Bigg Boss 9 Promo : బిగ్బాస్ తెలుగు సీజన్ 9 ఆసక్తికరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు వారాలు దాటి 5వ వారంలోకి ఎంట్రీ ఇచ్చేశారు హౌస్ మేట్స్. మొదటివారం షష్టి వర్మ వెళ్లిపోయారు, తర్వాత మర్యాద మనీష్, ఆ తర్వాత ప్రియా శెట్టి, ఇక లేటెస్ట్ గా హరీష్ కూడా ఎలిమినేట్ అయిపోయారు. మొత్తానికి ముగ్గురు కామనర్లు మూడు వారాల్లో బయటకు వెళ్లిపోయారు.
కొద్దిసేపటి క్రితమే బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇమ్మానుయేల్ కామెడీతో మొదలైన ఈ ప్రోమో సీరియస్ టర్న్స్ తీసుకుంది. ఇద్దరినీ ఒక టీం గా కలిపి కొత్త గేమ్ పెట్టారు బిగ్ బాస్. బిగ్ బాస్ గేమ్ మొదలుపెట్టేముంది కండిషన్స్ చెప్పారు.
ఒక కంటెస్టెంట్ ముఖానికి నీడిల్ మాస్క్ ఉంటుంది. ఆ నీడిల్ మాస్క్ ఉన్న బాక్స్ లోకి ఇంకో కంటెస్టెంట్ బెలూన్ ఊది పంపించాలి. నీడిల్ మాస్క్ ఉన్నవాళ్లు బెలూన్ తమ పైన పడకుండా ఐదు నిమిషాల పాటు ఊదుతూనే ఉండాలి. అలా అయిదు నిమిషాలు గాలిలో బెలూన్ ఉన్న తర్వాత, ఆ టీమ్ మేట్ వచ్చి గంట కొట్టొచ్చు.
ఈ గేమ్ లో అందరూ తమ తెలివితేటలు చూపించారు. బిగ్బాస్ చెప్పినట్లు ఆడకుండా వేరే రకంగా గేమ్ ఆడారు. రీతు చౌదరి పవన్ ముందు ఇది స్టార్ట్ చేశారు. అయితే సంజన, ఫ్లోరా వీళ్ళిద్దరూ కలిసి ఈ గేమ్ జెన్యూన్ గా ఆడారు.
బిగ్బాస్ దీనిని దృష్టిలో పెట్టుకొని మొదట రీతు చౌదరికి, పవన్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అలానే సంజన వాళ్ళని బాగా ఆడారు అని చెప్పారు. వాళ్లు బాగా ఆడినా కూడా హౌస్మేట్స్ లో ఎవరు తప్పు చేసినా హౌస్ అందరికీ శిక్ష వర్తిస్తుంది కాబట్టి, హౌస్ మేట్స్ కి ఉన్న పాయింట్స్ లో సగానికి తగ్గిస్తాను అని చెప్పేశారు. వేరే హౌస్ మిట్స్ చేసిన మిస్టేక్స్ వలన తన పాయింట్ తగ్గిపోయినందుకు సంజన కన్నీళ్లు పెట్టుకుంది.
మొత్తానికి ఈ ప్రోమో చూస్తుంటే ఈరోజు ఎపిసోడ్ కూడా మరింత ఆసక్తికరంగా సాగబోతుంది అని అవగాహన వచ్చేసింది. ప్రస్తుతం హౌస్మెట్స్ అందరిలో కూడా ఇమ్మానుయేల్ కి మంచి పేరు లభించింది. కొన్ని గేమ్స్ ఆడే విధానం, అలానే హౌస్మేట్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉండటం, అలానే కొన్ని సందర్భాలలో మాట్లాడే తీరు ఇవన్నీ కూడా వీక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అందుకే ఇమ్మానుయేల్ కు మంచి సపోర్ట్ లభిస్తుంది.
Also Read: Heroine : హీరోయిన్ పై దారుణం, మత్తు మందిచ్చి ఆ పని చేసిన నటుడు