OTT Movie : కొన్ని సినిమాలు అడ్వెంచర్ తో పిచ్చెక్కిస్తాయి. హాలీవుడ్ నుంచి వచ్చే ఈ సినిమాలలో, స్టోరీ కూడా ఒక రేంజ్ లో ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో, ఒక వింత జీవి విధ్వంసం సృష్టిస్తుంది. ఎడారిలో మనుషులను చంపుతూ ఉంటుంది. అయితే దాని ఆకారం కనిపించకుండా ఇదంతా చేస్తుంది. క్లైమాక్స్ లో ఆ వింత ఆకారం గురించి అసలు ట్విస్ట్ తెలుస్తుంది. ఈ మూవీ చివరివరకూ సస్పెన్స్ తో టెన్షన్ పెట్టిస్తుంది. ఈ హారర్ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో అనే వివరాల్లోకి వెళితే …
యూట్యూబ్ (Youtube) లో
ఈ బ్రిటిష్-కెనడియన్ హారర్ మూవీ పేరు ‘ది బోన్ స్నాచర్’ (The bone snatcher). ఈ మూవీకి జాసన్ వోల్ఫ్‌సోన్ దర్శకత్వం వహించారు. ఇందులో బెయిర్‌స్టో, రాచెల్ షెల్లీ, అడ్రియెన్ పియర్స్ నటించారు. ఈ స్టోరీ నమీబియా ఎడారి ప్రాంతంలో జరుగుతుంది. యూట్యూబ్ (Youtube) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
ఎలాండ్ మైనింగ్ కంపెనీకి చెందిన ముగ్గురు ఉద్యోగులు నమీబియా ఎడారిలో అదృశ్యమవుతారు. వారిని కనుగొనడానికి డాక్టర్ జాక్ స్ట్రేకర్ నేతృత్వంలో ఒక బృందం బయలుదేరుతుంది. వారు ఎడారిలోకి వెళ్లినప్పుడు, అదృశ్యమైన ఆ వ్యక్తుల ఎముకలను కనుగొంటారు. అవి రక్తంతో కప్పబడి ఉంటాయి. కానీ ఆ ఎముకలు కూడా మళ్లీ అదృశ్యమవుతాయి. ఇది ఎలా జరిగిందో అర్థం కాక అక్కడికి వచ్చిన వాళ్ళు తలలు పట్టుకుంటారు. అయితే స్థానిక గొర్రెల కాపరి ఒకతను ఈ ఘటనలకు ‘ఎసిఖులు’ అనే ఒక వింత జీవి కారణమని చెబుతాడు. ఈ జీవి ఒక విచిత్రమైన రూపంలో ఉంటుంది. ఇది చీమల లాంటి కీటకాల సమూహంగా, బాధితుల ఎముకల చుట్టూ చుట్టుకుని, వాటిని ఉపయోగించి కదలగలదు. ఈ జీవి షాట్‌గన్ దెబ్బలను తట్టుకోగలదు, శరీరాలను ఒక్కొక్కటిగా తినుకుంటూ, ఎముకల గూడుగా మార్చేస్తుంది. ఇది విని వీళ్ళంతా షాక్ అవుతారు.
ఈ బృందం ఈ జీవిని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తుంది, కానీ ఒక్కొక్కరూ దానికి ఆహారంగా మారుతారు. ఈ సన్నివేశాలు భయంకరంగా ఉంటాయి. ఆ ఎముకలను ఉపయోగించి కదులుతూ బీభత్సం సృష్టిస్తుంది ఆ వింత జెవి. చివరికి, జాక్ మిగిలిన వారు ఒక పాత గనిలో ఈ జీవి మూలాన్ని కనుగొంటారు. అక్కడ ఒక రాణి కీటకం ఈ సమూహాన్ని నియంత్రిస్తుందని తెలుస్తుంది. దీనికంతటికీ కారణం అదే అని గ్రహించి, జాక్ ఈ క్వీన్‌ను చంపడానికి వెళతాడు. చివరికి ఆ వింత జీవిని జాక్ అంతం చేస్తాడా ? దాని చేతుల్లోనే బలి అవుతారా ? అనే ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ హారర్ మూవీని మిస్ కాకుండా చూడండి. ఒక మంచి థ్రిల్లింగ్ ఇచ్చే మూవీని చూడాలి అనుకుంటే, ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.
Read Also : తెల్లార్లూ ఎంజాయ్… ఉదయాన్నే ఒంటిపై నూలు పోగు లేకుండా… ఎవరితో ఆ పని చేసిందో కూడా గుర్తులేనంతగా…