
Pragya Jaiswal Photos (Source: Instagram)
Pragya Jaiswal Latest Photos: సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న మల్టీ టాలెంటెడ్ నటులలో ప్రగ్యా జైస్వాల్ ఒకరు. కేవలం నటిగానే కాకుండా సింగర్ మరియు డాన్సర్ గా కూడా విపరీతమైన టాలెంట్ ఉంది.

Pragya Jaiswal Photos (Source: Instagram)
మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో జన్మించింది ప్రగ్యా. కాలేజ్ చదువుతున్న రోజుల్లోనే వివిధ రకాల అందాల పోటీల్లో పాల్గొనేది. ఆ తర్వాత మోడల్ గా ఎదిగి పలు అందాల పోటీల్లో అవార్డులు సాధించింది.

Pragya Jaiswal Photos (Source: Instagram)
ఎన్నో పాపులర్ బ్రాంచ్ కి అంబాసిడర్ గా చేసింది ప్రగ్య.టిట్టు ఎంబీఏ సినిమాతో హిందీ ఫిలిం ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఎక్కువ శాతం తెలుగు తమిళ్ సినిమాల్లోనే కనిపించింది.

Pragya Jaiswal Photos (Source: Instagram)
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన కంచె సినిమా ప్రగ్యాకు విపరీతమైన పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాలో సీత అనే పాత్రలో కనిపించింది ప్రగ్య. క్రిష్ జాగర్లమూడి ప్రజ్ఞా కోసం ఒక మంచి పాత్రను క్రియేట్ చేశాడు.

Pragya Jaiswal Photos (Source: Instagram)
ఆ తర్వాత తెలుగులో చేసిన సినిమాలేవి పెద్దగా వర్కౌట్ కాలేదు. మెగాస్టార్ చిరంజీవి సరసన సైరా సినిమాలో కూడా నటించారు. అయితే మంచి పేరు తీసుకొచ్చిన సినిమా మాత్రం బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ.

Pragya Jaiswal Photos (Source: Instagram)
ఆ సినిమాతో ప్రగ్య మంచి పేరు సాధించుకుంది. ఆ తర్వాత తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోయినా కూడా సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులను ఎప్పటికీ అలరిస్తూనే ఉంటుంది. కొద్దిసేపటి ఇంస్టాగ్రామ్ వేదికగా ఫొటోస్ అప్లోడ్ చేసింది ప్రగ్యా.

Pragya Jaiswal Photos (Source: Instagram)
ముఖ్యంగా రెడ్ కలర్ డ్రెస్ లో నెటిజన్స్ ను విపరీతంగా అలరిస్తుంది. చైనాటౌన్ లోని తన స్నేహితులతో పాటు పార్టీ వైబ్ లో ఉన్న ఫొటోస్ ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో అట్రాక్షన్ గా మారాయి.