
Mouni Roy ( Source / Instagram)
బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ ఎంతోమంది బాగా పాపులర్ అయ్యారు. అలాంటి వారిలో బాలీవుడ్ ముద్దుగుమ్మ మౌని రాయ్ ఒకరు.. నాగిని సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన ఈమె ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది..

Mouni Roy ( Source / Instagram)
కేవలం సీరియల్స్ మాత్రమే కాదు.. వెండితెరపై కూడా సందడి చేస్తుంది. మెయిన్ రోల్స్‌తో పాటు సైడ్ క్యారెక్టర్స్ కూడా చేస్తూ ప్రజెంట్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉంది..

Mouni Roy ( Source / Instagram)
ఈ మధ్య మౌనీ రాయ్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ హీరోయిన్ మరింత అందంగా మారడం కోసం ఫేస్‌కి సర్జరీ చేయించుకుందని ట్రోల్స్ కూడా నెట్టింట వినిపిస్తున్నాయి.

Mouni Roy ( Source / Instagram)
ఇక ప్రస్తుతం ఈమె పేరు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఓ ఈవెంట్ లో ఇద్దరు మగాళ్లు ఆమెతో ప్రవర్తించిన తీరుపై ఆమె మండిపడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది కాస్త వైరల్ అవడంతో బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది..

Mouni Roy ( Source / Instagram)
ఇకపోతే ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలతో అభిమానులను పలకరిస్తూ ఉంటుంది.

Mouni Roy ( Source / Instagram)
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో గోల్డ్ కలర్ డ్రెస్ లో మిర్రర్ ముందు క్యూట్ సెల్ఫీలను దిగింది. కలర్‌ఫుల్ డ్రెస్ లో ఆమె ఇచ్చిన స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..