Janhvi kapoor (Source: Instragram)
జాన్వీ కపూర్.. దివంగత నటీమణి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె తన అందంతో ఆడియన్స్ ను అలరించే ప్రయత్నం చేస్తోంది.
Janhvi kapoor (Source: Instragram)
బాలీవుడ్లో పలు చిత్రాలు చేసిన ఈమె.. తెలుగులో కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
Janhvi kapoor (Source: Instragram)
ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమాలో కూడా హీరోయిన్గా అవకాశం అందుకుంది. ఈ చిత్రానికి ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు.
Janhvi kapoor (Source: Instragram)
భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాతో జాన్వీ కపూర్ ఇమేజ్ కచ్చితంగా పెరిగిపోతుందని అభిమానులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Janhvi kapoor (Source: Instragram)
ఇదిలా ఉండగా మరొకవైపు అప్పుడప్పుడు ఫ్యాషన్ షోలలో దర్శనమిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అందులో భాగంగానే తాజాగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఒక ఔట్ఫిట్ లో జాన్వీ కపూర్ దేవకన్యను తలపిస్తోంది అని చెప్పవచ్చు.
Janhvi kapoor (Source: Instragram)
తాజాగా ఈ లుక్ లో జాన్వీ కపూర్ ని చూసిన ఆడియన్స్ తల్లి శ్రీదేవిని గుర్తు చేస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా జాన్వీ అందాలు అందరినీ మరొకసారి ఆకట్టుకుంటున్నాయి.