E-Paper
Advertisement

Shriya Saran: ప్రెగ్నెన్సీ జర్నీపై శ్రియా ఎమోషనల్.. ఫీలింగ్స్ అదుపులో ఉండవు!

Shriya Saran: ప్రెగ్నెన్సీ జర్నీపై శ్రియా ఎమోషనల్.. ఫీలింగ్స్ అదుపులో ఉండవు!

Shriya Saran:శ్రియ శరణ్ (Shriya Saran).. ఒకప్పుడు తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ చిన్నది.. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి భారీ పాపులారిటీ అందుకుంది. ముఖ్యంగా నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి వంటి సీనియర్ స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. కెరియర్ పీక్స్ లో ఉండగానే ఇండస్ట్రీకి దూరమైంది. 2018 నుంచి మళ్లీ ఇండస్ట్రీలో కనిపించలేదు
దీనికి తోడు 2020లో కరోనా రావడంతో ఇంటికే పరిమితమైంది. కానీ కొన్నేళ్ల తర్వాత సడన్గా తనకు బిడ్డ పుట్టింది అని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది.దీంతో ఈమెకు పెళ్లెప్పుడు అయ్యింది? ఈమె భర్త ఎవరు? ఈమె ఎప్పుడు గర్భవతి అయింది? అంటూ పలు రకాల అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఇదంతా కరోనా కాలంలోనే జరిగిపోయింది అని చెప్పి అభిమానులను, సెలబ్రిటీలను ఆశ్చర్యపరిచింది.

ప్రెగ్నెన్సీ జర్నీపై శ్రియా ఎమోషనల్..

ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ద్వారా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో నటించి.. మళ్లీ తెలుగు ప్రజలను అలరిస్తూ కెరియర్ ను ఆరంభించిన ఈమె అటు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అలాంటి శ్రియా శరణ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని.. ప్రెగ్నెన్సీ జర్నీ గురించి చెప్పుకొచ్చింది. అంతేకాదు ఫీలింగ్స్ మారుతూ ఉంటాయని.. కచ్చితంగా ఆ సమయంలో తోడు కావాలి అని చెప్పింది. ఇదే విషయంపై శ్రియా శరణ్ మాట్లాడుతూ.. “ఒక మహిళ గర్భం దాల్చినప్పుడు ఆమె శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. కడుపులో మరో ప్రాణి ఊపిరి పోసుకుంటోంది అంటే అదొక అద్భుతమైన అనుభవం.. కాబట్టి అది అతడిదే బాధ్యత. అయితే ఈ సమయంలో మానసికంగా , శారీరకంగా కూడా అనేక మార్పులు జరుగుతుంటాయి. కొన్నిసార్లు భావోద్వేగాలు అదుపులో ఉండవు. కడుపులో ఒక బిడ్డను మోస్తూ తిరగాల్సి ఉంటుంది. అప్పుడు నువ్వు నీలాగా అసలు కనిపించవు.

ఆ బాధ్యత కట్టుకున్న వాడిదే..

ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో భార్యను బాధ్యతగా చూసుకోవాల్సింది భర్త మాత్రమే.. నేను గర్భం దాల్చినప్పుడు ఎక్కువ బాధగా అనిపించేది. నా భర్త నాతో ఎక్కువసేపు ఉంటే బాగుండు అనిపించేది. అంతేకాదు అదే సమయంలో ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా పనికి వెళ్లాలనిపించేది. ఇలా నేను గర్భం దాల్చినప్పుడు నా ఎమోషన్స్ నా అదుపులో ఉండేవి కాదు” అంటూ తన ప్రెగ్నెన్సీ జర్నీ గురించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కరోనా సమయంలో మీరు గర్భం దాల్చారు కాబట్టి బయటకు వెళ్ళలేని పరిస్థితి కారణంగా మీరు ఇలాంటి బాధలు ఇంకా ఎక్కువ అనుభవించి ఉంటారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ALSO READ:The RajaSaab: రాజాసాబ్ ఓటీటీ డీల్ క్లోజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

శ్రియా శరణ్ వ్యక్తిగత జీవితం, సినిమాలు..

శ్రియ శరన్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. రష్యాకు చెందిన ఆండ్రీ కొశ్చీవ్ ను 2018లో వివాహం చేసుకుంది. వీరికి 2021లో రాధా శరణ్ కొశ్చీవ్ అనే కూతురు జన్మించింది. ఇక ఇప్పుడు ఈ పాపతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తూ పలు రకాలు ఫోటోలను పంచుకుంటూ ఉంటుంది . ఈమె సినిమాల విషయానికొస్తే సంతోషం, ఠాగూర్, నేనున్నాను, నీకు నేను నాకు నువ్వు వంటి చిత్రాలలో నటించిన ఈమె తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ప్రస్తుతం దృశ్యం3 సినిమాలో హిందీలో నటిస్తోంది.

Related News

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

Big Stories

×