E-Paper
Advertisement

Addanki Dayakar: చింత చచ్చినా పులుపు చావలేదు.. జూబ్లీలో ఓడినా కేటీఆర్ బలుపు తగ్గలేదు: అద్దంకి దయాకర్

Addanki Dayakar: చింత చచ్చినా పులుపు చావలేదు.. జూబ్లీలో ఓడినా కేటీఆర్ బలుపు తగ్గలేదు: అద్దంకి దయాకర్
Advertisement

Addanki Dayakar: బీఆర్‌ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ తీరుపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల నేపథ్యంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్‌లో ఓటర్లు కేటీఆర్‌ను చావు దెబ్బ కొట్టినా ఇంకా ఆయనలో బలుపు తగ్గలేదని.. చింత చచ్చినా పులుపు చావలేదని దయాకర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ విజయం కమలంను వాడిపోయేట్లు చేసిందని, గులాబీ రేకులను చింపేసిందని ఆయన అభివర్ణించారు. కేటీఆర్ ఒక్కడితోనే బీఆర్‌ఎస్ పతనం ఖాయమని దయాకర్ జోస్యం చెప్పారు.

2023 ఎన్నికల్లో వంద సీట్లు అన్నా ప్రజలు బొంద పెట్టినా, ఆ తరువాత పార్లమెంట్ ఎన్నికల్లో “గుండు సున్నా” వచ్చినా కేటీఆర్‌కు సిగ్గు, బుద్ధి రాలేదని ఆయన ఆరోపించారు. రాజకీయంగా పతనమైనా కేటీఆర్ తీరు మారలేదని పేర్కొన్నారు. కేసీఆర్‌ కళ్లకు కేటీఆర్, హరీశ్ రావు కృష్ణా-అర్జునుల్లా గంతలు కట్టారని కవిత అంటున్నారని ప్రస్తావిస్తూ, వారు కృష్ణా-అర్జునులు కాదని, దుర్యోధన-దుస్యాసనులని దయాకర్ ఘాటుగా విమర్శించారు.

Advertisement

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపుకు సహకరించిన అందరికీ అద్దంకి దయాకర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి “మాస్టర్ మైండ్‌”తో అన్ని తానై నడిపించిన తీరుకు నిదర్శనమని అన్నారు. సామాన్య కార్యకర్తగా సీఎం గెలిపించిన తీరును ప్రజలు హర్షిస్తున్నారని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రత్యేకమైందని, కాంగ్రెస్ పార్టీకి నష్టాన్ని కోరుకునే వాళ్లు ఓడిపోతుందని, ఐక్యత లోపించిందని ప్రచారం చేశారని, వాళ్లందరికీ ఈ గెలుపు సమాధానమని దయాకర్ స్పష్టం చేశారు.

కేసీఆర్ మాట్లాడిన మాటలు చాగంటి ప్రవచనాల్లా ఉంటాయని, వాటికి సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇస్తే మాత్రం బుతులా అని కేటీఆర్ అంటున్నారని దయాకర్ ప్రశ్నించారు. బీసీలు అంటే కేటీఆర్‌కు చులకన భావమని విమర్శించారు. కేటీఆర్ పై మాగంటి గోపీనాథ్ తల్లి చేసిన ఆరోపణలకు ఆయన సమాధానం చెప్పలేదని గుర్తుచేశారు. బీజేపీ-బీఆర్‌ఎస్ రాజకీయ మిత్రులుగా దేశం మొత్తానికి తెలుసని దయాకర్ అన్నారు. రేవంత్ రెడ్డి వస్తే బుల్డోజర్ వస్తుందని ప్రచారం చేశారని, కానీ బుల్డోజర్ వచ్చి కారును (బీఆర్‌ఎస్‌ను) ఈడ్చుకుంటూ పోయిందని ఎద్దేవా చేశారు. “దమ్ముంటే అరెస్ట్ చెయ్” అని కేటీఆర్ అంటున్నారని, దమ్ము ఎందుకు, పోలీసులకు చెప్తే చేస్తారని దయాకర్ బదులిచ్చారు. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పజెపితే అరెస్ట్ చేయమని ఎందుకు అడగట్లేదని ఆయన కేటీఆర్‌ను నిలదీశారు.

Advertisement

ALSO READ: Hindupur Ysrcp Office Attack: హిందూపురం వైసీపీ కార్యాలయంపై దాడి.. సీఎం చంద్రబాబు, బాలకృష్ణపై జగన్ సంచలన వ్యాఖ్యలు

Related News

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

Big Stories

Advertisement
×