AP News : చేబ్రోలు కిరణ్. వైఎస్ భారతిని తిట్టడం ఎంత కాంట్రవర్సీ అయిందో.. ఆయనపై టీడీపీ వేటు వేయడం, అరెస్ట్ చేసి లోపలేయడం కూడా అంతే సంచలనంగా మారింది. కిరణ్ ఎపిసోడ్‌లో గోరంట్ల మాధవ్ ఎంట్రీ ఇచ్చి మరింత కలకలం రేపారు. పోలీసుల సమక్షంలోనే దురుసు ప్రవర్తనతో ఆయన కూడా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అంతటితో అయిపోతేదు మేటర్. తాజాగా, పోలీసుల మెడకూ చుట్టుకుంటోంది వివాదం.
ఒక్క ఫోన్.. అనేక డౌట్స్
గోరంట్లను కోర్టుకు హాజరు పరిచే సమయంలో ఆయన ఎవరితోనే సెల్‌ఫోన్‌లో మాట్లాడారు. ఆ వీడియో బయటకు రావడంతో వివాదం ముదిరింది. కస్టడీలో ఉన్న గోరంట్లకు ఫోన్ ఎలా వచ్చింది? ఎవరు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? మాధవ్ ఫోన్లో ఎవరితో మాట్లాడారు? అనే అంశాలపై ఇప్పుడు మరో విచారణ మొదలైంది. గోరంట్లకు పోలీసులే ఫోన్ ఇచ్చారని అనుమానిస్తున్నారు. అంతేకాదు.. చేబ్రోలు కిరణ్‌ను పట్టుకున్నదీ.. ఏ రూట్లో, ఏ కారులో గుంటూరుకు తీసుకు వస్తున్నదీ.. మొత్తం డీటైల్స్ మినిట్ టు మినిట్ మాధవ్‌కు ఎవరో అప్‌డేట్ ఇచ్చారని తెలుస్తోంది. అది కూడా పోలీసుల పనేనని అంటున్నారు. డిపార్ట్‌మెంట్లోని కొందరు ఖాకీలు.. తమ మాజీ అఫీసర్‌తో అంటకాగుతున్నారని భావిస్తున్నారు.
మాజీ ఖాకీకి తాజా ఖాకీలు సపోర్ట్?
గోరంట్లతో టచ్‌లో ఉన్న పోలీసులు ఎవరు? ఆయనకు టైమింగ్స్‌తో, రూట్ మ్యాప్ అప్‌డేట్ ఇచ్చింది ఎవరు? కోర్టులో హాజరు పరిచే సమయంలో మాధవ్‌కు ఫోన్ ఇచ్చింది ఎవరు? ఇలా మొత్తం వ్యవహారంపై పోలీస్ శాఖను సమగ్ర రిపోర్ట్ కోరింది ప్రభుత్వం. ఆ నివేదిక ఆధారంగా సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది సర్కారు. ఇప్పటికే డిపార్ట్‌మెంట్‌లో అంతర్గత విచారణ స్టార్ చేశారని తెలుస్తోంది.
గోరంట్ల మాట్లాడింది ఎవరితో?
అటు, గోరంట్ల మాధవ్ ఫోన్లో ఎవరితో మాట్లాడారు? అనే అంశంపైనా ఆసక్తికర చర్చ నడుస్తోంది. జగన్‌తో మాట్లాడారా? అంబటితో మాట్లాడారా? అడ్వకేట్ పొన్నవోలుకు ఫోన్ చేశారా? ఫ్యామిలీ మెంబర్స్‌కు కాల్ చేశారా? ఇలా అనేక డౌట్స్. ఆ ఫోన్ ఎవరిదో ట్రేస్ చేసే పనిలో ఉన్నారు పోలీసులు. ఆ సెల్ గుర్తిస్తే.. మాధవ్ ఎవరితో ఫోన్లో మాట్లాడారో తెలిసిపోతోంది.
Also Read : పాస్టర్ ప్రవీణ్ కేసులో అసలు నిజాలు ఇవే..
ఈ లాజిక్ ఎలా మరిచారు?
ఏదో అనుకుంటే ఇంకేదో అయినట్టుంది గోరంట్ల మాధవ్ ఎపిసోడ్. భారతిని తిట్టిన వాడిన కొట్టుదామని అనుకున్నారు. పక్కా స్కెచ్ వేసి.. కాపు కాసి.. కొట్టబోయారు కూడా. కానీ, పోలీసులు ఉన్నారనే లాజిక్ మరిచారు. మనోళ్లే కదా ఏం కాదులే అనుకున్నారేమో. కానీ, సీన్ రివర్స్ అయింది. జగన్ దగ్గర మంచి మార్కులు వేసుకుందామని ఇంత చేస్తే.. ఆ జగనే ఇప్పుడు జైలుకు వచ్చి తనను పరామర్శించాల్సిన పరిస్థితి తెచ్చుకున్నట్టుంది. ఎరక్కపోయి ఇరుక్కున్నారు గోరంట్ల అని వైసీపీ శ్రేణులే చర్చించుకుంటున్నారు. తప్పు చేశాడని ఐటీడీపీ కార్యకర్తనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది ప్రభుత్వం. అలాంటిది వైసీపీ నేతలు రెచ్చిపోతాం? కొట్టేస్తాం.. తన్నేస్తాం.. అంటే ఊరుకుంటుందా? ఇదిగో ఇలా జైలుకు వెళ్లాల్సి వస్తుందని మాధవ్ అరెస్టుతో స్ట్రాంగ్ మెసేజే ఇచ్చింది టీడీపీ సర్కార్ అని అంటున్నారు.