొకవైపు బిగ్ బాస్ సీజన్ 11 కన్నడలో కూడా పాల్గొనింది. అయితే అక్కడ ఎక్కువ రోజులు ఉండలేక వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చినప్పటికీ త్వరగానే బయటకు వచ్చేసింది శోభా శెట్టి.

Shobha Shetty (Image credit: Instagram)
ఇదిలా ఉండగా తన ప్రియుడితో ఏడడుగులు వేసినట్లు ఒక ఆడ్ షూట్ చేసి విమర్శలు ఎదుర్కొన్న ఈమె ఇప్పుడు తాజాగా మరోసారి పెళ్లికూతురులా కనిపించి మరొకసారి అభిమానులను ఆశ్చర్యపరిచింది.

Shobha Shetty (Image credit: Instagram)
తాజాగా పెళ్లికూతురు గెటప్ లో అందరి దృష్టిని మెస్మరైజ్ చేసింది శోభ శెట్టి. కనీసం ఇప్పటికైనా పెళ్లి చేసుకో లేకపోతే ఇక నువ్వు నిజంగానే పెళ్లి పీటలెక్కినా ఎవరూ నమ్మరు అంటూ అభిమానులు ఈమెను హెచ్చరిస్తున్నారు.

Shobha Shetty (Image credit: Instagram)
మరి శోభా శెట్టి ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతుందో చూడాలి. మొత్తానికైతే శోభా శెట్టికి సంబంధించిన ఈ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.