
Hebah Patel (Source: Instragram
మోడల్ గా కెరియర్ ను ఆరంభించి 2014లో వచ్చిన అధ్యక్ష అనే కన్నడ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది హెబ్బా పటేల్. ఇక అదే ఏడాది తిరుమనం ఎనుమ్ నిక్కా అనే చిత్రంతో తమిళ సినీ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టింది. అంతేకాదు అదే ఏడాది తెలుగులో కూడా అరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ.

Hebah Patel (Source: Instragram
అలా ఎలా అనే సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె.. 2015లో కుమారి 21ఎఫ్ సినిమాతో మరింత విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇందులో తన పాత్రకు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి.

Hebah Patel (Source: Instragram
అంతేకాదు ఈ రెండు చిత్రాలతో తన నటనకు సంతోషం ఫిలిం అవార్డులలో ఉత్తమ తొలి నటి తెలుగు విభాగంలో అవార్డు లభించింది

Hebah Patel (Source: Instragram
ఆ తర్వాత ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, అంధగాడు, ఏంజెల్ , 24 కిస్సెస్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మధ్య వచ్చిన ఓదెల , ఓదెల 2 సినిమాలతో తన సెకండ్ ఇన్నింగ్స్ ను గట్టిగానే మొదలుపెట్టింది.

Hebah Patel (Source: Instragram
ఇటీవలే ఈషా సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈమె.. ఆద్య అనే తమిళ్ సినిమాలో కూడా నటిస్తోంది.త్వరలో విడుదల కాబోతోంది. ఇదిలా ఉండగా మరోవైపు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది

Hebah Patel (Source: Instragram
ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి చీరకట్టులో కనిపించి కుర్రకారు హృదయాలు కొల్లగొట్టింది. విభిన్నమైన ఫోజులతో మెస్మరైజ్ చేస్తోంది. వీపు అందాలు చూపిస్తూ అభిమానులలో హీట్ పుట్టిస్తుంది ఈ ముద్దుగుమ్మ.