BigTV English

Maoist Surrender: ల్యాండ్ మార్క్ డే! 2 రోజుల్లో 258 మంది.. మావోయిస్టుల లొంగుబాటుపై అమిత షా ట్వీట్

Maoist Surrender: ల్యాండ్ మార్క్ డే! 2 రోజుల్లో 258 మంది.. మావోయిస్టుల లొంగుబాటుపై అమిత షా ట్వీట్
Advertisement

Maoist Surrender: మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ కమాండర్ మల్లోజుల వేణుగోపాల్ ఇటీవల లొంగిపోవడంతో ఒక కథ ముగిసిపోయింది. మావోయిస్టులను అంతం చేసే క్రమంలో ఆపరేషన్ ఖగార్ ఫైనల్ ఎపిసోడ్‌గా మారడంతో లొంగుబాట్లు పెరిగాయి. చర్చల్లేవ్.. చర్చించుకోవడాల్లేవ్.. కాల్పుల విరమణ అసలే లేవు అని కేంద్రం చెప్పడంతో కథ మొత్తం మారిపోయింది. ఇప్పుడు లొంగిపోయింది శాంపిల్ మాత్రమే.. రాబోయే రోజుల్లో 300 దాకా సరెండర్ అవుతారని అంటున్నారు. ఒకరి వెంట మరొకరు క్యూ కడతారు అంటున్నారు. ఇప్పటికే చాలా మంది లొంగిపోయారు.


తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. మొత్తం 170 మంది లొంగిపోయినట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఎక్స్‌లో పోస్టు చేశారు. గత రెండు రోజుల్లో 258 మంది లొంగిపోయినట్లు ఆయన తెలిపారు.

ఈ ఏడాది ఇప్పటివరకు చత్తీస్‌గఢ్‌లో వెయ్యిమందికి పైగా మావోస్టులు సరెండర్ అయ్యారు. తెలంగాణలో 404 మంది సరెండర్ అయ్యారు. నిన్న గచ్చిరోలిలో మల్లోజుల టీమ్‌తో కలిపితే 2000 మందిదాకా సరెండర్ అయ్యారు. ఇది మరిన్ని రోజుల్లో పెరుగుతుందంటున్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు రూ.2.5 లక్షల నుంచి 10 లక్షల ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ ర్యాంకు ఆధారంగా ఇస్తున్నారు. మూడేళ్ల వరకు రూ.10 వేల చొప్పున నెలవారి స్టైఫండ్ ఇస్తారు.
స్కిల్ ట్రైనింగ్, ఉద్యోగ ఉపాధి కల్పనలు, స్వయం ఉపాధి కోసం లోన్స్, హెల్త్ కేర్ రీహబ్ క్యాంపుల్లో 120 రోజులు మిగతా వారికి కావాల్సిన సపోర్టు ఇలాంటివి అన్ని అందిస్తోంది.


ఛత్తీస్‌గఢ్‌, నక్సల్ సరెండర్ పాలసీ, 2025లో రూ.50,000 ఆన్ ది స్పాట్ సహాయం. ర్యాంక్ బేస్డ్స్ రివార్డ్ రూ.3 లక్షల నుంచి 12 లక్షల దాకా ఇస్తున్నారు. తెలంగాణలో రూ.25,00 తక్షణ సాయం అందిస్తున్నారు. అలాగే వారి తలపై ఉన్న రివార్డ్‌లు ఆధారంగా కమిటీలు నిర్ణయం తీసుకుని ఆర్తిక సహాయం అందిస్తున్నాయి.

Also Read: నారా లోకేశ్ కామెంట్స్.. డీకే శివకుమార్ రిప్లై, బెంగళూరుకు సాటి లేదని వ్యాఖ్య

2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులను సమూలంగా నిర్మిస్తామని.. హోంత్రి అమిత్ షా ఇప్పటికే చాలా సార్లు ప్రకటించారు. అన్నట్లుగా ప్రత్యేక శిక్షణ పొందిన దళాలను రంగంలోకి దింపడంతో మావోస్టు పార్టీ తీవ్రంగా నష్టపోయింది. నంభాల కేశవరావు లాంటి వారు కూడా ఎన్ కౌంటర్‌లో లొంగిపోయారు.

Related News

Gujarat Ministers Resign: గుజరాత్ కేబినెట్ మొత్తం రాజీనామా.. ఎందుకంటే?

Bangalore News: నారా లోకేశ్ కామెంట్స్.. డీకే శివకుమార్ రిప్లై, బెంగళూరుకు సాటి లేదని వ్యాఖ్య

Delhi News: కోర్టు ప్రొసీడింగ్స్.. మహిళకు కిస్ ఇచ్చిన లాయర్, సోషల్‌మీడియాలో రచ్చ, వీడియో వైరల్

Maoists: ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన 27 మంది మావోయిస్టులు

Supreme Court: దీపావళి బాణాసంచా పేలుళ్ల పై.. సుప్రీం రూల్స్

Goa: తీవ్ర విషాదం.. గోవా మాజీ సీఎం కన్నుమూత

PM Shram Yogi Maan Dhan scheme: రూ.55 చెలిస్తే చాలు.. ప్రతీ నెలా 3 వేల రూపాయలు, ఆ పథకం వివరాలేంటి?

Big Stories

×