Anupama Parameswaran: ప్రేమమ్ సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యి, అఆ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఈమె కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, మలయాళ భాషలలో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అనుపమ పరమేశ్వరన్ కథ ప్రాధాన్యత ఉంటే లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించడానికి కూడా వెనకాడరు. ఇప్పటికే ఇలా ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నాయి. తాజాగా పరదా(Parada) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
పరదా ఎంతో ప్రత్యేకం..
ఈ సినిమా ఆగస్టు 22వ తేదీ థియేటర్లలో విడుదల అయినప్పటికీ ఈ సినిమాకి అనుకున్న స్థాయిలో ఆదరణ లభించలేదని చెప్పాలి. అయితే ఈ సినిమాకు కొంతమంది పాజిటివ్ రివ్యూస్ ఇవ్వగా మరికొందరు నెగిటివ్ గా కామెంట్లు చేస్తూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇకపోతే తాజాగా చిత్ర బృందం థాంక్స్ మీట్ (Thanks Meet)కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా అనుపమ మాట్లాడుతూ తన సినీ కెరియర్ లోనే పరదా సినిమా చాలా ప్రత్యేకమని వెల్లడించారు.
లేడీ ఓరియంటెడ్ సినిమాలను ఎందుకు ప్రోత్సహించరు..
తాను ఏ కార్యక్రమానికి వెళ్లిన ముందుగా మీడియాకు, అభిమానులకు ధన్యవాదాలు చెబుతాను కానీ ఈసారి మాత్రం నా నిర్మాతకు ధన్యవాదాలు తెలుపుతున్నానని ఇలాంటి గొప్ప సినిమాలో నన్ను భాగం చేసినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అంటూ తెలియజేశారు. అయితే ఈ సినిమా విషయంలో చాలామంది పాజిటివ్ కామెంట్లు చేయగా మరి కొందరు సినిమాలో తప్పులను ఎత్తిచూపుతున్నారని వెల్లడించారు. పరదా ఒక ప్రయోగాత్మక సినిమా కేవలం సినిమాల విషయంలోనూ కాదు మన వ్యక్తిగత విషయంలో కూడా ఏదైనా ప్రయోగాత్మకంగా చేస్తే మిశ్రమ స్పందన లభిస్తుంది. కమర్షియల్ సినిమాలలో 1000 తప్పులు ఉన్నా కూడా ఎవరు వాటిని గుర్తించరు, తప్పు పట్టరు.
పరదా స్లో పాయిజన్ లాంటిది…
ఇలా మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలు వస్తే మాత్రం చిన్న తప్పులను కూడా బయట పెడుతూ ఉంటారని, ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలలో మేం పడిన కష్టాన్ని గుర్తిస్తే ఇలాంటి ఎన్నో కొత్త కంటెంట్ ఉన్న సినిమాలు మీ ముందుకు వస్తాయని అనుపమ ఈ సందర్భంగా కాస్త ఎమోషనల్ అవుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అలాగే డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల(Praveen Kandregula) మాట్లాడుతూ.. సినిమా అన్న తర్వాత చిన్న చిన్న తప్పులు ఉంటాయి. సెకండ్ హాఫ్ లో తప్పులు ఉన్నాయని నేను ఒప్పుకుంటున్నాను, అలాగే చెప్పుకోదగ్గ సన్నివేశాలు కూడా ఉన్నాయని చిన్న తప్పులతో మా సినిమాని కొట్టి పారేయొద్దని తెలియజేశారు. పరదా సినిమా అనేది ఒక స్లో పాయిజన్ లాంటిదని.. కచ్చితంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మలుపు తిరుగుతుంది అంటూ ఈయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: Yash’sToxic: యశ్ టాక్సిక్ కోసం రంగంలోకి హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్.. ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?