Intinti Ramayanam Today Episode july 29th : నిన్నటి ఎపిసోడ్ లో.. పార్వతి ఇంటికి చక్రధర్ రావడం చూసి కమల్ శ్రీకర్ ఇద్దరు నిన్ను ఎవరు పిలిచారు? నువ్వు ఎందుకు వచ్చావు? మా ఇంటికి? పిలువని పేరంటానికి రావాల్సిన అవసరం నాకు లేదు మీ అమ్మ రమ్మని పిలిస్తేనే నేను వచ్చాను అని చక్రధర్ అంటాడు. ఫంక్షన్ స్టార్ట్ అవ్వకముందే గొడవ ఎలా ఉంది అని పల్లవి పార్వతితో చెబుతుంది.. పార్వతి శ్రీకర్, కమల్ దగ్గరకు వచ్చి ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నారు మామయ్య అని కూడా కొంచెం కూడా లేదా.. మర్యాద లేకుండా మాట్లాడతారు ఏంటి మీ మామయ్యని అత్తని రమ్మని పిలిచాను. నోరు అదుపులో పెట్టుకొని ఉండండి అని పార్వతి కొడుకులకు వార్నింగ్ ఇస్తుంది. పల్లవి ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతుంది. మా నాన్న అంటే ఎందుకంత అసహ్యం మీకు. ఏంటి మంచి కోరే వారిలో మా నాన్న మొదటిగా ఉంటారు కానీ మీకెందుకు మా నాన్న అంటే ఇష్టం లేదు అని అరుస్తుంది. ఇక శ్రీకర్ కమల్ కు పార్వతి క్షమాపణ చెప్పమని కోరుతుంది.. ప్రణతి పెళ్లిచూపులు గురించి ఎవరికి చెప్పలేదు కదా.. అది ముఖ్యం అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికోస్తే.. పెళ్లి చూపులు కోసం పెల్లింటి వాళ్ళు వస్తారు. పార్వతి వాళ్ళని ఇంట్లోకి తీసుకొని వస్తుంది. అందరికీ పరిచయం చేస్తుంది. కానీ అవనిని పరిచయం చేయదు. రాజేంద్రప్రసాద్ అవనీని పెద్ద కోడలుగా పరిచయం చేస్తాడు. పార్వతిని ఎవరు అని అడుగుతాడు రాజేంద్రప్రసాద్.. అవనీకి అనుమానం వస్తుంది. ఈ విషయాన్ని ఎలాగైనా సరే కనిపెట్టాలి అని అనుకుంటుంది. మావయ్యకి తెలియకుండా చక్రధర్ బాబాయ్ కి ను అత్తయ్యకును తెలిసిన వాళ్లు అంటే ఏదో తేడాగా ఉంది అని ఆలోచిస్తూ ఉంటుంది అవని..
పెళ్ళికొడుకు మాత్రం అనుమానంగా అటు ఇటు వెతకడం చూసి అవనికి అనుమానం ఇంకాస్త పెరిగిపోతుంది. అవని రాజేంద్రప్రసాద్ ని పక్కకు తీసుకొచ్చి నాకు ఏదో అనుమానంగా ఉంది మావయ్య. మీకు తెలియకుండా అత్తయ్య వాళ్ళు ఎవరున్నారు అని అడుగుతుంది. చక్రధర్ బాబాయ్ కి తొలిసారి అంటే కచ్చితంగా ఏదో జరుగుతుందని అర్థమవుతుంది. నాక్కూడా అదే అర్థమవుతుందమ్మా ఇంకాస్త వెయిట్ చేస్తే అసలు విషయం ఏంటో తెలిసిపోతుంది కదా అని రాజేంద్రప్రసాద్ అంటాడు. అయితే ఈ ఫంక్షన్ అయ్యేలోగా వాళ్ళు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను అని రాజేంద్రప్రసాద్ అంటాడు.
