Krithi Shetty (Source: Instragram)
కన్నడ ముద్దుగుమ్మ కృతి శెట్టి తన అందంతో, అభినయంతో పలు యాడ్స్ చేసి ప్రేక్షకులను మెప్పించింది.
Krithi Shetty (Source: Instragram)
ఆ తర్వాత తెలుగులో బుచ్చిబాబు సనా తొలి దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
Krithi Shetty (Source: Instragram)
మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకోవడమే కాకుండా ఏకంగా ఈ సినిమాతో వంద కోట్ల క్లబ్లో చేరి సంచలనం సృష్టించింది. ఉత్తమ నటి విభాగంలో పలు అవార్డులు కూడా అందుకుంది.
Krithi Shetty (Source: Instragram)
ఆ తర్వాత బంగార్రాజు శ్యామ్ సింగరాయ్ అంటూ హ్యాట్రిక్ సక్సెస్ అందుకున్న ఈమెకు మళ్ళీ అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయింది.
Krithi Shetty (Source: Instragram)
ప్రస్తుతం తమిళంలో సినిమా చేస్తున్న ఈమె తాజాగా సోషల్ మీడియాలో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే సిల్వర్ కలర్ బాడీ ఫిట్ డ్రెస్ ధరించి అందాలతో మత్తెక్కించింది.
Krithi Shetty (Source: Instragram)
ఇక అందులో భాగంగానే నిషా కళ్ళతో ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తన అందంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.