E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu Day 69 : ఎవరు ఎవరిని ముంచారు ? ముద్దుబిడ్డతో పాటు కళ్యాణ్ కూ నాగ్ మొట్టికాయలు… నిఖిల్ పై డబుల్ ఎలిమినేషన్ బాంబు

Bigg Boss 9 Telugu Day 69 : ఎవరు ఎవరిని ముంచారు ? ముద్దుబిడ్డతో పాటు కళ్యాణ్ కూ నాగ్ మొట్టికాయలు… నిఖిల్ పై డబుల్ ఎలిమినేషన్ బాంబు
Advertisement

Bigg Boss 9 Telugu Day 69 : బిగ్ బాస్ సీజన్ 9లో 10వ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండడంతో వీకెండ్ ఎపిసోడ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆడియన్స్. అనుకున్నట్టుగానే నాగ్ మాస్ లుక్ లో ఎంట్రీ ఇచ్చి, ఒక్కో కంటెస్టెంట్ కి దిమ్మతిరిగేలా క్లాస్ పీకారు. శుక్రవారం ఎపిసోడ్లో గతవారం తనూజా కెప్టెన్సీ విషయంలో తాను వేసిన స్ట్రాటజీ గురించి మళ్ళీ డిస్కషన్ పెట్టింది దివ్య. ఇక భరణి ‘దివ్యను నాకు దూరంగా ఉండమని ఆమె తల్లి మాధురికి ఫోన్ చేసి చెప్పిందట. ఈ విషయాన్ని వెళ్తూ మాధురి సంజనకు చెప్పిందట. ఆమెకు చెప్పు’ అంటూ రాయబారం పంపే ప్రయత్నం చేశాడు భరణి. కానీ తనూజ అందుకు ఒప్పుకోలేదు.

ముద్దుబిడ్డకు స్పెషల్ క్లాస్

బిగ్ బాస్ ముద్దు బిడ్డ అంటూ ట్రోల్స్ ఎదుర్కొంటున్న తనూజాకు ఎట్టకేలకు నాగార్జున చేతిలో మొట్టికాయలు పడ్డాయి. డెమోన్ ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేయొద్దు అంటూ ఆమె అన్న వీడియో చూపించి మరీ ప్రశ్నించారు నాగార్జున. అయితే తనూజా మాత్రం “అతను చేసింది ఫోర్స్డ్ గా అన్పించింది, నేను అలా అనకపోయి ఉంటే డెమోన్ ఎత్తేవాడు కూడా” అంటూ తనను తాను సమర్థించుకుంది. కానీ నాగ్ ఆమె నోరు మూయిస్తూ ” దివ్య ఆర్డర్ చేయడం నీకు నచ్చకపోతే చెప్పు.  అంతేగానీ చిన్న చిన్న వాటిని భూతద్దంలో పెట్టి చూడొద్దు. హౌస్ లో ఆడా – మగా, సున్నితం వంటి తేడాలేమీ లేవు. అందరూ సమానమే. టాస్క్ లో డెమోన్ ను నువ్వు తోసింది కరెక్ట్ అయితే ఇది కూడా కరెక్ట్” అంటూ ఇచ్చిపడేశారు. అంతేకాదు ఆమె డెమోన్ ను బుట్టలో బాల్ టాస్క్ లో నెట్టేసిన వీడియోను ప్లే చేయగా… తాను అస్సలు నెట్టలేదని, మొదటి వీడియోలో మాత్రం తప్పు తనదేనని ఒప్పుకుంది. అయితే నిఖిల్ తాను కూడా డెమోన్ లాగే ఫీల్ అయినా బయటకు చెప్పలేదని ఒప్పుకున్నాడు.

Advertisement

తరువాత సుమన్ – సంజన ఆడిన టాస్క్ లో నువ్విచ్చిన తీర్పు కరెక్ట్ అనుకుంటున్నావా? అని కళ్యాణ్ ను అడిగారు నాగ్. కళ్యాణ్ కాన్ఫిడెంట్ గా ‘అవును’ అని సమాధానం ఇచ్చాడు. తనూజాను దీని గురించి ప్రశ్నించగా, ఆరోజు ఏం జరిగిందో క్లియర్ గా వివరించింది. దీంతో వీడియోను ప్లే చేసి, కళ్యాణ్ నిర్ణయమే కరెక్ట్ అని క్లారిటీ ఇచ్చారు నాగార్జున. కానీ తన నిర్ణయాన్ని తానే కరెక్ట్ గా చెప్పలేకపోవడంతో ఫెయిల్డ్ సంచాలక్ అంటూ అతని కత్తిని విరగ్గొట్టారు. అలాగే రీతూని ‘ఆఫ్ట్రాల్’ అన్నందుకు సంజనాను, ఆ టాస్క్ లో రూల్స్ మార్చినందుకు రీతూకు కూడా అక్షింతలు పడ్డాయి. మిగతా వాళ్ళను ముఖ్యంగా భరణి, సుమన్ శెట్టి, ఇమ్మూని ప్రశంసించారు నాగ్.

డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్ 

తరువాత నాగార్జున ‘ఎవరు ఎవరిని ముంచుతున్నారు తేల్చుతున్నారు’ అనే టాస్క్ ఇచ్చారు హౌస్ మేట్స్ కి. ఇమ్మూ తన వీక్నెస్ అంటూనే తేల్చేది సంజన, డెసిషన్ మేకింగ్ లో కష్టం తనూజా ముంచుతుందని చెప్పాడు. దివ్య సుమన్ తేలుస్తాడని, భరణి తన బలం, బలహీనత అని చెప్పింది. అలాగే కళ్యాణ్ తనూజా తనను గట్టెక్కిస్తుందని, సంజనతో పెద్దగా బాండింగ్ లేదని చెప్పాడు. తనుజా కళ్యాణ్ సపోర్టర్, భరణి బలహీనత… డెమోన్ తన బలం రీతూ, బలహీనత కళ్యాణ్… రీతూ తన బలం డెమోన్, బలహీనత తనూజా అని చెప్పింది. ఎక్కువ మంది కంటెస్టెంట్స్ సంజన ముంచుతుందని ఇవ్వడంతో ఆమెకు నాగార్జున బిగ్ బాంబ్ ఇచ్చారు. అందులో భాగంగా ఫ్యామిలీ వీక్ ను కట్ చేశారు. దీంతో సంజన తాను ఉండలేనని, ఇంటికి పంపించమని బోరున ఏడ్చింది. హౌస్ మేట్స్ ఆమెను ఓదార్చగా, నాగార్జున ఇది హౌస్ మేట్స్ డెసిషన్. కూల్ అవ్వు’ అని సముదాయించారు.

Advertisement

చివరగా బిగ్ బాంబు ఓపెన్ చేసి డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్ ఇచ్చారు నాగ్. అందులో భాగంగా ఫిష్ ట్యాంక్ లో రెడ్ కలర్ వాటర్ ఇచ్చి, దాంట్లో ఎల్లో కలర్లోకి ఎవరి వాటర్ మారకపోతే వాళ్ళే ఎలిమినేట్ అని అనౌన్స్ చేశారు. అయితే ఈరోజు నిఖిల్ ఎలిమినేట్ అయ్యాడు. రేపటి ఎపిసోడ్ లో మరో ఎలిమినేషన్ ఉంటుందని చెప్పారు.

Read Also : కమిషనర్ కూతురు హత్య… 5 రోజుల తరువాత బ్రతికొచ్చే అమ్మాయి… ఇంటెన్స్ తమిళ మిస్టరీ థ్రిల్లర్

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×