Payal Rajput (6)
Payal Rajput Latest Photos: బోల్డ్ బ్యూటీ, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఈ మధ్య సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. మొన్నటి వరకు సైలెంట్‌గా ఈ ముద్దుగుమ్మ.. కొన్ని రోజులుగా వరుస ఫోటోలు షేర్ చేస్తోంది.
Payal Rajput (10)
ఎప్పుడు బోల్డ్ లుక్స్‌తో సర్ప్రైజ్ చేసే ఈ భామ.. తాజాగా క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది. ఆర్ఎక్స్ 100 సినిమాతో పాయల్ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హీరో కార్తీకేయ సరసన నటించింది.
Payal Rajput (11)
ఇందులో పాయల్.. అందాలు ప్రదర్శిస్తూ బోల్డ్‌గా నటించింది. తొలి చిత్రంలోనే బోల్డ్‌గా కనిపించడంతో పాయల్ తెలుగులో సెన్సేషన్ అయ్యింది. దీంతో టాలీవుడ్లో ఈ భామ బోల్డ్ బ్యూటీ మార్క్ అందుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఆమె ఆశించిన స్థాయిలో హిట్స్ రాలేదు.
Payal Rajput (12)
దీంతో తెలుగులో పాయల్‌కు ఆఫర్స్ కరువయ్యాయి. చివరిగా మంగళవారం సినిమాలో నటించిన ఆమె ప్రస్తుతం ఆఫర్స్ కోసం కష్టపడుతుంది. ఈ క్రమంలో దర్శకనిర్మాతలకు ఆకట్టుకునేలా ఫోటోషూట్స్ చేస్తోంది.
Payal Rajput (13)
తాజాగా ఈ భామ ట్రెండీ వేర్లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇందులో క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం పాయల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.