Chiranjeevi: ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ లో అద్భుతమైన ఆట తీరును కనబరిచి ఇండియా కప్ గెలవడానికి కృషి చేసిన క్రికెటర్ తిలక్ వర్మ (Tilak Varma)పేరు మారుమోగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్లో భాగంగా ఈయన అద్భుతమైన ఆట తీరును కనపరచడంతో ఎంతోమంది అభిమానులు ప్రముఖులు ఈయనని ప్రశంసిస్తూ అభినందనలు తెలియజేశారు. అయితే తాజాగా ఆసియా కప్ విజేత తిలక్ వర్మను మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఘనంగా సత్కరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు(Mana Shankara vara prasad Garu) సినిమా షూటింగ్ లొకేషన్ లోనే తిలక్ వర్మను కలవడం జరిగింది. తిలక్ వర్మ షూటింగ్ లొకేషన్లోకి వెళ్ళగానే చిరంజీవి గజమాలతో ఆయనను సత్కరించి అనంతరం కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ అనిల్ రావిపూడితో పాటు మెగాస్టార్ చిరంజీవి నిర్మాతలు సుస్మిత కొణిదెల, సాహుకారపాటి నయనతార (Nayanatara) వంటి వారు పాల్గొన్నారు. ఇలా చిరంజీవి తిలక్ వర్మను సత్కరిస్తూ మరింత ప్రోత్సాహం కల్పించారని చెప్పాలి. చిరంజీవి ఇతరులను ప్రోత్సహించడంలో ముందు వరుసలో ఉంటారని చెప్పాలి. ఏదైనా ఒక సినిమా మంచి సక్సెస్ అందుకున్న వారిని ఈయన సాధారణ ఇంటికి ఆహ్వానించి ఘనంగా సత్కరిస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే క్రికెటర్ తిలక్ వర్మకు సైతం ఘన సత్కారం చేశారు. ఇలా క్రికెట్ రంగంలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకుని ఆసియా కప్ ఫినాలేలో ఇండియా గెలవడానికి దోహదపడిన తిలక్ వర్మ మన తెలుగు కుర్రాడు కావటం విశేషం. తిలక్ వర్మ స్వస్థలం హైదరాబాద్ అనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం తిలక్ వర్మ మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ఈయన ప్రస్తుతం అనిల్ రావిపూడి(Anil Ravipudi) సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
ట్రెండింగ్ లో మీసాల పిల్ల సాంగ్..
ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో శరవేగంగా షూటింగ్ పనులను నిర్వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి మీసాల పిల్ల అంటూ సాగిపోయే పాటను విడుదల చేయగా ఈ పాటకు మంచి ఆదరణ లభిస్తుంది.. ఇక ఈ సినిమాకు స్వయంగా మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.. ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా కూడా పూర్తి చేశారు. ఈ సినిమా కూడా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది.. ఈ రెండు సినిమాలతో పాటు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, బాబి కొల్లుతో కొత్త సినిమాలకు కమిట్ అయిన సంగతి తెలిసిందే.. త్వరలోనే చిరంజీవి బాబి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది.
Also Read: Hathya Film: హత్య మూవీకి షాక్.. 5 కోట్ల పరువు నష్టం దావా