ప్రణతి దగ్గరికి వచ్చిన రాజేశ్వరి మీకు ఇలా అవడం నాకు చాలా బాధగా ఉంది. నీకు కచ్చితంగా మంచి లైఫ్ ఉంది అని అంటుంది. నువ్వు అవని దగ్గర ఉన్నావు కాబట్టే చాలా సంతోషంగా ఉన్నావని అనుకుంటున్నాను.. అప్పుడే పార్వతి పల్లవిశ్రియాలు అక్కడికి వస్తారు. ఈ నగలను పెట్టుకుంటే చాలా బాగుంటావ్ అని అడుగుతారు. ప్రణతిని నగలతో అందంగా ముస్తాబు చేస్తారు. మీ షష్టిపూర్తి ఫంక్షన్ కోసమే మీ అమ్మాయిని అందంగా రెడీ చేస్తున్నారా అని పార్వతిని అవని అడుగుతుంది.
ఎందుకు రెడీ చేస్తే నీకెందుకు అని పల్లవి అంటుంది. అలాగే శ్రియ కూడా అవనిని అంటుంది. దానికి పార్వతీ కూడా నా కూతురిని రెడీ చేసుకోవడానికి నీ పర్మిషన్ తీసుకోవాలా? నా కూతురు అందంగా కనిపించాలని నేను రెడీ చేయడం తప్పేనా అని పార్వతి అడుగుతుంది. తప్పేం కాదు అత్తయ్య.. అయినా నీ బోడి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి నువ్వు ఫంక్షన్ కోసం వచ్చావు అలానే ఉండు అలానే వెళ్ళు అని పార్వతి అంటుంది.
కమ్మలు అవనీ వదిన అక్షయ్ అన్నయ్య కలిస్తే బాగుంటుంది అని అనుకుంటాడు. వదిన దగ్గరికి వచ్చి అన్నయ్య పిలుస్తుందని చెప్పి గదిలోకి పంపిద్దామని అనుకుంటాడు. అక్షయ్ దగ్గరికి అవని రాగానే బయట నుంచి లాక్ వేస్తాడు. మాట్లాడుకుంటూ ఉంటారు అవని మాత్రం అక్షయ్ ని ఆటపట్టిస్తూ ఉంటుంది. మళ్ళిద్దరినీ ఈ గదిలో చూస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారు అని తలుపు రావట్లేదు అని అంటాడు. తలుపు కొట్టిన సౌండ్ రావడంతో పల్లవి వచ్చి తలుపుతీస్తుంది లోపల ఉన్న వీళ్ళిద్దరిని చూసి షాక్ అవుతుంది. కమల్ మాత్రం వాళ్ళిద్దరూ ఏదో తప్పు చేసినట్లు అలా అనుకుంటున్నావేంటి భార్యాభర్తలే కదా అని కౌంటర్ ఇస్తాడు.
Also Read: రోహిణి ప్లాన్ సక్సెస్.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. కన్నీళ్లు పెట్టుకున్న మీనా..
ఆ వచ్చిన పెళ్లికొడుకు గదులన్నీ వెతుకుతూ అనుమానంగా తిరుగుతూ ఉంటాడు. అయితే అతని చూసిన అవని ఎవరు కావాలి ఏంటి అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. వాష్ రూమ్ కి వచ్చాను అని అంటాడు. అసలు నేనెవరో ఈ ఫంక్షన్ తర్వాత మీకే తెలుస్తుంది అని అతను అంటాడు. అయితే అవినీతి ఆ పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న మీద అనుమానం మొదలవుతుంది. ప్రణతి భరతుల పెళ్లి విషయం ఎలాగైనా ఆటంకం కలగకుండా చెప్పాలి అని అనుకుంటుంది. అక్కడికి వచ్చిన పంతులు ఆలస్యమైనందుకు క్షమించాలి అని ఆ రోజు గురించి గొప్పగా చెప్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..