Eesha Rebba (Source:Instragram)
ప్రముఖ హీరోయిన్ ఈషా రెబ్బ తొలిసారి 'అంతకుముందు ఆ తర్వాత' అనే చిత్రం ద్వారా నటిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది.
Eesha Rebba (Source:Instragram)
తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్ నగరాలలో పెరిగిన ఈమె అక్కడే ఎంబీఏ పూర్తి చేసింది.
Eesha Rebba (Source:Instragram)
అప్పట్లో ఫేస్బుక్లో బాగా యాక్టివ్ గా ఉండే ఈమె ఫోటోలు చూసిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ 'అంతకుముందు ఆ తర్వాత' సినిమాలో అవకాశం కల్పించారు.
Eesha Rebba (Source:Instragram)
ఇకపోతే ఈ సినిమా కంటే ముందు 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమా విడుదలైంది. తర్వాత అమీతుమీ, మాయ మాల్, దర్శకుడ, బందిపోటు, ఓయ్ చిత్రాలలో నటించింది.
Eesha Rebba (Source:Instragram)
సినిమాలతో పాటు టెలివిజన్ సీరియల్స్ లో కూడా నటించిన ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వరుస గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తోంది.
Eesha Rebba (Source:Instragram)
ఇప్పుడు చీరకట్టులో కనిపించి అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈమె ఫోటోలు చూసిన నెటిజన్స్ చీరకే వన్నె తెచ్చిన ఈమెను చూస్తే పెళ్లి కావాలంటారేమో అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.