అమెరికాలో పోలీసు వ్యవస్థ ఎంత పవర్ ఫుల్ గా ఉన్నప్పటికీ, నేరాలు అంతకు మించి జరుగుతున్నారు. తాజాగా మెట్రోలో ప్రయాణిస్తున్న ఓ ఉక్రెయిన్ శరణార్థిని నల్లజాతీయుడు కత్తితో దారుణంగా పొడిచి చంపేశాడు. ఈ దాడికి సంబంధించిన వీడియోలను పోలీసులు విడుదల చేశారు. ముందు సీట్లో కూర్చున్నయువతిని.. తనతో పాటు తెచ్చుకున్న చిన్న పదునైన కత్తితో ఆమె మెడమీద పొడిచి హత్య చేశాడు నేరస్తుడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఉక్రెయిన్ లో యుద్ధవాతావరణాన్ని తట్టుకోలేక, చక్కటి జీవితాన్ని గడపాలనే ఆశతో 23 ఏళ్ల ఇరినా అనే యువతి అమెరికాకు వచ్చింది. ఎప్పటిలాగే మెట్రోలో తను ఉండే ప్రాంతానికి వెళ్లాలి అనుకుంది. రైల్లో ఎక్కి కూర్చున్నది. కాసేపట్లో తన ప్రాణాలు పోతాయని ఆమె అస్సలు ఊహించి ఉండదు. పిజ్జేరియా యూనిఫాంలో ఉన్న ఇరినా రాత్రి 9:46 గంటలకు లైట్ రైలు ఎక్కి కూర్చుని, తన ఫోన్ చూసుకుంటుంది. ఆమె వెనుక, 34 ఏళ్ల డెకార్లోస్ బ్రౌన్ జూనియర్ కూర్చున్నాడు. నాలుగు నిమిషాల తర్వాత, అతను మడతపెట్టే కత్తిని తీసి ముందుకు దూసుకెళ్లాడు. ఆమె మెడ మీద మూడుసార్లు పొడిచాడు. ఇరినా అక్కడిక్కడే కుప్పకూలిపోయింది.
https://twitter.com/ceanmedia/status/1964245558714867892
Read Also: అఫ్ఘాన్ భూకంప శిథిలాల్లో మహిళలు.. బతికున్నా రక్షించకుండా వదిలేసిన మగాళ్లు!
బ్రౌన్ ఆమెను కత్తితో పొడిచిన తర్వాత కూడా రైల్వే కోచ్ లో రక్తం కారుతున్న కత్తితో అటూ ఇటూ తిరుగుతూ కనిపించాడు. ఇరినా సీటు నుంచి కిందపడిపోయింది. రక్తం చిందుతుండగా ఆమె మెడను పట్టుకుంది. కాసేపటికే ఆమె చనిపోయినట్లు రైల్లో ఉన్న ప్రయాణీకులు వెల్లడించారు. ఘటన జరిగిన తర్వాత నెక్ట్స్ స్టాప్ లో బ్రౌన్ దిగి వెళ్లిపోయాడు. అక్కడ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఆమెను హత్య చేయడానికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అతడిపై ఫస్ట్ డిగ్రీ కేసు నమోదు చేసినట్లు షార్లెట్-మెక్లెన్ బర్గ్ పోలీస్ డిపార్ట్ మెంట్ వెల్లడించింది.
పోలీసులు రికార్డుల ప్రకారం బ్రౌన్ కు 2011 నుంచి నేర చరిత్రను కలిగి ఉన్నాడు. వీటిలో దొంగతనం, ఆయుధాలను చూపించి దోపిడీ చేయడం, బెదిరింపులకు సంబంధించిన పలు మార్లు అరెస్టు అయ్యాయి. దోపిడీకి సంబంధించి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష కూడా అనుభవించాడు. అమెరికాలో అత్యవసర నెంబర్ 911కు అకారణంగా ఫోన్ చేసిన ఘటనలోనూ బ్రౌన్ అరెస్టు అయ్యాడు. ప్రస్తుతం అతడిని పోలీసులు విచారిస్తున్నారు. అయితే, ఆమెను చంపడానికి గల కారణాలను మాత్రం అధికారులు ఇంకా గుర్తించలేదు. త్వరలోనూ పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Read Also: ప్రయాణీకుల భద్రతకు రైల్వే కీలక నిర్ణయం, ఇక కోచ్ లలోనూ సీసీ కెమెరాలు!