Virender Sehwag : సాధారణంగా భారత్ – పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఆ కిక్కే వేరు. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు ఫ్యాన్స్. ముఖ్యంగా కొందరూ అయితే కళ్లల్లో వొత్తులు వేసుకొని ఎదురుచూస్తారు అభిమానులు. చిరకాల ప్రత్యర్థి పై వీరావేశంతో ఆడుతుంటారు టీమిండియా క్రికెటర్లు. సచిన్ టెండూల్కర్ నుంచి విరాట్ కోహ్లీ వరకు పాక్ పై రెచ్చిపోయిన చాలా మంది ఆటగాళ్లను మనం చూశాం. వీళ్లలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. పాకిస్తాన్ జట్టు పై ఏకంగా సెహ్వాగ్ టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించి రికార్డు నెలకొల్పాడు. తాజాగా సెహ్వాగ్ దాదాపు 17 సంవత్సరాల కిందట జరిగిన ఓ మ్యాచ్ ను గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం అతను చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇంతకు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఏం చెప్పాడంటే..?
Also Read : Kohli-Rohith : పాపం…భారత-A జట్టులో కోహ్లీ, రోహిత్… ఆ యంగ్ ప్లేయర్ కెప్టెన్సీలో ?
2008లో భారత జట్టు చివరిసారిగా పాకిస్తాన్ కి పర్యటనకు వెళ్లింది. అయితే అక్కడ కరాచీలో జరిగిన వన్డే మ్యాచ్ లో ప్రత్యర్థి నిర్దేశించిన 302 పరుగుల ఛేదనలో సెహ్వాగ్ పాకిస్తాన్ కి విశ్వరూపం చూపించాడు. దూకుడుకు కేరాఫ్ అయినటువంటి వీరుడు పాకిస్తాన్ ప్రధాన బౌలర్లను ఊచకోత కోశాడు. దీంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. కేవలం 95 బంతుల్లోనే 119 పరుగులు చేసి టీమిండియా విజయానికి బాటలు వేశాడు. అయితే ఆ మ్యాచ్ రోజు వీరేంద్ర సెహ్వాగ్ ఉపవాసం ఉన్నాడట. ఈ విషయం ఇప్పటి వరకు అతడు చెబితే కానీ ఎవ్వరికీ తెలియదు. “పాకిస్తాన్ తో మ్యాచ్ జరిగిన రోజు నేను ఉపవాసం ఉన్నానని.. ఖాలీ కడుపుతోనే బ్యాటింగ్ కి వెళ్లాను. నా ఆకలి తీరాలంటే.. ఎక్కువ పరుగులు చేయాలని అనుకున్నాను. అనుకున్నట్టుగానే భారత జట్టు విజయానికి తోడ్పాటును అందించే ఇన్నింగ్స్ ఆడాను” అని గుర్తు చేసుకున్నాడు సెహ్వాగ్.
ఇక ఆ మ్యాచ్ లో 125.6 స్ట్రైక్ రేటుతో వీరూ 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 95 బంతుల్లో 119 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. గతంలో పాకిస్తాన్ ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. అయితే ఓపెనర్ గా వీరేంద్ర సెహ్వాగ్ కేవలం పాకిస్తాన్ పై మాత్రమే కాదు.. ప్రతీ టీమ్ పై రెచ్చిపోయాడనే చెప్పాలి. ముఖ్యంగా 2003 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా పై కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఆ మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు అందరూ పేలవ ప్రదర్శన చేయడంతో ఆస్ట్రేలియా టీమిండియా ఓటమి చెందింది. గతంలో సెహ్వాగ్ ఏవిధంగా రెచ్చిపోయాడో.. ప్రస్తుతం సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ సైతం జూనియర్ స్థాయిలో దుమ్మురేపుతున్నాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో ఈ చిచ్చరపిడుగు తండ్రిని తలపించే బ్యాటింగ్ తో అలరిస్తున్నాడు.